నలుగురు పిల్లలను పెంచితే భారీ బహుమతి...! అది ఎక్కడో తెలుసా?
Tue Jan 14, 2025 08:40 Othersమధ్యప్రదేశ్ లోని రాష్ట్ర కేబినెట్ మంత్రికి సమానమైన ర్యాంక్ ఉన్న ప్రభుత్వ బోర్డు అధిపతి తాజాగా సంచలన ప్రకటన చేశారు. పరశురామ్ కళ్యాణ్ బోర్డ్కు నాయకత్వం వహిస్తున్న పండిట్ విష్ణు రాజోరియా పరశురామ్ కనీసం కనీసం నలుగురు పిల్లలకు జన్మనివ్వమంటూ పిలుపునిచ్చారు. అంతేకాదు అలా నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన బ్రాహ్మణ దంపతులకు ఒక లక్ష రూపాయలను బహుమతిగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ వార్త కలకలం రేపుతోంది. పండిట్ విష్ణు రాజోరియా బ్రాహ్మణ సంస్థ అయిన పరశురామ్ కళ్యాణ్ బోర్డు నాయకత్వం వహిస్తున్నారు. మనం మన కుటుంబంపై దృష్టి పెట్టడం ఇటీవల మానివేశాం.. ఒక బిడ్డని కని ఆగిపోతోంది నేటి యువత. ఇది రానున్న కాలంలో మరింత సమస్యాత్మకంగా మారనున్నట్లు తాను గుర్తించానని రాజోరియా చెప్పారు. 'యువతపై తనకు చాలా ఆశలు ఉన్నాయి... వృద్ధుల నుంచి మనం పెద్దగా ఆశించలేము...భవిష్యత్తు తరాన్ని రక్షించే బాధ్యత యువతపై ఉంది. కనుక యువత నిర్వీర్యం కాకుండా ఉండాలంటే కనీసం నలుగురు పిల్లలు ఉండాలని.. అందుకనే తాను ఈ విధంగా ప్రకటన చేసినట్లు ఆయన ఇండోర్లో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. అంతేకాదు పరశురామ్ కళ్యాణ్ బోర్డ్ అధ్యక్షుడిగా తాను ఉన్నా లేకున్నా ఈ అవార్డ్ కొనసాగుతుందని రాజోరియా చెప్పారు. అంతేకాదు భవిష్యత్ తరాలను కాపాడాల్సిన భాద్యత మనదే అని భావించిన తాను ఈ ప్రకటనను వ్యక్తిగతంగా చేసినట్లు.. ఈ ఆలోచన ప్రభుత్వానికి కాదంటూ స్పష్టం చేశారు.
ఇంకా చదవండి: మీకు పీఎఫ్ ఖాతా ఉందా! ఫ్రీగా మీ అకౌంట్‌లోకి రూ.50 వేలు వచ్చేస్తాయి!
బ్రాహ్మణ సమాజం కట్టుబాట్లను అనుసరిస్తుంది.. పిల్లల భవిష్యత్ కోసం.. ఉన్నత స్థానంలో నిలిపేందుకు పిల్లలకు మంచి విద్య, శిక్షణ అందిస్తుంది ఆయన చెప్పారు. రాజోరియా వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు రాజోరియా ప్రకటనకు అధికార భారతీయ జనతా పార్టీ దూరంగా ఉండగా.. అది అతని వ్యక్తిగత అభిప్రాయం అని పేర్కొన్నారు కాంగ్రెస్ నేత ముఖేష్ నాయక్. అంతేకాదు ఆయన తాను చేసిన ప్రకనను విషయంలో “పునరాలోచించుకోవాలని” కోరారు. అంతేకాదు రాజోరియా తనకు మంచి స్నేహితుడు.. ప్రస్తుతం ప్రపంచంలో అతి పెద్ద సమస్య జనాభా పెరుగుదల అని ముఖేష్ చెప్పారు. పిల్లలు ఎంత తక్కువగా ఉంటే.. వారికీ మంచి విద్యను అందించడం సులభం అవుతుంది, "అని నాయక్ అన్నారు. భవిష్యత్ లో ముస్లింలు హిందువుల సంఖ్యను మించిపోతారనేది ఒక భ్రమ అంటూ నాయక్ అన్నారు. ఇలాంటివి ఊహలు మాత్రమే.. మనం ఐక్యంగా ఉన్నప్పుడే మన దేశం శక్తివంతం అవుతుంది” అని ఆయన పేర్కొన్నారు.
ఇంకా చదవండి: పండగ వేళ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్! దరఖాస్తూలకు డేట్ ఫిక్స్ చేసిన కూటమి?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమరావతి సచివాలయంలో కీలక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాత పరీక్షలు లేకుండానే ఎంపిక!
టాలీవుడ్ కి షాక్.. దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు... ఏ2గా విక్టరీ వెంకటేశ్! ఎందుకు అంటే!
మరో వివాదంలో చిక్కుకున్న తిరువూరు ఎమ్మెల్యే! వివరణ కోరిన సీఎం చంద్రబాబు!
క్రెడిట్ కార్డు బిల్లు కట్టడం పెద్ద సమస్య ఏమి కాదు! ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు!
పట్టణాల నుంచి పల్లెలకు వచ్చేవారు ఆ బస్సులను ఉపయోగించుకోండి...! చంద్రబాబు ప్రత్యేక ఆదేశాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #madhyapradesh #children #todaynews #flashnews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.