ప్రధానికి సీఎం చంద్రబాబు స్పెషల్ రిక్వెస్ట్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఏపీలో ఆ జిల్లాల వారికి పండగే పండగ!

Header Banner

ప్రధానికి సీఎం చంద్రబాబు స్పెషల్ రిక్వెస్ట్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఏపీలో ఆ జిల్లాల వారికి పండగే పండగ!

  Sat Nov 02, 2024 14:41        Politics

ఏపీ లో కూటమి ప్రభుత్వంతో గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తోంది. కీలక అంశాల్లో సానుకూలం గా స్పందిస్తోంది. రాజధాని, అమరావతి విషయాల్లో ఆర్దికంగా సాయం ప్రకటించింది. ఏపీకి రైళ్లు, రోడ్ల విషయంలో ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పుడు తాజాగా ఏపీ ప్రభుత్వం నుంచి మరో కీలక ప్రతిపాదన కేంద్రానికి చేరింది. కోల్ కతా కు అందించిన సహకారం తరహాలోనే తమకు మద్దతు ఇవ్వాలని కోరింది. దీని పైన కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం తాజాగా విశాఖ, విజయవాడలో మెట్రో ప్రాజెక్టుల పైన ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఈ రెండు నగరాల్లో మెట్రోరైలు ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు రూ. 42,362 కోట్లు సమకూర్చాలని కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదించింది. విజయవాడ మెట్రోకు రూ.25,130 కోట్లు, విశాఖ మెట్రోకు 17,232 కోట్లు అవసరమని అంచనాగా పేర్కొది. విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రమే నిధులివ్వాలని కోరింది. మెట్రో భూ సేకరణకు అయ్యే ఖర్చును తాము భరిస్తామని వెల్లడిచింది. 2014-19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ, విశాఖలో మెట్రోరైలు ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రయత్నం జరిగింది. ఆ సమయంలోనే ప్రాజెక్టు నివేదికలు కేంద్రం ఆమోదం కోసం పంపారు.

 

ఇంకా చదవండి: పెన్షన్ డబ్బులతో ఉద్యోగి పరార్! సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్!

 

కానీ, మెట్రోరైలు కొత్త విధానం ప్రకారం వాటిని సవరించాలని కేంద్ర పట్టణ, గృహనిర్మాణ మంత్రిత్వశాఖ సూచించింది. 2024 ధరల ప్రకారం రెండు నగరాల్లో మెట్రో ప్రాజెక్టులకు రూ. 42,362 కోట్లు సమకూర్చాలని కేంద్రానికి ప్రతిపాదించింది. విజయవాడలో రెండు దశల్లో 3 కారిడార్లకు రూ.25,130 కోట్లు, విశాఖలో 2 దశల్లో 4 కారిడార్ల పనులకు 17,232 కోట్లు అవసరమని అంచనా వేసింది. ఈ రెండు నగరాల్లో కలిపి మెట్రోకు అవసరమైన 258 ఎకరాల భూ సేకరణకు అయ్యే రూ.2,799 కోట్లను మాత్రం రాష్ట్రం భరిస్తుందని సంసిద్దత వ్యక్తం చేసింది. ఇదే సమయంలో కేంద్రం కోల్‌కతాలో తూర్పు-పశ్చిమ మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణానికి 2017 మెట్రోరైలు పాలసీలో 100 శాతం నిధులు సమకూర్చిన విషయాన్ని ఏపీ ప్రభుత్వం గుర్తు చేస్తోంది. ఏపీకి ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిమితులు, నిధుల కొరత దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు మొత్తం కేంద్రమే భరించాలని అభ్యర్దించింది. కోల్ కతాకు అందించిన సాయం తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌కూ నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 17, 18 తేదీల్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ సమయంలో ప్రధానికి వ్యక్తిగతంగా ఈ ప్రాజెక్టు పైన ప్రతిపాదన మరోసారి అందించనున్నట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్! కుటుంబంలో 18 ఏళ్లు నిండిన వారికి శుభవార్త.. రూ.లక్షకు రూ.2 లక్షలు లాభం!Don't Miss

 

చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?

 

ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదల? టీటీడీ చైర్మన్ ఆయనేనా?

 

పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!

 

మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?

 

ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!

 

గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!

 

విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!

 

ఈ-చలాన్‌ పేరుతో కొత్త స్కామ్‌! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!

 

పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై మరో కీలక అప్‌డేట్! 24 గంటల్లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ! వాళ్లు డబ్బులు కట్టాల్సిందే!

 

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews