తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్! ఈ నెల 23 నుంచి దర్శన టోకెన్లు ఉచితంగా!

Header Banner

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్! ఈ నెల 23 నుంచి దర్శన టోకెన్లు ఉచితంగా!

  Wed Jan 22, 2025 07:49        Devotional

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టీటీడీ గతంలో మాదిరిగానే జనవరి 23వ తేదీ నుంచి ఏ రోజుకు ఆ రోజు ఎస్‌ఎస్‌డీ టోకెన్లను అందించనుంది. ఈ టోకెన్లను భక్తులు అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వద్దనున్న విష్ణు నివాసం, బస్టాండ్ వద్దనున్న శ్రీనివాసం కౌంటర్లలో గతంలో మాదిరిగానే ఎస్‌ఎస్‌డీ టోకెన్లను పొందవచ్చని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. 

 

తిరుమల శ్రీవారి సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇవ్వకుండా నేరుగా క్యూలైన్లలోకి అనుమతిస్తోంది టీటీడీ. అయితే ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు టికెట్లు, టోకెన్లు కలిగిన భక్తుల్ని మాత్రమే వైకుంఠద్వార దర్శనం కల్పించిన సంగతి తెలిసిందే. వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో.. దూరప్రాంతాల నుంచి వచ్చిన సామాన్య భక్తులు స్వామివారి దర్శనం లభించలేదు. ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనాలు ముగియడంతో.. మళ్లీ వారంతా తిరుమలకు వస్తున్నారు. దీంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. భక్తుల రద్దీ తగ్గేవరకు సర్వదర్శనం భక్తులను నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లోకి అనుమతిస్తున్నారు. తాజాగా ఈ నెల 23 (గురువారం తెల్లవారుజాము) నుంచి ఏరోజుకారోజు సర్వదర్శనం టోకెన్ల పంపిణీని పునఃప్రారంభించనున్నట్లు టీటీడీ తెలిపింది. 

 

ఇదిలా ఉంటే.. గతంలోలా టోకెన్లు లేకుండా తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి వచ్చే భక్తులను అనుమతించడంపై.. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో అధికారులు చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కౌంటర్ల దగ్గర తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని కీలకమైన సూచనలు చేసిన సంగతి తెలిసిందే. తిరుపతిలో దర్శనం టోకెన్లు ఇవ్వకుండా తిరుమలలోనే నేరుగా స్వామివారి దర్శనానికి అనుమతించడంపై పరిశీలించాలని సూచనలు చేశారు. ఒకవేళ భక్తుల్ని నేరుగా సర్వదర్శనానికి అనుమతిస్తే ఎదురయ్యే పరిస్థితులపై టీటీడీ ఉన్నతాధికారులు చర్చించినట్లు సమాచారం. ఈ అంశంపై టీటీడీ అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అమూల్యమైన సేవలందించిన శ్రీమాన్ గౌరి పెద్ది రామసుబ్బశర్మ వంటి మహానుభావుల జీవితాలను, వారు చేసిన కృషి, వారి జీవనం యువతకు స్ఫూర్తిదాయకమని ప్రముఖ శతవధాని శ్రీ భ‌ర‌త్ శ‌ర్మ చెప్పారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో మంగ‌ళ‌వారం శ్రీ గౌరి పెద్ది రామసుబ్బశర్మ 34వ వర్ధంతి సభ ఘనంగా జరిగింది. 

 

ఈ సంద‌ర్బంగా తిరుప‌తికి చెందిన శ్రీ భ‌ర‌త్ శ‌ర్మ “ సాహితీ శిఖ‌రం – శ్రీ‌ గౌరిపెద్ది ” అనే అంశంపై ఉపన్యసించారు. రత్నంను గుర్తించాలంటే రత్నంను పరీక్షించడం తెలిసిన వాడై ఉండాలన్నారు. అదేవిధంగా శ్రీవారికి పరమ భక్తుడైన అన్నమాచార్యులవారు గానం చేసిన పద కవితలను విశ్లేషించి, శ్రీవారి భక్తుడైన గౌరిపెద్ది రామసుబ్బశర్మ పరిష్కరించారన్నారు. అన్నమాచార్యులవారు గానం చేసిన సంకీర్తనలను గౌరిపెద్ది వారు స్పష్టంగా తెలియజేశారని వివరించారు.

 

“ శ్రీ గౌరిపెద్ది – అన్నమయ్య కీర్తనల ప‌రిష్క‌ర‌ణ ” అనే అంశంపై తిరుప‌తికి చెందిన ప్రముఖ శతవధాని ఆముదాల ముర‌ళి ప్రసంగించారు. అద్భుతమైన సాహితీ సృజన చేసిన ప్రముఖులలో శ్రీ గౌరి పెద్ది ఒకరని అన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలు 27 సంపుటలు పరిష్కరించడంలో గౌరి పెద్ది వారు విశేష కృషి చేశారన్నారు. భారత, భాగవత, పురాణ ఇతిహాసాలను అపూర్వ సాహిత్యంతో అందించిన సంకీర్తనలను గౌరపెద్ది రామసుబ్బశర్మ మనకు అందించారని వివరించారు. అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు శ్రీ రాజ‌గోపాల రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ గౌరి పెద్ది వెంకట భగవాన్, ప్రోగ్రాం అసిస్టెంట్ కోకిల‌, ఇతర అధికారులు, పురప్రజలు పాల్గొన్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాల‌కృష్ణ‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

  

వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..

 

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

 

దావోస్ లో ఎన్నారై టీడీపీ సభ్యులతో చంద్రబాబులోకేష్ మీట్ అండ్ గ్రీట్! 20 దేశాల నుంచి... ఆనందంలో ఎన్నారైలు!

 

నారా లోకేష్ డిప్యూటీ సిఎం పదవి డిమాండ్ల పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం! కీలక ఆదేశాలు జారీ!

 

టాలీవుడ్ కి గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలపై కీలక నిర్ణయం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Devotional #Tirumala #TTD #Tirupati