పండగ వేళ మందుబాబులకు కిక్ ఇచ్చే న్యూస్! మరోసారి భారీగా తగ్గిన బీర్లు, బ్రాందీ ధరలు..

Header Banner

పండగ వేళ మందుబాబులకు కిక్ ఇచ్చే న్యూస్! మరోసారి భారీగా తగ్గిన బీర్లు, బ్రాందీ ధరలు..

  Tue Jan 14, 2025 08:30        Politics

ఏపీలో మందుబాబులకు పండుగ సమయంలో గుడ్ న్యూస్ అందింది. మద్యం ధరలు తగ్గుముఖం పట్టాయి. కొత్త మద్యం విధానం అమలులో భాగంగా, కేవలం రూ.99కే క్వార్టర్ మద్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 16 కంపెనీలతో చర్చలు జరిపి ధరలు తగ్గించే చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు 10 కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించగా, తాజాగా మరో ఆరు కంపెనీలు ముందుకు రావడంతో మరిన్ని బ్రాండ్ల ధరలు కూడా తగ్గాయి. ముఖ్యంగా, కొన్ని ప్రముఖ బీర్ల ధరలు కూడా తగ్గాయి. దీంతో మందుబాబుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఎన్నికల సమయంలో తక్కువ ధరలకు నాణ్యమైన మద్యం అందిస్తామన్న హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా రూ.99కే క్వార్టర్ మద్యం విక్రయించబడుతోంది. ఈ ఆఫర్‌కు భారీ డిమాండ్ ఉండటంతో మరిన్ని కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల ధరలను తగ్గించేందుకు ముందుకు వచ్చాయి. తగ్గించిన ధరలతోనే మద్యం సరఫరా చేయడం ప్రారంభించారు. మద్యం కంపెనీలు తమ అమ్మకాలు పెంచుకోవడానికే ఈ ధరల తగ్గింపు వ్యూహాలను అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది.

 

ఇంకా చదవండి: జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

ప్రస్తుతం క్వార్టర్ సీసాలపై రూ.20 నుంచి రూ.80 వరకు తగ్గింపును అమలు చేస్తున్నారు. ఉదాహరణకు, మాన్సన్ హౌస్ కంపెనీ రూ.30 తగ్గించగా, అరిస్ర్టోకాట్ ప్రీమియం సుపీరియర్ విస్కీ ధర రూ.50 తగ్గింది. కింగ్‌ఫిషర్ బీరు రూ.10 తగ్గించగా, బ్యాగ్ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ ధర ఏకంగా రూ.80 తగ్గించేందుకు దరఖాస్తు చేసింది. మద్యం ధరల తగ్గింపుతో తక్కువ ధరలకు నాణ్యమైన మద్యం అందుబాటులోకి రావడంతో ప్రజల్లో మంచి స్పందన ఉంది. కానీ, కొందరు అధిక ధరలకు విక్రయాలు జరిపినా లేదా బెల్టు షాపులు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. తగ్గిన ధరల వల్ల మద్యం మార్కెట్‌లో కంపెనీల మధ్య పోటీ పెరిగింది. గతంలో భారీ కమిషన్ల ఆరోపణల కారణంగా కొందరు కంపెనీలకు అవకాశాలు దక్కలేదని చెబుతున్నారు. అయితే, కొత్త విధానంతో కంపెనీలు స్వచ్చందంగా ధరలు తగ్గించుకుంటున్నాయి. తక్కువ ధరల మద్యం వల్ల ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయం తగ్గుతుందనే వాదన ఉంది. అయితే, ధరల తగ్గింపుతో మందుబాబులు మాత్రం ఖుషీగా ఉన్నారు.

 

ఇంకా చదవండి: పులివెందుల డీఎస్పీ ను బహిరంగంగా బెదిరించిన జగన్! మా కార్యకర్తలపై కేసులు పెడతావా! తర్వాత మీ కథ ఉంటుంది!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

ఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్!

 

అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్‌!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!

 

వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!

 

వారెవ్వా.. జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి రేంజిలో ఉంటుందో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews