సింగపూర్: కాకతీయ కల్చరల్ అసోసియేషన్! కనువిందు చేసే వినోదం, ఆహ్లాదం, ఆసక్తికరమైన ఆట పాటలు! సంక్రాంతి సంబరాలు!

Header Banner

సింగపూర్: కాకతీయ కల్చరల్ అసోసియేషన్! కనువిందు చేసే వినోదం, ఆహ్లాదం, ఆసక్తికరమైన ఆట పాటలు! సంక్రాంతి సంబరాలు!

  Tue Feb 06, 2024 12:35        Associations, Singapore

సింగపూర్: కాకతీయ కల్చరల్ అసోసియేషన్- సింగపూర్ (KCAS) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సింగపూర్ యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ (SUTD) ఆడిటోరియం హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సింగపూర్లో నివసిస్తున్న తెలుగువారు భారీ సంఖ్యలో తరలివచ్చి సందడి చేశారు. దాదాపు 750 మంది పాల్గొన్న ఈ వేడుకలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆటపాటలతో ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి. తెలుగు వంటకాలతో కూడిన భోజనాలతో పాటు ఈ వేడుకల్లో ప్రతిఒక్కరినీ భాగస్వాముల్ని చేసేలా కార్యక్రమాలు రూపొందించిన నిర్వాహకుల్ని ఆహూతులు అభినందించారు. చిన్నారులు చిత్రలేఖనం, ఆటలు, నృత్యాలు, నాటికలతో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ప్రదర్శించిన సంప్రదాయ కోలాటం, పురుషుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.


 


ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు రాంబాబు పాతూరి మాట్లాడుతూ.. సంక్రాంతి పండగను ఇంతమంది తెలుగు వారి మధ్య సింగపూర్లో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలుగువారు ఎక్కడున్నా తమ సంస్కృతీ, సంప్రదాయాలను మరిచిపోరని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి నిరూపితమైందన్నారు. తమ సంస్థ ద్వారా నిర్వహించాలనుకున్న కార్యక్రమాలకు ఈ ఈవెంట్ మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ఇది విజయవంతం కావడానికి సహకరించిన బృందాలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ సంస్థ కార్యక్రమాలకు ఎప్పటిలాగే ఈసారి కూడా స్పాన్సర్స్ రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సంక్రాంతి తెచ్చే సంబరాలు ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే సంక్రాంతి పండగ విశిష్టతను అందరికీ వివరించారు.



   #AndhraPravasi #Singapore #SIngaporeCountry #SingaporeNews #SingaporeUpdates #SingaporePassport #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants