అమెరికా అధ్యక్ష పీఠం కోసం జోరందుకున్న ప్రచారం!! పోటాపోటీగా విరాళాలు సేకరణ!! ఆ ప్రసంగం అయిన 24 గంటల్లోనే 10 మిలియన్ డాలర్ల నిధులు
Mon Apr 08, 2024 10:30 U S Aఅమెరికా అధ్యక్ష పీఠం కోసం ప్రచారం జోరందుకుంది. ఎన్నికల బరిలో మరోసారి నిలిచిన అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారంతోపాటు, విరాళాలు సేకరించడంలోనూ పోటాపోటీగా వ్యవహరిస్తున్నారు. మార్చితో ముగిసిన త్రైమాసికం నాటికి తాము 192 మిలియన్ డాలర్ల నిధులను సేకరించినట్లు శనివారం దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల ప్రచార కమిటీ వెల్లడించింది. ఇందులో ఒక్క మార్చి నెలలోనే 90 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.750 కోట్లు) పైగా విరాళాలను సమీకరించినట్లు తెలిపింది. వీటిలో 90 శాతం విరాళాలు 200 డాలర్ల లోపేనని వివరించింది.
అమెరికా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మార్చి 28న రేడియో సిటీ మ్యూజిక్ హాల్లో మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్తో కలిసి నిర్వహించిన కార్యక్రమంలోనే 26 మిలియన్ డాలర్లకు పైగా నిధులను సమీకరించినట్లు బైడెన్ బృందం వెల్లడించింది. మార్చిలో అధ్యక్షుడి కీలక స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం తర్వాత 24 గంటల్లోనే 10 మిలియన్ డాలర్ల నిధులు అందినట్లు పేర్కొంది. మరోవైపు విరాళాల సేకరణలో డెమోక్రటిక్ పార్టీకి రిపబ్లికన్ పార్టీ గట్టి పోటీని అందిస్తోంది. శనివారం నిర్వహించిన ఒక కార్యక్రమంతోనే 50.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.420 కోట్లు) సమీకరించినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రచార బృందం ప్రకటించింది. బైడెన్ బృందం రేడియో సిటీ మ్యూజిక్ హాల్ కార్యక్రమంలో సమీకరించిన దానితో పోలిస్తే ఇది రెండింతలు. త్రైమాసికం ముగిసే నాటికి తమ వద్ద 93.1 మిలియన్ డాలర్ల నిధులు ఉన్నట్లు ట్రంప్ బృందం వెల్లడించింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
అమెరికా: H1B వీసా ప్రాసెస్ ను సులభతరం చేస్తున్న బైడెన్ ప్రభుత్వం!
కువైట్: ఎన్నికల జోరు! అర్ధరాత్రి 12 దాకా! బరిలో 200 మంది! ఫలితాలు శుక్రవారం!
రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చిన జనసేన! నివేదికలు ఆధారంగా! అభ్యర్థి ఎవరంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
#USA #America #AndhraPravasi #Pravasi #JoeBiden #Trump #TeluguMigrants
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.