వారికి ప్రభుత్వం భారీ శుభవార్త! వందే భారత్‌లో ఉచిత ప్రయాణం! ఎలాగో తెలుసా?

Header Banner

వారికి ప్రభుత్వం భారీ శుభవార్త! వందే భారత్‌లో ఉచిత ప్రయాణం! ఎలాగో తెలుసా?

  Sun Jan 19, 2025 10:28        Travel

భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీతో పాటు చాలా రకాల ప్రోత్సాహకాలు అందుతాయి. ఇందులో ‘లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్‌’ ఒకటి. దీనికి సంబంధించి ప్రభుత్వం, ఉద్యోగులకు ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎల్‌టీసీలో భాగంగాప్రయాణించే ట్రైన్‌ కేటగిరీల్లో ప్రీమియం రైళ్లను సైతం చేర్చింది.

 

ఇక నుంచి ఉద్యోగులకు తమ ఫ్యామిలీతో పాటు హమ్‌సఫర్‌, వందేభారత్‌, తేజస్‌ వంటి లగ్జరీ రైళ్లలో కూడా ప్రయాణించవచ్చు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ రైళ్లతో పాటు రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియం ట్రైన్లలో మాత్రమే ప్రయాణించేందుకు వీలుండేది. 

 

వివిధ ఆఫీసులు, వ్యక్తుల నుంచి వచ్చిన సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌’ వెల్లడించింది. ప్రీమియం రైళ్లను LTC కింద అనుమతించాలని చాలా మంది నుంచి రిక్వెస్ట్‌లు అందినట్లు తెలిపింది. ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎక్స్‌పెండీచర్‌’తో చర్చించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో ఇక నుంచి అర్హతగల ఉద్యోగులంతా ఆయా రైళ్లలో ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. 

 

ఇంకా చదవండిరోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినండి! రోజంత‌టికీ కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది! 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్‌ అంటే ఏంటి?
ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబాలతో కలిసి దేశవ్యాప్తంగా పర్యటించేందుకు ఇచ్చే వెసులుబాటే లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్. అందులో భాగంగా ప్రయాణ ఛార్జీలతో పాటు ఇతరత్రా ఖర్చులను రీయింబర్స్‌ చేస్తారు. నాలుగేళ్లలో ఒకసారి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. పైగా పర్యటనకు వెళ్లిన రోజులను పెయిడ్‌ లీవ్‌గా పరిగణిస్తారు. పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే సంబంధిత శాఖలో బిల్లులు సమర్పించి రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఫ్యామిలీతో కలిసి ఉద్యోగులు హాలిడేస్‌ను ఎంజాయ్‌ చేయాలనే లక్ష్యంతోనే ఈ LTC సౌకర్యాన్ని తీసుకొచ్చారు.

 

విమానా ప్రయాణాలు చేయవచ్చా?
కేవలం రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే మాత్రమే LTC క్లెయిమ్‌ చేసుకోవచ్చనుకుంటే పొరపాటే. అర్హత గల ఉద్యోగులు విమానాల్లో కూడా ప్రయాణించే వెసులుబాటును ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకు అయిన ఖర్చును కూడా రీయింబర్స్‌ చేస్తారు. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్‌, అండమాన్‌ నికోబార్‌ వంటి ప్రాంతాలకు 2026 సెప్టెంబరు 25లోపు విమానంలో వెళితే టికెట్‌ ధరలో కొంత రాయితీ ఇస్తామని DoPT స్పష్టం చేసింది.

 

LTC నిబంధనలు ఇలా
LTC వెసులుబాటు కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఉంటుంది. వారి తరఫున వేరేవాళ్లు ప్రయాణించి బిల్లులు క్లెయిమ్‌ చేసుకుంటామంటే కుదరదు. భారత్‌కు చెందిన భూభాగంలో మాత్రమే పర్యటించాల్సి ఉంటుంది. విదేశీ యాత్రలకు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వరు. ఫ్యామిలీ అంటే ఉద్యోగి జీవిత భాగస్వామి, ఉద్యోగిపై ఆధారపడిన పెళ్లికాని ఇద్దరు పిల్లలు, ఇద్దరు గ్రాండ్‌ చిల్డ్రన్‌, తల్లిదండ్రులు మాత్రమే. పనిచేస్తున్న ప్రదేశం నుంచి హోమ్‌టౌన్‌కు రెండేళ్లకు ఒకసారి ఎల్‌టీసీని క్లెయిమ్‌ చేసుకోవచ్చు. 

 

అలాగే ఇతర ప్రాంతాలకైతే నాలుగేళ్లకొకసారి ఈ సౌకర్యం ఉంటుంది. ప్రయాణించే ప్రాంతం, ఉద్యోగి హోదా, ప్రయాణ మాధ్యమం, క్లాస్‌ను బట్టి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ నిబంధనలకు అనుగుణంగా చెల్లింపులు వర్తిస్తాయనే విషయాన్ని మర్చిపోవద్దు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వ నుంచి బిగ్ అప్‌డేట్! ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! బీజేపీ లోకి జంప్ అయిన కీలక నేత!

 

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై టీడీపీ అధిష్ఠానం ఫైర్..! విషయం ఇదే..!

 

ఏపీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు! దేశంలోనే తొలి ప్రైవేట్ వెహికల్ పార్క్! 1200 ఎకరాల్లో!

 

ఆ విషయంలో కేంద్రనిదే చారిత్రాత్మకమైన నిర్ణయం! విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త దశలోకి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Travel #India #Train #TrainTravel #IRCTC