అమెరికాలో దేశబహిష్కరణ ముప్పు.. ప్రమాదంలో లక్షలాది భారతీయులు! ఆలోపు గ్రీన్ కార్డు దక్కితే చట్టబద్ధంగా..

Header Banner

అమెరికాలో దేశబహిష్కరణ ముప్పు.. ప్రమాదంలో లక్షలాది భారతీయులు! ఆలోపు గ్రీన్ కార్డు దక్కితే చట్టబద్ధంగా..

  Mon Jul 29, 2024 07:00        U S A, India

చిన్నతనంలోనే తల్లిదండ్రులతో పాటు అమెరికా వెళ్లిన లక్షలాది మంది భారతీయుల యువతీయువకులు ప్రస్తుతం దేశబహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఎదుర్కొంటున్నారు. శాశ్వత నివాసార్హత, లేదా తాత్కాలిక వీసాలు రాక స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అమెరికాలో ఇలాంటి వారిని డాక్యుమెంటెడ్ డ్రీమర్స్‌గా పిలుస్తారు. వీరి మొత్తం సంఖ్య 2.5 లక్షలకు పైనే ఉంటుంది. డాక్యుమెంటెడ్ డ్రీమర్స్‌లో భారతీయులే అత్యధికమని స్వయంగా వైట్ వర్గాలు తెలిపాయి. అమెరికా నిబంధనల ప్రకారం, తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వచ్చే చిన్నారులను వీసాదారులపై ఆధారపడ్డ వారిగా పరిగణిస్తారు. 21 ఏళ్ల వరకూ వారు దేశంలో ఉండేందుకు అనుమతి ఉంటుంది. ఆలోపు గ్రీన్ కార్డు దక్కితే చట్టబద్ధంగా అగ్రరాజ్యంలో కొనసాగవచ్చు. లేకపోతే, వయసు మీరిందంటూ వారిని గ్రీన్ కార్డు జాబితా నుంచి తొలగిస్తారు. దీన్ని ‘ఏజ్ ఔట్‌’గా పిలుస్తారు. ఆ తరువాత గ్రీన్ కార్డు లేదా వీసా కోసం సొంతంగా ప్రయత్నించాలి.

 

ఇంకా చదవండి: అమెరికాలో స్విమ్మింగ్‌ పూల్‌లో పడి తెలుగు స్టూడెంట్ మృతి! అతడి స్నేహితుడితో పాటు..

 

ఇందులో విఫలమైతే స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలి. అమెరికాలో ప్రస్తుతం భారతీయులు వారి పిల్లలు సహా మొత్తం1.2 మిలియన్ల మంది వివిధ కేటగిరిల్లో దరఖాస్తు చేసుకుని గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు, కొందరు భారత సంతతి యువతీయువకులు ఇప్పటికే అమెరికాలోని తమ కుటుంబాలను వీడి భారత్‌లో బంధువుల వద్ద తలదాచుకుంటున్నారు. డాక్యుమెంటెడ్ డ్రీమర్స్‌ సమస్య పరిష్కారానికి రిపబ్లికన్స్ చట్టసభల్లో మోకాలు అడ్డుతున్నారని వైట్ హౌస్ ఆరోపించింది. అన్ని వర్గాలకు అనుకూలమైన ఒప్పందాన్ని తాము రూపొందిస్తే రిపబ్లికన్లు రెండు సార్లు వ్యతిరేకంగా ఓటు వేశారని గుర్తు చేశారు. కాగా, గత నెలలో వివిధ పార్టీలకు చెందిన 43 మంది చట్టసభ సభ్యులు.. ఈ సమస్యకు పరిష్కారం కోరుతూ బైడెన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. గ్రీన్ కార్డుల కోసం కొందరు దశాబ్దాల తరబడి వేచి చూస్తున్నారని, సమస్యకు తక్షణ పరిష్కారం కోసం ప్రయత్నించాలని సూచించారు.

ఇంకా చదవండి: వైసీపీకి మరో ఎదురు దెబ్బ! చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

11మంది బలం సరిపోలేదా అంటూ - జగన్ వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల కౌంటర్! క్రైస్తవులను ఊచకోత గురి చేసినా..

 

రెడ్ బుక్ అంటే చాలు.. వైసీపీ నేతలకు భయం! రాష్ట్రంపై అసత్య ప్రచారం! టీడీపీ ఎంపీ ఫైర్!

 

రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన ఘనుడు! అబ్దుల్ కలాం వర్థంతి సందర్భంగా! మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఘన నివాళులు!

 

పారిస్ ఒలింపిక్స్‌లో అరకు కాఫీ ఘుమఘుమలు!​ అతిథులను అలరించనున్న మన్యం పంట!

 

ఆగస్టులో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవలు! ఆ వివరాలు మీకోసం!

 

ప్రతిపక్ష నేత హోదా పిటిషన్‌పై విచారణ! హైకోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది!

 

జగన్ ఢిల్లీలో స్థిరపడేందుకు షెల్టర్ అవసరం! కూటమిలో చేరడం అనివార్యం- యనమల రామకృష్ణుడు!

 

అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియాపై మండిపడ్డ మంత్రి లోకేష్! ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటాం!

 

నేను నోరు విప్పితే జగన్ జైలుకే! బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

 

గూగుల్ కు పోటీగా కొత్త సెర్చ్ ఇంజిన్ వస్తోంది! అది ఏంటో తెలుసా!

 

జగన్ ఢిల్లీలో స్థిరపడేందుకు షెల్టర్ అవసరం! కూటమిలో చేరడం అనివార్యం- యనమల రామకృష్ణుడు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #DocumentedDreamers #AgeOut #USA #Indian's