కేవలం రూ.1328కే విమాన ప్రయాణం! ఎయిరిండియా అదిరిపోయే ఆఫర్!

Header Banner

కేవలం రూ.1328కే విమాన ప్రయాణం! ఎయిరిండియా అదిరిపోయే ఆఫర్!

  Sun Jan 12, 2025 14:27        Travel

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లాష్ సేల్ తీసుకొచ్చింది. దీని ద్వారా కేవలం రూ.1328కే విమాన ప్రయాణం కల్పిస్తోంది. టికెట్లు బుకింగ్ చేసుకుని వచ్చే సెప్టెంబర్ 30, 2025 వరకు ఎప్పుడైన ప్రయాణం చేయవచ్చు. మరెందుకు ఆలస్యం ఆఫర్ పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకోండి మరి. 

 

దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లాష్ సేల్ పేరుతో అతి తక్కువ ధరకే విమాన ప్రయాణం కల్పిస్తోంది. తరుచూ ప్రయాణాలు చేసే వారు, టూర్లు వెళ్లాలనుకునే వారు, ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని భావించే వారికి ఇదో గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం బస్ టికెట్ ధరకే విమానం ఎక్కవచ్చు. అంతేకాదు ఈ ఆఫర్ సమయంలో టికెట్లు బుకింగ్ చేసుకుని 2025, సెప్టెంబర్ 30 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. మరి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఈ స్పెషల్ సేల్ పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

 

ఇంకా చదవండిఛీ.. ఛీ.. సీసీ కెమెరాలో అడ్డంగా దొరికిపోయిన సైకో.. ఆసుపత్రిలో పరామర్శ.. జగన్ గుట్టు విప్పిన మంత్రి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిమంత్రి కీలక ప్రకటన.. ఆ నగరాన్ని క్లీన్ సిటీగా మార్చేలా ప్రణాళికలు సిద్ధం!

 

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ తీసుకొచ్చిన ఈ ఫ్లాష్ సేల్ ఇప్పటికే మొదలైపోయింది. ఇందులో టికెట్లు బుక్ చేసుకునేందుకు జనవరి 13, 2025 అర్ధ రాత్రి వరకు అవకాశం ఉంటుంది. టికెట్లు బుక్ చేసుకున్న వారు జనవరి 24, 2025 నుంచి సెప్టెంబర్ 30, 2025 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ అధికారిక వెబ్‌సైట్ airinidaexpress.com, మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. టికెట్ బేస్ ఫేర్ పై మాత్రమే ఆఫర్ ఉంటుంది. ఎయిర్‌పోర్ట్ ఛార్జీలు, ప్రభుత్వ ట్యాక్సులు వేరుగా ఉంటాయని గమనించాలి. 

 

ఇక ఈ ఫ్లాష్ సేల్ రెండు విధాలుగా ఉంటుంది. మొదటిది ఎక్స్‌ప్రెస్ లైట్. ఇందులో విమాన టికెట్లు కేవలం రూ.1328 నుంచే మొదలవుతున్నాయి. అలాగే జీరో కన్వీనియెన్స్ ఫీ ఆఫర్ సైతం ఇస్తోంది. దేశీయ టూర్లలో ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇక రెండోది ఎక్స్‌ప్రెస్ వాల్యూ. ఇందులో విమాన టికెట్ ధరలు రూ.1498 నుంచి మొదలవుతున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ ద్వారా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ జనవరి 9వ తేదీనే ఓ పోస్ట్ చేసింది. జనవరి 13వ తేదీలోపు టికెట్లు బుక్ చేసుకుని జనవరి 24 నుంచి సెప్టెంబర్ 30, 2025 వరకు ప్రయాణం చేయండీ అంటూ పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్ చూడవచ్చు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లింపుకు సీఎం చంద్రబాబు ఆదేశం! సమీక్షలో కీలక నిర్ణయం!

 

సంక్రాంతికి విజయవాడ నుండి వెళ్ళే వారికి గుడ్ న్యూస్! ఆ రూట్ క్లియర్!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! ఆ పథకం పేరు మారింది.. కొత్త పేరు ఇదే..

 

రైల్వే రిక్రూట్‌మెంట్.. పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం! కావలసిన అర్హతలు ఇవే.. ఇలా అప్లై చేసుకోండి!!

 

ఓరీ దేవుడో.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలకు వెళ్లిన అధికారులు షాక్! ఎందుకంటే?

 

విశాఖ కోర్టు సంచలన తీర్పు! యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష!

 

రూ.లక్షల కోట్ల పెట్టుబడులు.. 20 లక్షల మందికి ఉపాధి! ప్రజలు 93 శాతం స్ట్రైక్ రేట్ తో.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Travel #AirTravel #AirIndia #India #Airlines