రూ.20 వేలకు మించి లావాదేవీలు చేస్తున్నారా? డిజిటల్ పేమెంట్స్ పై కీలక ఆంక్షలను అమలు! వారిపై కఠిన చర్యలు..

Header Banner

రూ.20 వేలకు మించి లావాదేవీలు చేస్తున్నారా? డిజిటల్ పేమెంట్స్ పై కీలక ఆంక్షలను అమలు! వారిపై కఠిన చర్యలు..

  Tue Jan 14, 2025 08:00        Business

దేశంలో డిజిటల్ లావాదేవీల ప్రాముఖ్యత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా.. 2016లో పెద్ద నోట్ల రద్దు దేశ ప్రజలను నగదు వినియోగం నుండి డిజిటల్ పేమెంట్స్ వైపు మళ్లించడానికి కీలక అడుగు వేసేందుకు దోహదపడింది. అంతే కాకుండా.. జన్ ధన్ యోజన వంటి పథకాల ద్వారా ప్రతిఒక్కరికీ బ్యాంక్ ఖాతాలను అందుబాటులోకి తెచ్చారు. ఈ మార్పులు ప్రారంభంలో డిజిటల్ లావాదేవీలను గణనీయంగా పెంచాయి. కానీ.. తాజా పరిస్థితుల్లో నగదు వినియోగం మళ్లీ అధికమవుతోంది. ప్రజలను మళ్లీ డిజిటల్ పేమెంట్స్ వైపు తీసుకెళ్లేందుకు ఆదాయపన్ను శాఖ కీలక ఆంక్షలను అమలు చేయనుంది. అధిక మొత్తంలో నగదు లావాదేవీలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. పన్ను చట్టంలోని కొన్ని సెక్షన్ల కింద పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలకు 100 శాతం వరకు పెనాల్టీ విధించబడుతుంది. ప్రత్యేక నగదు పరిమితులు మరియు పెనాల్టీలు.. లోన్‌లు, డిపాజిట్‌లు, లేదా అడ్వాన్స్‌ల కోసం రూ.20,000 కంటే ఎక్కువ నగదును అందించరాదు.

 

ఇంకా చదవండి: జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

269SS సెక్షన్ ప్రకారం.. ఈ పరిమితిని అతిక్రమిస్తే, అంతే మొత్తం పెనాల్టీ పడుతుంది. బ్యాంకు నుంచి ఒకే రోజు రూ.2 లక్షలకు మించి నగదు ఉపసంహరణ చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ అలా చేస్తే.. 269ST సెక్షన్ కింద.. ఈ లావాదేవీపై 100 శాతం పెనాల్టీ ఉంటుంది. లోన్ లేదా డిపాజిట్ చెల్లింపులు రూ.20,000 లోపు మాత్రమే ఉండాలి.. నగదు రూపంలో చెల్లింపులు ఈ పరిమితిని దాటితే 269T సెక్షన్ కింద జరిమానా తప్పదు. వ్యాపారానికి సంబంధించిన నగదు లావాదేవీలు రూ.10,000 లోపు మాత్రమే.. 40A(3) సెక్షన్ ప్రకారం.. ఈ పరిమితికి మించి నగదు లావాదేవీలు చేస్తే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. 80G సెక్షన్ ప్రకారం.. నగదు రూపంలో రూ.2,000కి మించి విరాళాలు తీసుకుంటే టాక్స్ రిటర్న్స్‌లో క్లెయిమ్ చేయలేరు. పైగా.. జరిమానా విధించబడుతుంది. ప్రభుత్వ చర్యలు ప్రజలను నగదు వినియోగం నుండి డిజిటల్ వైపు మళ్లించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. యూపీఐ, కార్డుల ద్వారా చెల్లింపులు, మొబైల్ పేమెంట్ అప్లికేషన్లు వేగంగా అభివృద్ధి చెందాయి. అయితే నగదు వినియోగం తగ్గించాలంటే వీటిపై అవగాహన అనేది చాలా అవసరం.

 

ఇంకా చదవండి: పండగ వేళ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్! దరఖాస్తూలకు డేట్ ఫిక్స్ చేసిన కూటమి?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్!

 

అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్‌!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!

 

వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!

 

వారెవ్వా.. జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి రేంజిలో ఉంటుందో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #PhonePay #GooglePay #DigitalPayment #Government #NewRules