తిరుమల శ్రీవారి దర్శనానికి మోకాళ్లపై మెట్లు ఎక్కిన క్రికెటర్! సోషల్ మీడియాలో వైరల్!

Header Banner

తిరుమల శ్రీవారి దర్శనానికి మోకాళ్లపై మెట్లు ఎక్కిన క్రికెటర్! సోషల్ మీడియాలో వైరల్!

  Tue Jan 14, 2025 12:31        Others

టీమిండియా క్రికెటర్, వైజాగ్ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాడు. అలిపిరి కాలినడక మార్గంలో తిరుమలకు బయలు దేరిన నితీశ్ మోకాళ్ల పర్వతం దగ్గర మోకాళ్లపై మెట్లను ఎక్కాడీ యంగ్ క్రికెటర్. చాలామంది భక్తులు మోకాళ్ల పర్వతం దగ్గరకు రాగానే మోకాళ్లపై మెట్లను ఎక్కుతారు. ఇప్పుడు నితీశ్ కుమార్ రెడ్డి కూడా మోకాళ్లపై మెట్లను ఎక్కి తన మొక్కును తీర్చుకున్నాడు. శ్రీవారి నామస్మరణతో శ్రీవారి సన్నిధికి చేరుకున్న ఈ టీమిండియా క్రికెటర్ కు టీటీడీ పాలక బృందం ఘన స్వాగతం పలికింది. మంగళవారం (జనవరి 14) ఉదయం నితీశ్ శ్రీవారిని దర్శించుకున్నారు. నితీశ్ తిరుమల పర్యటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.



ఇంకా చదవండిఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!



ఈ సందర్భంగా నితీశ్ కుమార్ రెడ్డిని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. అతనితో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు పడ్డారు. కాగా విశాఖ పట్నానికి చెందిన నితీశ్ కుమార్ రెడ్డి ప్రతిష్ఠాత్మక బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో సత్తా చాటాడు. ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొని మెల్ బోర్న్ మైదానంలో సెంచరీ సాధించాడు. అంతేకాదు ఈ సిరీస్ లో భారీగా పరుగులు సాధించిన టాప్ బ్యాటర్ల జాబితాలో ఒకడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే త్వరలోనే ఇంగ్లండ్ తో జరిగే టీ20 సిరీస్ కు కూడా ఎంపికయ్యాడీ యంగ్ క్రికెటర్. ఈ నెల 22 నుంచి ఇంగ్లండ్ తో సిరీస్ ప్రారంభం కానుంది. మొత్తం 5 టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. దీంతో పాటు మూడు వన్డేల సిరీస్ కూడా జరగనుంది. ఆ తర్వాత ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ సమరం ప్రారంభం కానుంది.


ఇంకా చదవండిపులివెందుల డీఎస్పీ ను బహిరంగంగా బెదిరించిన జగన్! మా కార్యకర్తలపై కేసులు పెడతావా! తర్వాత మీ కథ ఉంటుంది!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

ఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్!

 

అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్‌!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!

 

వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!

 

వారెవ్వా.. ఆ జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి ఏ రేంజిలో ఉంటుందో..


ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #thirupathi #dharsanam #cricketer #todaynews #socialmedia #viral #flashnews #latestupdate