అత్యవసర పరిస్థితుల్లో విధులు...ప్రత్యేక స్వాట్ టీమ్ సిద్ధం! జిల్లాలో శాంతి భద్రతలపై ఎస్పీ దృష్టి!
Tue Nov 12, 2024 18:37 Othersఅనకాపల్లి జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాలు, ఇతర ప్రదేశాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకున్న 30 మంది పోలీసు సిబ్బందితో 'స్వాట్ టీమ్' (SWAT)ను పోలీసు శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆందోళనకారులు, నిరసనకారులను అదుపు చేసేందుకు, గుంపులను చెదరగొట్టేందుకు ఈ స్వాట్ టీమ్ ఉపయోగపడుతుందని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. విశాఖ కైలాసగిరిలోని ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద శిక్షణ పూర్తి చేసుకున్న స్వాట్ టీంతో జిల్లా ఎస్పీ మాట్లాడారు. 30 మందితో ఉన్న ఈ బృందంలో మహిళా సిబ్బంది సైతం ఉన్నారని ఎస్పీ తెలిపారు. వీరంతా ప్రత్యేకమైన యూనిఫామ్ ధరించి విధులు నిర్వహిస్తారన్నారు. ఈ సందర్భంగా వారికి అందించిన హెల్మెట్, లాఠీ, స్టోన్ గార్డ్, లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్ షెల్స్, స్మోక్ షెల్స్, గ్యాస్గన్, రైట్ గేర్ ఎక్విప్మెంట్ను ఎస్పీ తనిఖీ చేశారు. ఆందోళనకారులను వాహనాలు ఎక్కించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలను ఎస్పీ వివరించారు. స్వాట్ టీం తమ విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!
రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!
ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! మహిళల ఖాతాల్లో రూ 1500 జమ పై ప్రభుత్వం కీలక నిర్ణయం!
ముంబయి నటి కేసులో కీలక నిందితుడు వైకాపా నేత సీఐడీ కస్టడీకి! విచారణలో కొత్త మలుపు!
నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!
వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #police #team #swatteam #trained #todaynews #flashnews #latestupdate
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.