ఇన్ఫ్లుయన్సర్లతో చంద్రబాబు సమావేశం! జగన్ అరాచకాలపై జనంలో చైతన్యం! ఇవే టార్గెట్

Header Banner

ఇన్ఫ్లుయన్సర్లతో చంద్రబాబు సమావేశం! జగన్ అరాచకాలపై జనంలో చైతన్యం! ఇవే టార్గెట్

  Mon Apr 22, 2024 07:13        Politics

జగన్ అరాచకాలపై జనంలో చైతన్యం నింపండి

రాబోయే ఎన్నికల్లో ప్రజలు గెలవాలి-రాష్ట్రం నిలబడాలి

దోపిడీ, విధ్వంస పాలనపై ప్రజల్లో విస్తృత చర్చ జరగాలి

‘బాబును మళ్లీ రప్పిద్దాం’ కార్యక్రమంలో చంద్రబాబు పిలుపు

ఇన్ఫ్లుయన్సర్లతో చంద్రబాబు సమావేశం

 

మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

మంగళగిరి:- ఎన్నికల సమరానికి ఇక కేవలం 20 రోజులు మాత్రమే ఉంది...ఈ ఇరవై రోజులు పార్టీ గెలుపు కోసం అవిశ్రాంతంగా శ్రమించాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ‘బాబును మళ్లీ రప్పిద్దాం’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఇన్ఫ్లుయన్సర్లతో టీడీపీ కేంద్ర కార్యాలయంలో అధినేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అయిదేళ్ల జగన్ అరాచకపాలనపై పెద్దఎత్తున ప్రజలను చైతన్యం చేయాలి. జనసమూహాలు అధికంగా ఉండే మార్కెట్ సెంటర్లు, బస్టాండ్లు, సినిమాహాళ్లు తదితర ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు జగన్ విధ్వంస పాలన గురించి వివరించాలి.

 

దేవినేని ఉమను కలిసిన వసంత కృష్ణప్రసాద్! మైలవరం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో..

 

దేశంలోనే అతి పెద్ద దోపిడీదారుడైన జగన్ ను పోల్చాలంటే మరో కొత్తపదాన్ని కనిపెట్టాలి. రాబోయే ఎన్నికల్లో ప్రజలు గెలవాలి-రాష్ట్రం నిలబడాలి. రాష్ట్రాన్ని వైసీపీ రహిత రాష్ట్రంగా మార్చాలి. జగన్ రెడ్డి బటన్ నొక్కానని డబ్బా కొట్టుకుంటున్నాడు. బటన్ నొక్కడానికి జగనే అవసరం లేదు. అయిదేళ్లుగా ప్రజలపై పన్నులు, ఛార్జీల బాదుడును నిర్విరామంగా కొనసాగించారు. విధ్వంసానికి మారుపేరే జగన్ పోలవరం, అమరావతి విధ్వంసం చేశాడు, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను దెబ్బతీశాడు. వీటన్నింటిపై ప్రజలను చైతన్యవంతం చేయాల్సి ఉంది.

 

చంద్రబాబు నామినేషన్ ఫీజుకు స్వచ్చందంగా విరాళాలు!! వరదరాజాస్వామి ఆలయంలో భువనేశ్వరి ప్రత్యేక పూజలు!! భారీగా చేరుకున్న కూటమి నేతలు

 

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పంచభూతాలను కూడా వదల్లేదు. జగన్ రెడ్డి ఇసుక మాఫియా కారణంగా రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటిపోయే పరిస్ధితి నెలకొంది. ఇష్టారాజ్యంగా ఇసుక తోడేయడంతో నదులకు ఇరువైపుల ఉండే పంటపొలాలు నాశనం అవుతాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో నదులు మనుగడ కోసం చెక్ డ్యాంలు నిర్మిస్తే...నేడు విధ్వంసం చేస్తున్నారు. ఖనిజ సంపదను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. మంగంపేటలోన బైరటీస్ గనులను మొత్తం ఊడ్చేశారు. ప్రపంచంలోనే నెల్లూరు ప్రాంతంలో అరుదుగా లభించే సిలికాను ఇష్టారాజ్యంగా తవ్వేశారు. సిలికా శాండ్ ను చైనాకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రెండ్ సాండిల్ స్మగ్లర్లకు జగన్ టికెట్లు ఇస్తున్నాడు.

