వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

Header Banner

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

  Thu Sep 19, 2024 19:58        Travel

భారతీయులకు ప్రయాణాలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా సోమ్‌నాథ్‌ ఆలయం నుంచి మేఘాలయా దాకా ఏ పర్యాటక ప్రదేశం చూసినా కళకళలాడుతూనే ఉండటానికి కారణం భారతీయ టూరిస్టులే. కోవిడ్‌-19 తర్వాత యువతలో ట్రావెల్‌పై ఆసక్తి గణనీయంగా పెరిగింది. దేశీయంగానే గాక విదేశాలకూ వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రయాణాల కోసం భారతీయులు చేస్తున్న ఖర్చు రూ. 12,500 కోట్లు. ఇది ఏడాది మొత్తం అనుకునేరు! నెల రోజులకు మాత్రమే.. మీరు కూడా దేశీయంగా పలు ప్రదేశాలకు వెళ్లి ఏదైనా విదేశీ ప్రయాణం చేయాలని ఆసక్తిగా ఉన్నారా? అయితే అందుకు కజకిస్థాన్‌ బెస్ట్‌ ఆప్షన్‌. అదేంటి? ప్రపంచంలో విహారయాత్రలకు యూఎస్‌ఏ, యూకే, యూరప్‌ వంటి ఎన్నో ప్రదేశాలుండగా కజకిస్థానే ఎందుకు అంటారా? అయితే ఇది చదవాల్సిందే.

 

ఇంకా చదవండిమరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి  

 

ఇంకా చదవండి: నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

యూఎస్‌ఏ, యూకే, యూరప్‌ వంటి దేశాలకు ఎక్కడికి వెళ్లాలన్నా వీసా కష్టాలు పడాల్సిందే. అదీగాక అక్కడి ఖర్చులకు జేబులు చిల్లులు పడాల్సిందే. కానీ కజకిస్థాన్‌కు వీసా తంటాలేమీ లేవు. భారత పాస్‌ పోర్టు ఉంటే చాలంతే. భారత ప్రయాణీకులకు 14 రోజుల వీసా ఫ్రీ పాలసీని కజకిస్థాన్‌ 2022లో ఆమోదించింది. దీని ప్రకారం.. 180 రోజులలో ఒక భారతీయుడు మూడు సార్లు 14 రోజులపాటు అక్కడ వీసా లేకుండా విహరించొచ్చు. అదీగాక ఇక్కడ ప్రయాణాలకు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

ఇప్పటివరకు ఎవరూ ఊహించని టీడీపీ నిర్ణయం! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పేరు ఖరారు!

 

మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు శుభవార్త! ఎవరెవరికి బెనిఫిట్ కలుగుతుంది?Don't miss.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Travel #VisaFree #VisaFreeTravel #World