ఏపీ ప్రజలకు అలర్ట్.. మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ డేట్ ముగింపు ఎప్పుడంటే! ఇదిగో టోల్ ఫ్రీ నెంబర్!

Header Banner

ఏపీ ప్రజలకు అలర్ట్.. మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ డేట్ ముగింపు ఎప్పుడంటే! ఇదిగో టోల్ ఫ్రీ నెంబర్!

  Sat Nov 02, 2024 07:00        Politics

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం దీపం పథకంలో భాగంగా నేటి నుంచి పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణి చేసే కార్యక్రమాన్ని ఈనెల 29 నుంచి ప్రారంభించింది. అయితే దీపావళి కానుకగా ఫస్ట్ ఫ్రీ సిలిండర్ బుక్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించింది. ఇక గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న లబ్దిదారులకు నవంబర్ 1వ తేది నుంచి డెలివరీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిన్న  నుంచి ప్రారంభిస్తోంది. ఏపీలో మొత్తం కోటిన్నరకు పైగా గ్యాస్ కనెక్షన్లున్నాయి. అందులో ఆధార్ కార్డు, తెల్లరేషన్ కార్డు, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి ఈ దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లను ప్రభుత్వం నేటి నుంచి ఉచితంగా అందిస్తోంది.ఫస్ట్ సిలిండర్ ను నిన్న నుంచి మార్చి 31 వరకు ఇస్తుంది. ఈనెల 29 నుంచి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న లబ్దిదారులకు నిన్న నుంచి సిలిండర్లు సప్లై చేస్తుంది ప్రభుత్వం. ముఖ్యంగా పట్టణాల్లో 24గంటల్లో డోర్ డెలవరీ చేస్తుంది.

 

ఇంకా చదవండి: పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం! మూడు నెలల పెన్షన్ ఒకేసారి!

 

 గ్రామాలు, పల్లెల్లో 48గంటల్లో గ్యాస్ సిలిండర్లు ఇంటికి చేరవేయనుంది. ప్రభుత్వం ఇస్తున్న 3 ఉచిత గ్యాస్ సిలిండర్లలో మొదటిది బుక్ చేసుకున్న ఒకటి రెండ్రోజుల్లో వస్తుంది. ఇక దీనికి లబ్దిదారులు మొదట పూర్తిగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సిలిండర్ డెలవరీ చేసిన 2రోజుల్లో లబ్దదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేస్తారు. ఒక్కో లబ్దిదారుడికి గ్యాస్ సిలిండర్ ధర 851 రూపాయలను బ్యాంక్ ఖాతాలో వేయనుంది.తెలంగాణలో ఏడాదికి 12 సిలిండర్లపై కేవలం ఒక్కొక్క బండపై 300 రూపాయలు సబ్సిడీ ఇస్తుండగా..ఏపీలో మాత్రం గ్యాస్ సిలిండర్ డబ్బు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. అయితే ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నట్లుగా సబ్సిడీ కాకుండా పూర్తిగా ఫ్రీ. రేషన్ కార్డు కలిగిన ప్రతీ ఒక్కరు ఈ దీపం 2.0 పథకానికి అర్హులేనని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇక ఈ సబ్సిడీ కోసం రూ.895 కోట్లు నిధులు విడుదలకు సంబంధించిన చెక్కును కూడా సదరు గ్యాస్ కంపెనీల ప్రతినిధులకు అందజేయడం జరిగింది. ప్రభుత్వం అందిస్తున్న దీపం పథకంలో భాగంగా ఎవరికైనా బుక్ చేసుకున్న తర్వాత రెండ్రోజులకు కూడా గ్యాస్ రాకపోతే 1967 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వవచ్చని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. గ్యాస్ సిలిండర్ డబ్బులు కూడా బ్యాంక్ అకౌంట్లో పడకపోతే కంప్లైంట్ చేయాల్సిన నంబర్ ను కూడా ప్రభుత్వం త్వరలోనే తెలియజేయనుంది. రాష్ట్రంలో ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయడంతో ప్రభుత్వంపై రూ. 2,684 కోట్ల రూపాయల అదనపు భారం పడనుందని తెలిపింది. .ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఫ్రీ పొందేవారి జాబితా ఇప్పటికే ప్రభుత్వం దగ్గరుంది. మొదటి సిలిండర్ బుకింగ్ అక్టోబర్ 31 నుంచి మార్చి 31 వరకు గడువు ఇవ్వగా.. రెండో సిలిండర్ బుకింగ్ కోసం ఏప్రిల్ ఫస్ట్ నుంచి జులై 30వ తేది వరకు గడువుంది. ఇక చివరి సిలిండర్‌ను ఆగస్ట్ ఫస్ట్ నుంచి నవంబర్ 31 లోగా ఎప్పుడైనా బుక్ చేసుకొని ఫ్రీగా మూడు సిలిండర్లను పొందవచ్చని ప్రభుత్వం ప్రజలకు వివరించింది. ఒకవేళ 3 ఫ్రీ సిలిండర్లు సరిపోని లబ్దిదారులు ఆపై బుక్ చేసుకునే అదనపు సిలిండర్లకు మొత్తం నగదు రూ.895రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

 

ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్! కుటుంబంలో 18 ఏళ్లు నిండిన వారికి శుభవార్త.. రూ.లక్షకు రూ.2 లక్షలు లాభం!Don't Miss

 

చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?

 

ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదల? టీటీడీ చైర్మన్ ఆయనేనా?

 

పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!

 

మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?

 

ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!

 

గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!

 

విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!

 

ఈ-చలాన్‌ పేరుతో కొత్త స్కామ్‌! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!

 

పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై మరో కీలక అప్‌డేట్! 24 గంటల్లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ! వాళ్లు డబ్బులు కట్టాల్సిందే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples