ఈ పని చేయకుంటే జీమెయిల్‌ అకౌంట్‌ డిలీట్‌! రేపటి వరకే ఆఖరి ఛాన్స్‌!

Header Banner

ఈ పని చేయకుంటే జీమెయిల్‌ అకౌంట్‌ డిలీట్‌! రేపటి వరకే ఆఖరి ఛాన్స్‌!

  Thu Sep 19, 2024 18:28        Gadgets

జీమెయిల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్ల మంది జనం జీమెయిల్‌ని వినియోగిస్తున్నారు. పెరిగిన స్మార్ట్‌ ఫోన్ల వినియోగం నేపథ్యంలో జీమెయిల్‌ కూడా తప్పనిసరిగా మారింది. విద్యార్థుల నుంచి బడా వ్యాపారవేత్తలకు తప్పనిసరిగా జీమెయిల్‌ అకౌంట్‌ ఉన్నది. అయితే, గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో లక్షల సంఖ్యల్లో జీమెయిల్‌ అకౌంట్స్‌ను డిలీట్‌ చేయబోతున్నది. వాస్తవానికి జీమెయిల్‌ వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తున్నది. చాలామంది ఏదో అవసరం కోసం జీమెయిల్‌ అకౌంట్‌ని తెరుస్తుంటారు. ఆ తర్వాత మరిచిపోతుంటారు. మళ్లీ అవసరం కోసం మళ్లీ కొత్త అకౌంట్‌ని క్రియేటర్‌ చేస్తుంటారు. మరికొందరు ఏదైనా అవసరం వచ్చిన సందర్భంల్లో వాడుతూ మళ్లీ.. దాని గురించి పట్టించుకోరు. దాంతో ఆయా అకౌంట్స్‌ అన్నీ ఇన్‌యాక్టివ్‌గా మారుతుంటాయి.

 

ఇంకా చదవండిమరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి  

 

ఇంకా చదవండి: నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

ఈ ఇన్‌యాక్టివ్‌ మెయిల్స్‌ కారణంగా సర్వర్లపై భారపడుతున్నది. ఈ నేపథ్యంలో ఇన్‌యాక్టివ్‌గా ఉన్న అకౌంట్స్‌ని తొలగించాలని గతంలో నిర్ణయించింది. గడువును సెప్టెంబర్‌ 20 వరకు ఇచ్చింది. ఈలోగా అవసరం ఉన్న మెయిల్స్‌ని యాక్టివ్‌గా చేసుకోవాలని.. లేకపోతే డిలీట్‌ చేయనున్నట్లు తెలిపింది. యాక్టివ్‌ చేసుకునేందుకు గడువు విధించిన తేదీలోగా మెయిల్‌ లాగిన్‌ చేసి వచ్చిన మెయిల్స్‌ని చదవడం.. ఎవరికో ఒకరికి మెయిల్‌ చేసినా సరిపోతుంది. లేకపోతే ఆటోమేటిక్‌గా జీమెయిల్‌ డిలీట్‌ అవుతుంది. లేకపోతే జీమెయిల్‌ అకౌంట్‌తో లింక్‌ అయిన యూట్యూబ్‌లో వీడియోలు చూసినా సరిపోతుంది. లేకుంటే ఏదైనా ఫొటోను మరొకరికి సెండ్‌ చేసిన మెయిల్‌ యాక్టివ్‌లోకి వస్తుంది. మెయిల్‌ అకౌంట్‌ని డిలీట్‌ చేస్తే.. ఫొటోస్‌ ఇలా ఏదైనా లింక్‌ అయిన ఉన్నా అన్నీ డిలీట్‌ అయ్యేందుకు ఛాన్స్‌ ఉంటుంది. తప్పనిసరిగా మెయిల్‌ అవసరమైన సందర్భంలో యాక్టివ్‌ చేసుకోవడం మంచిది. లేకపోతే ఆ తర్వాత ఇబ్బందిపడాల్సి వస్తుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

ఇప్పటివరకు ఎవరూ ఊహించని టీడీపీ నిర్ణయం! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పేరు ఖరారు!

 

మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు శుభవార్త! ఎవరెవరికి బెనిఫిట్ కలుగుతుంది?Don't miss.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Gadgets #Technology #Gmail #Google