జగ్గయ్యపేటలో వైసీపీకి దిమ్మతిరిగే షాక్! ప్రముఖ నేత టిడిపిలో చేరిక! మరికొంతమంది వైసీపీ నేతల మార్పు?

Header Banner

జగ్గయ్యపేటలో వైసీపీకి దిమ్మతిరిగే షాక్! ప్రముఖ నేత టిడిపిలో చేరిక! మరికొంతమంది వైసీపీ నేతల మార్పు?

  Fri Sep 13, 2024 09:01        Politics

వైసీపీ పార్టీ ప్రభుత్వంలో ప్రజలందరూ అనేక ఇబ్బందులకు గురయ్యారని. అలాంటి పార్టీలో కొనసాగటానికి ఇష్టం లేక రాజీనామా చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పురపాలక సంఘం చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర రాజీనామా చేశారు.రంగాపురం నరసింహారావు గారి స్వగృహంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో విజయవాడ పార్లమెంటు టిడిపి అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురాం. శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ల సమక్షంలో చైర్మన్ రాఘవేంద్ర వైసిపి తీరుకు నిరసనగా రాజీనామా ప్రకటించారు. ఈ సందర్భంగా చైర్మన్ రాఘవేంద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి వలన తీవ్ర నష్టం జరిగిందని అలాంటి పార్టీని కొనసాగించటం సరైన విధానం కాదని. తనలాంటి విద్యావంతులు వైసీపీ పార్టీలో కొనసాగటం అవివేకామేనని అన్నారు. జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ గా 30 మాసాలు అనేక రకాల ఇబ్బందులతో పరిపాలన చేయటం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పరిపాలన పట్ల అదేవిధంగా విజయవాడ పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు నెట్టెం శ్రీ రఘురాం. జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ ల సారథ్యంలో జగ్గయ్యపేట అభివృద్ధి కోసం తాను నమ్మిన సిద్ధాంతాల ప్రకారం టిడిపిలో చేరుతున్నట్లు ప్రకటించారు. తనతో పాటు కౌన్సిలర్ గింజపల్లి వెంకట్రావు కూడా వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య. మాజీ మంత్రి నెట్టెం శ్రీ రఘురాములు వారిని అభినందించి స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో శుక్రవారం నాడు టిడిపిలో చేరటం జరుగుతుందని ప్రకటించారు.
రాఘవేంద్ర నే చైర్మన్గా కొనసాగిస్తాం
ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య వెల్లడి
జగ్గయ్యపేట...
జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్గా రంగాపురం రాఘవేంద్రనే కొనసాగిస్తామని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ప్రకటించారు.
ఈరోజు జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర వైసీపీ పార్టీకి రాజీనామా చేయటంపై జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాజీ మంత్రి నెట్టెం శ్రీ రఘురాం తో పాటు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు వైసిపి పార్టీ నుండి రాఘవేంద్ర రాజీనామా చేసి టిడిపి పార్టీలో చేరారని మిగిలిన పదవీకాలంలో కూడా చైర్మన్ గానే కొనసాగుతారని తెలిపారు. టిడిపి కౌన్సిలర్ల నుండి ఎలాంటి అసంతృప్తి లేదని. వైసీపీ నుండి మరికొంతమంది కౌన్సిలర్లు టిడిపిలో చేరే అవకాశం ఉందని తెలిపారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విజయ సాయిరెడ్డి కూతురికి హైకోర్టు మరో షాక్ - అదీ వదలొద్దని ఆదేశం! ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో!

 

కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్‌నాయుడికి కీల‌క ప‌ద‌వి! త‌న‌కు ద‌క్కిన ఈ అరుదైన గౌర‌వం!

 

18 ఏళ్లు నిండిన వారికి భారీ శుభవార్త.. 13వ తేదీన అస్సలు మిస్ అవ్వకండి!

 

ఏపీ సర్కార్ మరో శుభవార్త.. రైతన్నలకు రూ.2.50 లక్షలు! కచ్చితంగా రైతులకు పాడి పశువులు!

 

ఏపీ మహిళలకు మనీ ఇచ్చేలా రెండు కీలక పథకాలు.. 35 శాతం రాయితీ! అప్లై చేసుకోవాలి అనుకునేవారు ఇలా ఫాలో అవండి!

గల్ఫ్: లైవ్ లో ఒకటిన్నర సంవత్సరం బిడ్డతో తను కూడా క్లోరెక్స్ తాగి ఆత్మహత్యాయత్నం! అకామా లేదుబిడ్డకి పాస్పోర్ట్ లేదు! వదిలేసి పారిపోయిన భర్త! 7

 

గచ్చిబౌలిలో రహస్య రేవ్ పార్టీపై పోలీసుల దాడి! ప్రభుత్వసాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై కేసు!

 

గోదావరి వరద ప్రాంతాల కు ముఖ్యమంత్రి పర్యటన! కొల్లేరు పరివాహక ప్రాంతాలపై సర్వే!

 

మందుబాబులకు కిక్కే కిక్కు! ఏపీలో నూతన మద్యం పాలసీపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ!

 

బైక్,స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! హెల్మెట్ పెట్టుకున్నా మీ లైసెన్స్ రద్దుఈ తప్పు చేయొద్దుకొత్త రూల్స్!

 

ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే ఆఫర్లు! ఊహించని ధరలకు 4K టీవీలుస్మార్ట్ ఫోన్లు! ఎందుకు ఆలస్యం ఆర్డర్ పెట్టండి!

 

తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్! వీటి ధరలు భారీగా తగ్గింపు! నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!

 

రూ.లక్షలు తక్కువకే కొత్త కారు కొనేయండి! మళ్లీ మళ్లీ రాని భారీ ఆఫర్లు!

 

అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నంవిజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!

 

గ్రీక్ దేశం వెళ్లాలనుకునే వారికి శుభవార్త! గోల్డెన్ వీసాపర్మనెంట్ రెసిడన్స్! ₹2.3 కోట్లు పెట్టుబడి ఉంటే చాలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group





   #andhrapravasi #chairman #vizag #TDP #flashnews #latestupdate #todaynews