ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తమిళనాడు రైతుల నిరసన! ఆత్మహత్య చేసుకున్న రైతుల పుర్రెలు, ఎముకలతో నిరసనలు!

Header Banner

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తమిళనాడు రైతుల నిరసన! ఆత్మహత్య చేసుకున్న రైతుల పుర్రెలు, ఎముకలతో నిరసనలు!

  Wed Apr 24, 2024 10:27        India

ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద తమిళనాడు రైతులు పంటలకు మద్దతు ధర కోరుతూ నిరసనకు దిగారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కపాలాలు ఎముకలతో వారు నిరసన తెలిపారు. నదుల అనుసంధానం కూడా జరగలేదని పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2019లో ప్రకటించిన మోదీ ప్రభుత్వం ఇప్పటివరకూ ఆచరణలోకి తీసుకురాలేకపోయిందని నేషనల్ సౌత్ ఇండియన్ రివర్ ఇంటర్ లింకింగ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యకన్ను మండిపడ్డారు. తమ డిమాండ్లను ప్రభుత్వం బేఖాతరు చేస్తే వారణాసిలో ప్రధానిపై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని రైతులు హెచ్చరించారు.

 

ఇంకా చదవండి: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! వారందరి మరణంతో విషాద చాయలు

 

 ‘‘ప్రభుత్వం మా మాట వినకపోతే మేము వారణాసి వెళ్లి ఎన్నికల్లో మోదీపై పోటీ చేస్తాం. గతంలో మా డిమాండ్ల సాధనకు నిరసన చేశాం. మేము మోదీ లేదా ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకంగా కాదు. మోదీ సాయం కావాలని మాత్రమే కోరుతున్నాం. మనం ఓ ప్రజాస్వామిక దేశంలో జీవిస్తున్నాం. నిరసన తెలిపే హక్కు మనందరికీ ఉంది. కోర్టు జోక్యంతో అనుమతి లభించింది’’ అని వారు తెలిపారు. 



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నాకు ప్రాణ హాని ఉంది ఎన్నారై యాష్! ప్రచారానికి 10,000 మంది ఎన్నారై టిడిపి సభ్యుల భద్రత చూడాలి! ఈసీ కు రిప్రజెంటేషన్ సమర్పణ..

 

శృంగవరపుకోట ప్రజాగళంసభలో చంద్రబాబు ప్రసంగం! జగన్ బచ్చా అనుకున్నాను.. ఉత్తరాంధ్రలో రూ.40 వేల కోట్ల విలువైన..

 

జగన్ ఆస్తులు అంతే అంట! మరి అన్ని కంపెనీలు, పాలెస్ లు, వేల కోట్ల సామ్రాజ్యాలు ఎక్కడ ఉన్నాయో! 'జగ'మే మాయ!

 

హైదరాబాద్ US కాన్సులేట్ లో రికార్డు స్థాయిలో దరఖాస్తులు! సూపర్ సాటర్డే! 1500 మందికి వీసా ఇంటర్వ్యూలు!

 

యూఏఈ: కలుషితమైన నీరుతో నివాసుల ఆందోళన! తాగునీటి కొరత! పచ్చగా మారిన నీరు!

 

సింగపూర్: భారతదేశపు మసాల పౌడర్ బ్యాన్! కెమికల్స్ మోతాదుకు మించి! హెచ్చరించిన ప్రభుత్వం!

 

ఒమన్: సమ్మర్ షెడ్యూల్ విడుదల చేసిన సలామ్ ఎయిర్! కొత్త గమ్యస్థానాలు! జూన్ నుండి అందుబాటులో!

 

ఖతార్: ఆలస్యంగా వచ్చిందని ఫ్లైట్ ఎక్కడానికి అనుమతి ఇవ్వని ఉద్యోగి! భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది! అసలు కథ ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #TamilnaduFarmers #NewDelhi #JantarmantarProtests #RiverInterlinking #MSP