ఏపీకి వస్తున్న మోదీ - అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి! 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం!

Header Banner

ఏపీకి వస్తున్న మోదీ - అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి! 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం!

  Mon Nov 25, 2024 08:30        Politics

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈనెల 29వ తేదీన విశాఖ నగరంలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఈనెల 29వ తేదీన విశాఖకు రానున్న ప్రధాని మోదీ అక్కడ రోడ్ షో లో పాల్గొంటారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక అక్కడ వేదికనుండే అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం పూడిమడకలో ఎన్టిపిసి నిర్మించే గ్రీన్ హైడ్రోజన్ హబ్, మరికొన్ని ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా విశాఖ వాసుల దశాబ్దపు కల రైల్వే జోన్ 2 కు కూడా ప్రధాన నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారని సమాచారం. ఇప్పటికే విశాఖను గ్రోత్ హబ్ గా ప్రకటించిన కేంద్రం ఈమేరకు విశాఖలో అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి చేస్తోంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో విశాఖకు రైల్వే జోన్ ప్రకటించిన కేంద్రం ఎట్టకేలకు రైల్వే జోన్ ఏర్పాటు చేస్తుంది. మొత్తం ప్రధాని మోదీ 85,000 కోట్లు పెట్టుబడితో ఎన్టిపిసి నిర్మించే గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్ట్ తో 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారి యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

 

ఇంకా చదవండి: విజయవాడ వరదలు, పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రం స్పందించాలి! పార్లమెంటులో చర్చ కోరిన తెదేపా నేతలు!

 

ఈ నెల 29వ తేదీన దేశ ప్ర‌ధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు వస్తోన్న నేపద్యంలో జిల్లా క‌లెక్టర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించారు. స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధులు, వివిధ విభాగాల ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో ఏర్పాట్లపై చర్చించారు. ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో జరిగే బహిరంస‌భ, అంతకుముందు జరిగే రోడ్ షో నిర్వ‌హణ పై భద్రతాపరమైన అంశాలపై చర్చించారు. ప్రధాన మంత్రి తోపాటు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ నజీర్ , రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్య‌మంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ లు హాజరవుతున్నారు. ఈసందర్భంగా వివిధ ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. బహిరంగ సభకు ప్రధాని సాయంత్రం 4గంటల 40నిమిషాలకు చేరుకుంటారని, సాయంత్రం 5గంటల 25 నుమిషాల నుంచి 5గంటల 43 నిమిషాల వరకు ప్రధాని సభను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. అనంత‌రం 5.45 గంట‌ల‌కు స‌భ నుంచి ఎయిర్ పోర్టుకు తిరుగు ప‌య‌న‌మ‌వుతారని జిల్లా కలెక్టర్ తెలిపారు.



 
ఇంకా చదవండి: 25/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు దరఖస్తుల స్వీకరణ ప్రారంభం! మారబోతున్న డిజైన్లు!

 

వైసీపీకి వరుస షాక్ లు.. సజ్జల అరెస్ట్ కు రంగం సిద్దం! మరో వైసీపీ నేతకు నోటీసులు!

 

వైకాపా పాలనలో విద్యా దీవెన బకాయిలతో లక్షల విద్యార్థుల పతనం! లోకేశ్ ఘాటు విమర్శలు!

 

ప్రధాని మోదీకి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు! ఎందుకు అంటే!

 

క‌మెడియ‌న్ అలీకి ఊహించ‌ని షాక్‌! నోటీసులు ఇచ్చిన గ్రామ కార్య‌ద‌ర్శి - ఎందుకు అంటే!

 

25/11 నుండి 30/11 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

జగన్‌ దగ్గర ఎందుకు చేశానా అని బాధపడుతున్నా! దుమారం రేపుతున్న మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

 

వైసీపీకి మరో షాక్‌! పార్టీకి రాజీనామా చేసిన కైకలూరు ఎమ్మెల్సీ!

 

మూడేళ్లలో అమరావతికి నూతన రూపు-సీఎం చంద్రబాబు! రాజధానికి రూపకల్పనలో భారీ ప్రణాళికలు!

 

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Modi #AndhraPradesh #APPolitics #NaraLOkesh #Chandrababu #ModiMeeting #Anakapalli