సంక్రాంతి గురించి మీకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందామా... ఆ రోజు ముఖ్యంగా ఇలా...

Header Banner

సంక్రాంతి గురించి మీకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందామా... ఆ రోజు ముఖ్యంగా ఇలా...

  Tue Jan 14, 2025 00:00        Wishes (శుభాకాంక్షలు)

సంక్రాంతి అనగా నూతన క్రాంతి . సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. మనకు పన్నెండు రాశులు ఉన్నాయి. ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన కాలెండరులో ప్రతినెలా ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది ఈ పండుగను నవ్యాంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్టాలలో ప్రముఖంగా జరుపుకుంటారు . ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారు. సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. అయితే మీకు తెలియని ఇంకొక విషయం ఎంతంటే కొన్ని ప్రాంతాలలో నాలగవ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. ఈ మూడు రోజులలో మొదటి రోజు బోగిమంటలతో, రెండవ రోజు పొంగలి, పిండివంటలతో, పితృ దేవతల, దేవుళ్ళ పూజలతో, మూడవ రోజు గో పూజలతో అలాగే మాంస ప్రియులకు మంచి కూరలతో, మూడురోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది. 

 

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గరి నుండి మొదలై, ఆ తరువాత సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనూ రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయణము. పన్నెండు నెలల కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్యకాలము అంటారు. కనుకనే ఉత్తరాయణము వరకూ ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు. 

 

"సంక్రాంతి" లేదా "సంక్రమణం" అంటే చేరుట అని అర్ధం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో "సంక్రాంతి"ని ఇలా వివరించారు - తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః - మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి - సూర్యుని చలనంలో (రధయాత్రలో) ఘట్టాలు నాలుగు. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని "సంక్రాంతి పండుగ"గా జరుపుకుంటారు. మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది. 

 

సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది. అందువలన సూర్యుడు ఆరు నెలలు ఉత్తరం వైపు ఆరు నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు. ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణం అంటారు. దక్షిణం వైపు కనిపించే క్రమం దక్షిణాయణం. మనకు ఒక సంవత్సరం కాలము అయితే దేవుళ్ళకు ఒక రోజు. ఈ ఉత్తరాయణమనేది అందుకే మనకు అంత ముఖ్యం.. ఈ రోజు కోసమే భీష్ముడు ఎదురుచూసి ఉత్తరాయణ పుణ్య ఘడియలలోనే తనువును చాలించాడు. 

 

మీకూ మీ కుటుంబ సభ్యులకూ ఆంధ్రప్రవాసి తరపున మకర సంక్రాంతి శుభాకాంక్షలు. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Wishes #Festivals #Sankranthi #Bhogi #India #Telugu