గోవాలో విషాదం! పారాగ్లైడింగ్ చేస్తూ లోయలో పడి టూరిస్ట్, ఇన్‌ స్ట్రక్టర్‌ దుర్మరణం!

Header Banner

గోవాలో విషాదం! పారాగ్లైడింగ్ చేస్తూ లోయలో పడి టూరిస్ట్, ఇన్‌ స్ట్రక్టర్‌ దుర్మరణం!

  Sun Jan 19, 2025 11:09        India

సరదాగా గడిపేందుకు గోవా వెళ్లిన మహారాష్ట్ర మహిళ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకుంది. పారాగ్లైడింగ్ చేస్తూ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆ మహిళతో పాటు పారాగ్లైడింగ్ ఇన్ స్ట్రక్టర్ కూడా అక్కడికక్కడే చనిపోయాడు. నార్త్ గోవాలోని కేరి గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుందీ దారుణం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పూణేకు చెందిన శివానీ దాబ్లే గోవా పర్యటనకు వచ్చింది. శనివారం సాయంత్రం పారాగ్లైడింగ్ కోసం కేరి గ్రామ సమీపంలోని ఓ కొండపైకి వెళ్లింది. 

 

ఇంకా చదవండిరోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినండి! రోజంత‌టికీ కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది! 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆమెతో పాటు పారాగ్లైడింగ్ కంపెనీకి చెందిన ఇన్ స్ట్రక్టర్ సుమల్ నేపాలీ కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి పారాగ్లైడింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. కొండ పైనుంచి గాల్లోకి ఎగిరిన కాసేపటికే పట్టుతప్పి ఇద్దరూ కింద లోయలో పడ్డారు. దీంతో తీవ్రగాయాలపాలైన శివాని, సుమల్ ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. కాగా, పారాగ్లైడింగ్ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేవని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు వివరించారు. కంపెనీ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు వివరించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వ నుంచి బిగ్ అప్‌డేట్! ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! బీజేపీ లోకి జంప్ అయిన కీలక నేత!

 

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై టీడీపీ అధిష్ఠానం ఫైర్..! విషయం ఇదే..!

 

ఏపీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు! దేశంలోనే తొలి ప్రైవేట్ వెహికల్ పార్క్! 1200 ఎకరాల్లో!

 

ఆ విషయంలో కేంద్రనిదే చారిత్రాత్మకమైన నిర్ణయం! విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త దశలోకి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #India #Goa #Paragliding #Adventure #Hills