ప్రోటీన్లు ఎక్కువగా తీసుకున్నా ఆరోగ్యానికి ముప్పే! ఏవి ఎంత తీసుకోవాలి?

Header Banner

ప్రోటీన్లు ఎక్కువగా తీసుకున్నా ఆరోగ్యానికి ముప్పే! ఏవి ఎంత తీసుకోవాలి?

  Tue Jan 14, 2025 12:50        Health

ఆరోగ్యకరమైన జీవితానికి ఆహారంలో తగినన్ని ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలనే విషయం తెలిసిందే. దీంతో చాలామంది ప్రొటీన్లు మంచివని ఆహారంతోపాటు ఎలాంటి సూచన లేకుండానే సప్లిమెంట్లు, ప్రొటీన్‌ పదార్థాలను ప్రత్యేకంగా తీసుకుంటున్నారు. అయితే, ప్రొటీన్లు తక్కువైతే ఆరోగ్యానికి ఎంత ముప్పు ఉంటుందో… ఎక్కువైనా అంతే సమస్య! కాబట్టి, రోజువారీ ఆహారంలో ప్రొటీన్లు ఎంత మోతాదులో ఉండాలో తెలుసుకుంటే మంచిది. 

 

ఆరోగ్యంగా ఉన్న పెద్దలు తమ శరీర బరువులో ఒక కిలోగ్రాముకు 0.75 నుంచి 0.80 గ్రాముల (ఒక గ్రాము కంటే తక్కువే) ప్రొటీన్లు తీసుకోవాలనేది నిపుణుల అభిప్రాయం. సుమారుగా చెప్పాలంటే రోజుకు పురుషులైతే 55 గ్రాములు, స్త్రీలు 45 గ్రాముల ప్రొటీన్లు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అయితే… వయసు, లింగం, శారీరక శ్రమ, ఆరోగ్య స్థితి మీద ఈ లెక్క ఆధారపడి ఉంటుంది. అథ్లెట్లు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు వైద్యుల సూచన మేరకు వారికి తగిన మోతాదులో ప్రొటీన్లు తీసుకోవాలి.

 

ఇంకా చదవండిఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్! 

 

ఇంకా చదవండిపండగ వేళ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్! దరఖాస్తూలకు డేట్ ఫిక్స్ చేసిన కూటమి?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇక రోజువారీగా ప్రొటీన్ల ద్వారా 10 నుంచి 35 శాతం క్యాలరీలు లభించాలి. ఈ మోతాదు దాటితే ఊబకాయం, కిడ్నీ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ మధ్యకాలంలో ప్రొటీన్‌ పదార్థాలు, సప్లిమెంట్ల వాడకం కూడా పెరిగింది. ముఖ్యంగా యువతరంలో ఈ ధోరణి కనిపిస్తుంది. అయితే, నిపుణుల సూచన లేకుండా ప్రొటీన్‌ సప్లిమెంట్లు వాడకూడదు. సరైన మోతాదులో తీసుకోకపోతే శరీరంలో ఎలక్ట్రోలైట్‌ అసమతుల్యత, కిడ్నీ సమస్యలు, కండరాల సమస్యలు, మలబద్ధకం, జీవక్రియలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతాయి.

 

కాబట్టి ప్రొటీన్‌ సప్లిమెంట్ల మీద ఆధారపడే బదులు రోజువారీ ఆహారం నుంచే తగినన్ని ప్రొటీన్లు దొరికేలా చూసుకోవాలి. తాజా కూరగాయలు, పండ్లు, గింజలు, చిక్కుడు జాతి గింజలు, టోఫు, సోయాబీన్‌, చేపలు, పాల ఉత్పత్తులు, ముతక ధాన్యాలు ప్రొటీన్ల గనులు. మంచి ఆహారం తీసుకోవడం ద్వారా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్‌!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!

 

వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!

 

వారెవ్వా.. ఆ జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి ఏ రేంజిలో ఉంటుందో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Health #Foods #Diet #Proteins #Diet