టీమిండియా జెర్సీలపై పాకిస్తాన్ పేరు.. ఛాంపియన్స్ ట్రోఫీ వేళ షాక్..!

Header Banner

టీమిండియా జెర్సీలపై పాకిస్తాన్ పేరు.. ఛాంపియన్స్ ట్రోఫీ వేళ షాక్..!

  Wed Jan 22, 2025 14:05        Sports

ఫిబ్ర‌వ‌రి 19 నుంచి పాకిస్థాన్‌, దుబాయ్‌ వేదికలుగా జరగాల్సి ఉన్న ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో మరో వివాదం తెర‌పైకి వ‌చ్చింది. భారత జట్టు ధరించే జెర్సీలపై ఆతిథ్య దేశం పాకిస్థాన్ పేరు ఉండటాన్ని బీసీసీఐ నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఐసీసీ టోర్నీలలో భాగంగా ఆతిథ్య దేశపు పేరు, లోగోను జెర్సీపై ముద్రించడం ఆనవాయతీ. కానీ, బీసీసీఐ మాత్రం తాము ఆడేది దుబాయి వేదిక‌గా క‌నుక పాకిస్థాన్ పేరును త‌మ ఆట‌గాళ్ల జెర్సీల‌పై ముద్రించ‌బోమ‌ని చెబుతున్న‌ట్లు స‌మాచారం. ఈ వివాదంపై తాజాగా ఐసీసీ స్పందించింది. ఛాంపియ‌న్స్ ట్రోఫీ నిబంధ‌న‌ల‌ను అన్ని దేశాలూ పాటించాల్సిందేన‌ని సంబంధిత వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి. "టోర్నమెంట్ లోగోను తమ జెర్సీలపై ముద్రించ‌డం ప్రతి జట్టు బాధ్యత. అన్ని జట్లూ ఈ నియమానికి కట్టుబడి ఉండాలి" అని ఐసీసీ అధికారి ఒక‌రు చెప్పిన‌ట్లు ఏ-స్పోర్ట్స్ పేర్కొంది. 

 

ఇంకా చదవండి: డిప్యూటీ సీఎం పదవిపై లోకేశ్ తొలి స్పందన! ఆ ఛానల్ ప్రతినిధి ప్రశ్న..

 

ఆటగాళ్ల కిట్‌పై ఛాంపియన్స్ ట్రోఫీ లోగో, ఆతిథ్య దేశం పాకిస్థాన్ పేరుతో కనిపించకపోతే భారత జట్టుపై కఠిన చర్యలు తీసుకోవచ్చని అపెక్స్ బోర్డు పేర్కొంది. ఐసీసీ నిబంధనల ప్రకారం, మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతున్నాయనే దానితో సంబంధం లేకుండా జెర్సీలపై జట్లకు ఆతిథ్యం ఇచ్చేవారి పేరు రాయాల‌ని తెలిపింది. ఇదిలాఉంటే... గత కొన్ని నెలలుగా బిసీసీఐ, పీసీబీ మధ్య చాలా ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తమ జట్టును పాకిస్థాన్‌కు పంపడానికి భారత బోర్డు నిరాకరించ‌డం, చివరికి ఈ విషయంపై ఐసీసీ రాజీ కుద‌ర్చ‌డంతో హైబ్రిడ్ మోడ‌ల్‌లో టోర్నీ నిర్వాహ‌ణ‌కు పాక్ అంగీక‌రించ‌డం జ‌రిగాయి. అయితే, భవిష్యత్తులో భారత్ ఆతిథ్యం ఇచ్చే ఐసీసీ టోర్నీల‌కు కూడా దాయాది దేశం మ‌న ద‌గ్గ‌ర‌కు రాకుండా త‌ట‌స్థ వేదిక‌లోనే ఆడ‌నుంది. అలాగే బీసీసీఐ కొన్ని అద‌న‌పు రుసుములు కూడా చెల్లించాల్సి ఉంటుంది.

 

ఇంకా చదవండి: బిగ్ అలర్ట్.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అలా చేయకుంటే పెన్షన్ రద్దు?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తెలుగు సినీ నిర్మాతల ఇళ్లు, ఆఫీసుల్లో హై టెన్షన్! రెండో రోజు ఐటీ సోదాలు!

 

జనసేనానికి భారీ శుభవార్త చెప్పిన ఎన్నికల సంఘం! పార్టీ శ్రేణుల్లో పండగ వాతావరణం!

 

నేషనల్ హైవేలపై దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం! తాజాగా రూ.5,417 కోట్లతో... ఈ రూట్ లోనే!

 

నేడు (22/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

నల్గొండలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే పై దాడి! తమపై ఆయుధాలతో..

 

రూ.10 వేల పెట్టుబడితో 17 ల‌క్ష‌ల ఆదాయం! పోస్ట్ ఆఫీస్ బ్యాంక్‌లో అదిపోయే స్కీమ్‌!

 

జగన్ పాలనలో జరిగిన అరాచకాలు బయటకు.. సీ పోర్టు విషయంలో కొంప కొల్లేరు! సీఐడీ ఎంక్వైరీ.. ఇక జైల్లో ఊచలు!

 

ఓరి దేవుడా.. తస్మా జాగ్రత్త.. మందులోకి మంచింగ్ గా.. ఈ ఐదు పదార్థాలు తింటే మీ పని అంతే!

 

ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాల‌కృష్ణ‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

 

నేడు (21/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..

 

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

 

దావోస్ లో ఎన్నారై టీడీపీ సభ్యులతో చంద్రబాబు, లోకేష్ మీట్ అండ్ గ్రీట్! 20 దేశాల నుంచి... ఆనందంలో ఎన్నారైలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia