దుర్గ గుడి ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత! ఆచారంలో తీరని లోటు!

Header Banner

దుర్గ గుడి ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత! ఆచారంలో తీరని లోటు!

  Wed Jan 22, 2025 15:30        Others

ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకులు లింగంభొట్ల బద్రీనాథ్ బాబు కన్నుమూశారు. బుధవారం తెల్లవారు జామున బద్రీనాథ్ బాబు తన ఇంట్లోనే గుండెపోటుతో మృతి చెందారు. చాలా ఏళ్లుగా ఆయన దుర్గగుడి ప్రధాన అర్చకులుగా ఉన్నారు. బద్రీనాథ్ బాబు మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దుర్గ గుడి ప్రధాన అర్చకులు లింగంభొట్ల బద్రీనాథ్ బాబు మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!



'శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ప్రధాన అర్చకులు బద్రీనాథ్ బాబు అకాల మరణం ఎంతో బాధాకరం. వారి అకాలమరణం తీరని లోటు. ప్రధాన అర్చకులుగా బద్రీనాథ్ బాబు అమ్మవారి అలంకరణ, ఆచార వ్యవహారాల్లో అపారమైన అనుభవంతో సేవలందించారు. భక్తులకు తగిన ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించిన ఆయన సేవలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయి. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా' అని మంత్రి ఆనం పేర్కొన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు


ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాల‌కృష్ణ‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

  

వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..

 

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

 

దావోస్ లో ఎన్నారై టీడీపీ సభ్యులతో చంద్రబాబులోకేష్ మీట్ అండ్ గ్రీట్! 20 దేశాల నుంచి... ఆనందంలో ఎన్నారైలు!

 

నారా లోకేష్ డిప్యూటీ సిఎం పదవి డిమాండ్ల పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం! కీలక ఆదేశాలు జారీ!

 

టాలీవుడ్ కి గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలపై కీలక నిర్ణయం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #kanakadurgamma #temple #archakulu #todaynews #flashnews #latestupdate #vijayawada