 

ఓరి దేవుడా రోజా నా  మజాకా!! ఎంత పత్తిత్తో ఈ అమ్మడు! మార్గదర్శిలో ఎక్కువ మొత్తం లో చిట్లు!

 

చిత్తూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్ధిపై 11 ఎర్రచందనం కేసులు ఉన్నాయని ఆయనే తన అఫిడవిట్ లో రాసుకున్నారు. ఎర్ర గంగిరెడ్డి, పెద్దిరెడ్డిలు ఈ కోవకు చెందినవారే. రూ.10 వేల కోట్ల విలువైన లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను రూ.500 కోట్లకే జగన్ రెడ్డి తన మేనమామ కొడుక్కి కట్టబెట్టాలని చూశాడు. పర్యావరణ పరిరక్షణ కోసం తెలుగుదేశం హయాంలో నాటిన చెట్లను నేడు జగన్ రెడ్డి ముఠా నరికి సొమ్ము చేసుకున్నారు. మధ్యనిషేదం చేస్తానని చెప్పిన జగన్ రెడ్డి ఒకప్పుడు రూ.60 లు ఉన్న క్వాటర్ బాటిల్ ను నేడు రూ.200 చేసి పేదల రక్తాన్ని తాగుతున్నాడు. నాసిరకం మధ్యం పోసం 30 వేల మంది ప్రాణాలు బలిగొన్నాడు. 30 లక్షల మంది ఆరోగ్యాలను నాశనం చేశాడు.

 

రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు

 

జగన్ పాలనలో రైతులు, రైతు కూలీలను నట్టేట ముంచాడు. తెలుగుదేశ ప్రభుత్వ హయంలో ‘జీరో బడ్జెట్-నేచురల్ ఫామింగ్’ తో తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన తిండి గింజలు పండిచేలా రైతులను ప్రోత్సహించాం. కరువు సీమగా పేరొందిన రాయలసీమలో డ్రిప్ ఇర్రిగేషన్ ద్వారా సిరులు పండించేలా చేసి రైతులకు అండగా నిలబడ్డాం. రైతులకు ఆదాయం పెంచాలని ఎన్టీఆర్ కాలం నుంచి వాణిజ్య పంటలను ప్రోత్సహించాం. ఎన్టీఆర్ మలేషియా నుంచి ఫామాయిల్ తీసుకొచ్చిన రాష్ట్రంలో నాటించారు. నేడు ఫామాయిల్ ఉత్పత్తిలో దేశంలోనే రాష్ట్రం నెంబర్-1. నదుల అనుసంధానం చేసేందుకు ప్రాధాన్యతనిచ్చాం. పట్టిసీమను పూర్తిచేసి 13 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాం.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

తెలుగుదేశం ప్రభుత్వం కృషితో నాడు రాష్ట్రం 14 శాతం వృద్ధి సాధించింది. కానీ, జగన్ నేడు రైతు భరోసా కేంద్రాలంటూ రైతు దగా కేంద్రాలుగా మార్చేశాడు. నేడు రాష్ట్రంలో దేశం మొత్తమ్మీద అత్యధిక నిరుద్యోగం నెలకొంది. ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. పోలీస్ రిక్రూట్‌మెంట్ లేదు. రాష్ట్రంలో యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. గంజాయి, డ్రగ్స్ తో యువత భవితను నాశనం చేశారు. ఐదేళ్ల జగన్ అరాచకాలపై మీరంతా గొంతువిప్పాలి. రాష్ట్రంలో జగన్ విధ్వంసం, సమస్యలపై ప్రజల్లో విస్తృత చర్చ జరగాలి. ప్రతీ ఒక్కరినీ ఆలోచింపచేయాలి. వైకాపా ప్రభుత్వం వల్ల ఒకతరం నష్టపోయిందన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

 

ఇవి కూడా చదవండి:  

నాదెండ్ల బ్రహ్మం రోడ్డు ప్రమాదంతో దిగ్భ్రాంతికి లోనైన నారా లోకేష్! వైద్యులతో మాట్లాడి అవసరమైన చికిత్సలు! అండగా టీడీపీ!

 

చంద్రబాబు: నవమి అనగానే నాకు ఒంటిమిట్ట ఆలయం గుర్తుకొస్తుంది!! వైసీపీ వచ్చాక దేవాలయాలు, అర్చకులపై..

 

Evolve Venture Capital 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 

 

 

 


   #AndhraPravasi #Pravasi #TeluguMigrants #NaraChandraBabuNaidu #YSJagan #Influencers #TeluguMigrants