రైల్వేశాఖ సరికొత్త నిర్ణయం! ఇక భక్తులకు టికెట్ బుకింగ్ చాలా ఈజీ!

Header Banner

రైల్వేశాఖ సరికొత్త నిర్ణయం! ఇక భక్తులకు టికెట్ బుకింగ్ చాలా ఈజీ!

  Wed Jan 15, 2025 13:05        India

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా ఘనంగా జరుగుతోంది. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ఈ వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తుల కోసం భారతీయ రైల్వే సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది రైల్వే శాఖ. ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్‌లో పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు. రైలు టికెట్ బుకింగ్ విషయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సరికొత్త ప్రయోగం చేస్తూ వర్చువల్ బుకింగ్‌ విధానం అందుబాటులోకి తీసుకొచ్చారు.

 

వర్చువల్ టికెట్ బుకింగ్ అంటే.. రైల్వేశాఖ వాలంటీర్ల ద్వారా క్యూఆర్ స్కానర్లతో టికెట్ బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించడం. క్యూఆర్ స్కానర్లతో జాకెట్లు, టీషర్ట్ లను వాలంటీర్లకు ఇచ్చి ఈ కోడ్‌ను స్కాన్ చేసి ఈజీగా టికెట్ బుక్ చేసుకునేలా అవకాశం కల్పిస్తోంది రైల్వే శాఖ.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మహాకుంభ మేళాకు వచ్చిన భక్తులు రైల్వే టికెట్ల కోసం క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా టికెట్స్ తీసుకునే వెసులుబాటు కల్పించారు. వాలంటీర్లు వేసుకున్న టీ- షర్టులు, జాకెట్ల మీద ఉన్న QR కోడ్‌ని స్కాన్ చేసి.. మొబైల్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. తద్వారా అన్‌ రిజర్వ్‌డ్‌ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ వర్చువల్ టికెట్ల బుకింగ్ ద్వారా అటు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండటమే గాక, టికెట్ కౌంట్లర్ల మీద ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ విధానం ద్వారా రోజుకు 10 లక్షల డిజిటల్ టికెట్లను ఇష్యూ చేస్తున్నారట.

 

మహాకుంభ మేళా స్నానం, దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మహాకుంభమేళా సమయంలో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. పాపాలు కూడా నశిస్తాయని నమ్మకం. అందుకే ఇక్కడికి పెద్ద ఎత్తున జనం వస్తుంటారు. ఈ సారి కుంభమేళాకు మొత్తం 35 కోట్ల మంది హాజరవుతారని అంచనా. జనవరి 13 నుంచి ప్రారంభమైన మహాకుంభమేళా.. మహా శివరాత్రి రోజైన ఫిబ్రవరి 26న ముగుస్తుంది. భక్తుల కోసం అక్కడ అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

18 ఏళ్లు నిండిన మహిళలకు భారీ శుభవార్త! నెలకు రూ.7వేలు డైరెక్ట్ గా అకౌంట్లోకే!

 

పులివెందుల డీఎస్పీ ను బహిరంగంగా బెదిరించిన జగన్! మా కార్యకర్తలపై కేసులు పెడతావా! తర్వాత మీ కథ ఉంటుంది!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలావైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలావైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

ఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #India #Kumbhamela #Festivals