కార్తీక సోమవారాల్లో ఏ సోమవారం మంచిదో తెలుసా.. ఆరోజు ఇలా చేస్తే - ఆ సమస్యలు ఇక మాయం!

Header Banner

కార్తీక సోమవారాల్లో ఏ సోమవారం మంచిదో తెలుసా.. ఆరోజు ఇలా చేస్తే - ఆ సమస్యలు ఇక మాయం!

  Tue Nov 05, 2024 18:12        Devotional

ప్రతి మాసంలో కార్తీక మాసానికి ఆధ్యాత్మికంగా చాలా ప్రత్యేకత ఉంది. శివకేశవులు ఇద్దరికీ ఈ మాసం ప్రీతికరమైనది. “శివస్య హృదయం విష్ణుః.. విష్ణుస్య హృదయం శివః” అని పురాణాలు చెప్తున్నాయి. అంటే శివుడు విష్ణుమూర్తి హృదయంలో, విష్ణువు శివుని హృదయంలో ఉంటారన్న అర్థం. మార్గశిర మాసం విష్ణువుకి ప్రియమైన మాసం అయితే, మాఘమాసం శివునికి ప్రియమైనది. కానీ, ఈ ఇద్దరికీ ప్రీతికరమైన మాసం కార్తీకం. ఈ కార్తీక మాసంలో శివుడికి పూజ చేసినా, అది విష్ణువుకి చేసినట్లే. అలాగే, విష్ణువుకి పూజ చేసినా, అది శివుడికే అర్పణగా భావించవచ్చు. హరిహరులు ఇద్దరూ భక్తులకు ఆధ్యాత్మిక, ఇహపర సుఖాలను ప్రసాదించేందుకు సిద్ధంగా ఉంటారని ఆధ్యాత్మిక వేత్తలు చెప్తున్నారు. అందుకే, కార్తీక మాసంలో శివకేశవులకు పూజలు చేయాలని పరిపాటిగా చెప్పారు. కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.

 

ఇంకా చదవండి: శబరిమలకు వెళ్ళే భక్తులకు భారీ గుడ్ న్యూస్! ఇక నుండి ఫ్రీ ఇన్షూరెన్స్!

 

కార్తీక సోమవారం ఉదయాన్నే అనేక మంది భక్తులు శివుడికి అభిషేకం చేస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండే భక్తుల సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. అంతేకాక, రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా విస్తృతంగా నిర్వహిస్తారు. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ మాసంలో శివుడి పూజలో తరిస్తారు. భక్తుల నమ్మకం ప్రకారం, కార్తీక సోమవారాల్లో శివుడికి అభిషేకం చేస్తే ఆయన కటాక్షం, అనుగ్రహం లభిస్తాయి. ముఖ్యంగా తెల్లవారుజామున లేచి శివుడికి రుద్రాభిషేకం చేయడం ద్వారా ఆయనను ప్రసన్నం చేసుకోవాలన్న ఆకాంక్ష ఉంటుంది. కార్తీక మాసంలో శివుడు ప్రసన్నం అవుతాడని విశాఖపట్నం శంకరమఠం వేదపండితులు కందుకూరి బాలసుబ్రహ్మణ్య శర్మ చెప్తున్నారు. కార్తీక సోమవారాల్లో ఉపవాసం, నక్తం వంటి సంప్రదాయాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఉపవాసం అంటే ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు ఒక్క చుక్క నీరు కూడా తాగకుండా ఉండటం. ఉపవాసం చేయలేని వారు నక్తం పాటిస్తారు. దీనిలో సోమవారం పగలు పాలు, పండ్లు మాత్రమే తీసుకుని సాయంత్రం ఆకాశంలో నక్షత్రం కనబడిన తర్వాత భోజనం చేస్తారు. వేదపండితుల మాటల్లో, ఇలా ఉపవాసాలు, నక్తాలు పాటించడం వల్ల ఆధ్యాత్మిక ఫలితాలు ఎక్కువగా లభిస్తాయి. ఇప్పటికే ఒక సోమవారం గడిచిపోయింది. మిగతా సోమవారాల్లో కూడా మంచి నక్షత్రాలు ఉన్నాయని, కార్తీక మాసం చివరి సోమవారం అత్యంత ప్రాధాన్యత కలిగినదని వేదపండితులు అభిప్రాయపడుతున్నారు.


ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మటన్‌తో కలిపి ఈ 3 పదార్థాలు తింటున్నారా? ఇక మీ ఆయుష్షు మూడినట్లే! దీని మాంసం మానవ శరీరానికి చాలా!

 

సొంత పార్టీ జూనియర్ మంత్రిపై చంద్రబాబు సీరియస్? ఆడియో కాల్ వైరల్! ఈ ఐదు నెలల్లో ప్రభుత్వ!

 

జగన్ కు భారీ షాక్! పార్టీకి మాజీ మంత్రి రాజీనామా!

 

11వ నెల 11వ తారీకు ఉదయం 11 గంటలకు ఆ 11 మంది వస్తారా? ఏపీ అసెంబ్లీ సమావేశాలు!

 

అమరావతి టవర్ల నిర్మాణానికి మళ్ళీ ఉపిరి! ఏడాదిలోనే పనులు పూర్తి చేయాలన్న కసరత్తు!

 

దేశంలోనే నెంబర్ వన్ గా ఏపీ నూతన క్రీడా పాలసీ! చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షల భారీ జీతం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్, ఈ ఛాన్స్ వదలొద్దు!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల వివరాలు! ఎవరో తెలుసా?

 

ఏపీలో పర్యాటక రంగానికి కొంత హంగులు.. విజయవాడ - శ్రీశైలం మధ్య సీ ప్లేన్! ప్రారంభం - టికెట్ రేట్!

 

కొత్త సంవత్సరం నుంచి ఈ రేషన్ కార్డులు చెల్లవు! వెంటనే ఇలా చేయండి - వారి కార్డులు రద్దు!

 

అన్నీ శుభవార్తలే... ఏపీకి అదృష్టంగా మారిన కేంద్రమంత్రి! ఆ జిల్లాల్లో పెరగనున్న స్థలాల రేట్లు!

 

ఇళ్లు కట్టుకోవాలనుకునేవారికి బంపర్ ఆఫర్! 100 గజాల్లోపు నిర్మాణాలకు ప్లాన్‌ మంజూరు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

న్యూజిలాండ్: తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ అంగరంగ వైభవంగా సాగిన కార్యక్రమం! పర్చూరు, బాపట్ల ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం! అక్కడి మంత్రి, ఎంపీలతో భేటీ!

 

ఆ మహిళ చేసిన పనికి బిత్తర పోయిన చంద్రబాబు! మరీ అంత దారుణంగానా!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #KarthikaSomavaram #KarthikaMasam