రైలుకు ప్రమాదం కలిగించే యత్నం! రైలు పట్టాలపై పొడవైన ఇనుప స్తంభం!

Header Banner

రైలుకు ప్రమాదం కలిగించే యత్నం! రైలు పట్టాలపై పొడవైన ఇనుప స్తంభం!

  Thu Sep 19, 2024 22:01        India

రైళ్లకు ప్రమాదం కలిగించే సంఘటనలు ఇటీవల తరచుగా జరుగుతున్నాయి. తాజాగా రైలు పట్టాలపై పొడవైన ఇనుప స్తంభాన్ని దుండగులు ఉంచారు. గమనించిన లోకో పైలట్‌ సకాలంలో స్పందించాడు. రైలు ఆపి పట్టాలపై ఉన్న ఐరన్‌ పోల్‌ను తొలగించాడు. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ మధ్య ఉన్న రైల్వే మార్గంలో ఈ సంఘటన జరిగినట్లు రైల్వే ప్రకటించింది. సెప్టెంబర్‌ 18న రాత్రి 22.18 గంటలకు ఉత్తరప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ రోడ్, ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్ సిటీ మధ్య రైలు మార్గంలోని 43/10-11 కిలోమీటరు వద్ద పట్టాలపై 6 మీటర్ల పొడవైన ఇనుప స్తంభాన్ని లోకో పైలట్‌ గుర్తించినట్లు తెలిపింది. రైలు నంబర్ 12091 లోకో పైలట్ వెంటనే రైలు ఆపి పట్టాలపై ఉన్న ఐరన్‌ పోల్‌ను తొలగించినట్లు పేర్కొంది. ఆ రైలును సురక్షితంగా నడిపాడని, రుద్రపూర్ సిటీ స్టేషన్ మాస్టర్‌కు దీని గురించి రిపోర్ట్‌ చేశాడని వెల్లడించింది.

 

ఇంకా చదవండిమరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి  

 

ఇంకా చదవండి: నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

కాగా, సెప్టెంబర్‌ ప్రారంభంలో రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో గూడ్స్ రైలును పట్టాలు తప్పించే ప్రయత్నం జరిగింది. ఫూలేరా-అహ్మదాబాద్ మార్గంలోని వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లో ఈ సంఘటన జరిగింది. శారధ్నా- బంగాడ్ స్టేషన్‌ల మధ్య రైలు పట్టాలపై రెండు సిమెంట్ దిమ్మెలను దుండగులు ఉంచారు. ఆ గూడ్స్‌ రైలు సిమెంట్ దిమ్మెలను ఢీకొట్టింది. అయితే ఎలాంటి ప్రమాదం జరుగలేదని వెస్ట్రన్ రైల్వే అధికారి నాడు తెలిపారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కూడా ఇలాంటి తరహా సంఘటన జరిగింది. దుండగులు గ్యాస్ సిలిండర్‌ను రైలు పట్టాలపై ఉంచారు. అయితే రైలు లోకో పైలట్‌ దీనిని గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టె కూడా అక్కడ ఉన్నాయి. రైలును పేల్చేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి కొందరు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

ఇప్పటివరకు ఎవరూ ఊహించని టీడీపీ నిర్ణయం! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పేరు ఖరారు!

 

మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు శుభవార్త! ఎవరెవరికి బెనిఫిట్ కలుగుతుంది?Don't miss.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Travel #Train #TrainTravel #Robbers #ChennaiExpress