కనుమ పండుగ శుభాకాంక్షలతో... ఈ రోజు ప్రయాణాలు ఎందుకు చేయకూడదు? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి?

Header Banner

కనుమ పండుగ శుభాకాంక్షలతో... ఈ రోజు ప్రయాణాలు ఎందుకు చేయకూడదు? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి?

  Wed Jan 15, 2025 00:01        Wishes (శుభాకాంక్షలు)

సంక్రాంతి వరసలో వచ్చే చివరి పండగను కనుమ పండగ అంటారు దీన్నె పశువులు పండగ అని కూడా అంటారు. ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే ముగజీవులని ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ. పశుపక్షాదులకి గౌరవాన్ని సూచించే పండుగలా కనుమ ప్రసిద్ధి చెందింది. 

 

ఆ రోజు పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తోలుక పోయి, స్నానం చేయించి, లేదా ఈత కొట్టించి, ఇంటికి తోలుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను, పదునయిన కత్తితో బాగా చెలిగి వాటికి రంగులు పూస్తారు. మంచి కోడెలున్న వారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి. మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. అన్నింటికి కొత్త పగ్గాలు వేస్తారు. 

 

సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునఃప్రతిష్టించి ఊరులో ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగిలి పెడతారు. పొంగిలి అంటే కొత్త కుండలో, కొత్తా బియ్యం, కొత్త బెల్లం వేసి అన్నం వండడం. పొంగళ్లు తయారయిన తరువాత ఊరి చాకలి కాటమరాజు పూజ కార్యక్రమం ప్రారంబించి దేవుని ముందు పెద్ద తళిగ వేస్తారు. అనగా ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు. అప్పటికి పశు కాపరులందరూ ఊరి పశువులన్నింటిని అక్కడికి తోలుకొని వస్తారు. ఆ తర్వాత అందరు అక్కడ మిగిలిన తళిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకొని తమ కోళ్లను కోసుకొని పొంగళ్లను తీసుకొని తాపీగా ఇళ్ల కెళతారు. ఈ సందార్బంగా పెద్ద మొక్కున్న వారు పొట్టేళ్లను కూడా బలి ఇస్తారు.

 

కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అని ఎందుకు అంటారు?
దీనికి సమాధానం చాలామందికి తెలియదు. అయితే అసలు కారణం ఎంతంటే కనుమ ను పశువుల పండుగ అంటారు. సంవత్సరం మొత్తం పశువులు యజమానులకు సహాయకరంగా ఉంటాయి. అలాంటి పశువులకు ఒక గౌరవం ఈ పండుగ. పూర్వకాలంలో దూర ప్రయాణాలు చేయాలంటే అందరూ ఎద్దుల బండ్ల మీదనే వెళ్ళేవారు. అయితే కనుమ రోజు పశువులకు విశ్రాంతి ఈ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రయాణాలు చేసేవారు కాదట. కానీ ఇప్పుడు ఉన్న కాలంలో దీని వెనుక ఉన్న అసలు కారణం ఇదేనని ఎవరికీ తెలీదు.

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Wishes #Festivals #Sankranthi #Bhogi #India #Telugu #Kanuma