యూజీసీ నెట్ పరీక్ష వాయిదా... కారణం ఇదే! కొత్త షెడ్యూల్ త్వరలో...!

Header Banner

యూజీసీ నెట్ పరీక్ష వాయిదా... కారణం ఇదే! కొత్త షెడ్యూల్ త్వరలో...!

  Tue Jan 14, 2025 18:55        Others

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2024 సెషన్ పరీక్షలు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. జనవరి 3వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్ష జనవరి 16వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే బుధవారం (జనవరి 15) జరగవల్సిన పరీక్ష మాత్రం వాయిదా పడింది. సంక్రాంతి పండగ నేపథ్యంలో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్డీఏ) వెల్లడించింది. ఈ మేరకు పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ఎన్టీయే మంగళవారం (జనవరి 14) ప్రకటించింది. జనవరి 15న నిర్వహించవల్సిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఈ సందర్భంగా ఎన్టీయే తెలిపింది. ఇక జనవరి 16న జరగాల్సిన పరీక్ష యథాతథంగా నిర్వహిస్తామని స్పష్టం చేసింది. జనవరి 3, 6, 7, 8, 9, 10, 15, 16 తేదీల్లో యూజీసీ నెట్ పరీక్షలు జరుగుతాయి.



ఇంకా చదవండిఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!



అయితే పండుగల నేపథ్యంలో అభ్యర్థుల నుంచి పలు వినతులు రావడంతో జనవరి 15న జరిగే పరీక్షను వాయిదా వేసినట్లు ఎన్డీఏ వెల్లడించింది. మొత్తం 2 పేపర్లకు ఈ పరీక్ష జరుగుతుంది. మొత్తం 85 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 1 లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్ 2లో 100 ప్రశ్నలకు 200 మార్కులను కేటాయిస్తారు. 3 గంటల వ్యవధిలో పరీక్ష ఉంటుంది. పేపర్ 1లో రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైరెర్జంట్ థింకింగ్, జనరల్ అవేర్ననెస్పై ప్రశ్నలు ఉంటాయి. ఇక పేపర్ 2లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్ ప్రశ్నలు వస్తాయి. లాంగ్వేజెస్ మినహా మిగతా అన్ని క్వశ్చన్ పేపర్లు ఇంగ్లిష్, హిందీ మీడియంలో మాత్రమే వస్తాయి. రిజర్వ్డ్ కేటగిరీ వారికి 35 శాతం, అర్రిజర్వ్డ్ కేటగిరీకి 40 శాతం మార్కులు స్కోర్ చేయాల్సి ఉంటుంది.


ఇంకా చదవండిపులివెందుల డీఎస్పీ ను బహిరంగంగా బెదిరించిన జగన్! మా కార్యకర్తలపై కేసులు పెడతావా! తర్వాత మీ కథ ఉంటుంది!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

ఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్!

 

అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్‌!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!

 

వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!

 

వారెవ్వా.. ఆ జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి ఏ రేంజిలో ఉంటుందో..


ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #exam #notification #postponed #dates #declaration #todaynews #flashnews #latestupdate