లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలి.. చంద్రబాబుకు టీడీపీ నేత రిక్వెస్ట్!

Header Banner

లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలి.. చంద్రబాబుకు టీడీపీ నేత రిక్వెస్ట్!

  Sun Jan 19, 2025 08:00        Politics

ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి లోకేశ్‌ని ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలని శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మైదుకూరు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆయన కోరారు. రాష్ట్రాభివృద్ధి కోసం లోకేశ్ చేస్తున్న కృషిని గుర్తించాలని ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. అన్ని రకాలుగా యువతను పోత్సహించే విధంగా ఐటీ, పారిశ్రామిక రంగాలకు చెందిన అనేక పరిశ్రమలను ఏపీకి తెచ్చేందుకు లోకేశ్ విశేష కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో పార్టీకి, యువతకు భరోసా ఇవ్వాలంటే లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలంటూ సీఎం చంద్రబాబు ఎదుట శ్రీనివాసరెడ్డి ప్రతిపాదనలు పెట్టారు.

 

ఇంకా చదవండి: రోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినండి! రోజంత‌టికీ కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది!

 

కాగా, కడప జిల్లా మైదుకూరులో నిన్న(శనివారం) నిర్వహించిన ‘‘స్వేచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌’’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. నదుల అనుసంధానం ద్వారా కరవు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఏపీ జీవనాడని, రెండేళ్లల్లో దాన్ని పూర్తి చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమకు గోదావరి నీటిని తీసుకువస్తామని, సీమ రైతులు మీసం తిప్పేలా చేస్తానని సీఎం చెప్పారు. వేంకటేశ్వరస్వామి పాదాల వరకూ గోదావరి నీటిని తీసుకువస్తామని, బనకచర్లకు నీళ్లు తీసుకురావడం తన జీవిత ఆశయమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కడప స్టీల్‌ప్లాంట్‌, కొప్పర్తి ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ త్వరలోనే పూర్తి చేసి ఉపాధి అవకాశాలు పెంచుతామని హామీ ఇచ్చారు. జనవరి చివరికల్లా వాట్సాప్‌ గవరెన్స్‌ తీసుకొస్తామని, గండికోటను టూరిజం హబ్‌గా చేస్తామని తెలిపారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వ నుంచి బిగ్ అప్‌డేట్! ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! బీజేపీ లోకి జంప్ అయిన కీలక నేత!

 

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై టీడీపీ అధిష్ఠానం ఫైర్..! విషయం ఇదే..!

 

ఏపీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు! దేశంలోనే తొలి ప్రైవేట్ వెహికల్ పార్క్! 1200 ఎకరాల్లో!

 

ఆ విషయంలో కేంద్రనిదే చారిత్రాత్మకమైన నిర్ణయం! విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త దశలోకి!

 

'0' అక్షరంతో ప్రారంభమయ్యే ఏకైక దేశం! అది ఏదో తెలిస్తే పకా షాక్!

 

రికార్డులు సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా టీడీపీ కార్యకర్తలకే సాధ్యం! ఎవరితో అయినా పెట్టుకోవచ్చు - టీడీపీతో అయితే కష్టమే!

 

జగన్‌కు పుత్రికోత్సాహం - మమ్మల్ని గర్వపడేలా చేశావంటూ ట్వీట్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting