నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

Header Banner

నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

  Sat Nov 09, 2024 07:00        Politics

కూటమి ప్రభుత్వం కీలక ప్రకటనకు సిద్దమైంది. మూడు పార్టీల్లోని నేతలు నిరీక్షిస్తున్న నామి నేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరింది. రెండో విడత జాబితా పైన సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. ఇప్పటికే పవన్ నుంచి రెండో జాబితా లో జనసేన నుంచి అవకాశం ఇచ్చే వారి పేర్లను సేకరించారు. బీజేపీ ముఖ్యల పేర్లు ఖరారు అయినట్లు తెలుస్తోంది. దీంతో, ఒకటి రెండు రోజుల్లోనే రెండో జాబితా విడుదల కానుంది. ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదలకు తుది కసరత్తు జరుగుతోంది. ఈ నెల 11వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ లోగానే నామినేటెడ్ పదవుల లిస్టు ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. తాజాగా సచివాలయంలో పవన్ తో సమావేశం సమయంలోనూ ఈ జాబితా పైన చర్చకు వచ్చింది. జనసేన నుంచి పేర్లను సూచించాలని చంద్రబాబు కోరారు. పార్టీలో చర్చించి అందిస్తాని చెప్పిన పవన్ ఈ రోజు ఆ జాబితా చంద్రబాబుకు పంపినట్లు సమాచారం. అదే విధంగా బీజేపీ నుంచి కొందరి పేర్లను చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది.

 

ఇంకా చదవండి: ఆలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నియామకాలు! 500 కొత్త పోస్టుల భర్తీకి దేవాదాయశాఖ సిద్ధం!

 

టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఎన్నికల సమయంలో సీట్లు త్యాగం చేసిన వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. తొలి జాబితాలో పేర్ల ప్రకటన తరువాత కొందరు నేతలు తమకు అవకాశం ఇవ్వకపోవటం పైన కినుక వహించారు. దీంతో, పార్టీ కోసం పని చేసి నాటి అధికార పార్టీ వేధింపులు ఎదుర్కొని.. జైలుకు వెళ్లిన వారికి ప్రాధాన్యత ఉంటుందని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. పార్టీ కోసం పోరాటం చేసి నష్టపోయిన వారికి పదవుల్లో తగిన గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు. సామాజిక సమతుల్యత పాటిస్తూ పలు సంఘాలకు కార్పోరేషన్లు .. డైరెక్టర్ల నియామకం పైన ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రెండో జాబితాలో దాదాపు 100 పోస్టుల వరకు ఉంటాయని భావిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో టీడీపీ లో పలువురు నేతలు పదవులు ఆశిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది రాష్ట్ర స్థాయి పదవులు కోరుకుంటున్నారు. తొలి జాబితాల డైరెక్టర్ల పదవులు కేటాయించిన వారిలో కొందరు తమకు ఆ పదవులు అవసరం లేదని.. పార్టీలో పని చేస్తామని ప్రకటించారు. దీంతో, ఈ సారి జాబితాను అన్ని కోణాల్లోనూ ఆచి తూచి ఎంపిక చేస్తున్నారు. సీట్లు దక్కని సీనియర్లకు ఈ లిస్టులో అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సమయంలో అంత కంటే ముందుగానే ఈ జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.


ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...

 

మతిపోగొట్టే ఫీచర్లతో టాటా నానో ఎలక్ట్రిక్ కారు! కొత్తగా కారు కొనాలనుకునేవాళ్లకి ఇదే బంపర్ ఆఫర్! అతి తక్కువ ధరకే!

 

APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు!

 

ఏపీ రైతులకు శుభవార్త! ఆ పంట వేసిన వారికి అదృష్టమే.. మంత్రి కీలక ప్రకటన!

 

న్యూజిలాండ్ పర్యటనలో ప్రధానితో తెదేపా ఎమ్మెల్యేల భేటీ! ఏపీ అభివృద్ధి అంశాలపై చర్చలు!

 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత భేటీ! ఫేక్ పోస్టులపై కఠిన చర్యలు!

 

టీడీపీ కార్యాలయంలో ప్రజావేదిక! 08-11-2024 న పాల్గొననున్న మంత్రులు, నాయకుల షెడ్యూల్!

 

వైసీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌! వారిని వదలిపెట్టే ప్రసక్తే లేదు!

 

నేడు ఢిల్లీలో అమిత్ షాను కలవనున్న పవన్ కల్యాణ్! ఎందుకో తెలుసా! కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే!

 

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! విద్యావిధానంలో మరియు ఆ విషయంలో కీలక మార్పులు.. ఇక పండగే!

 

మీరు స్కూటీ కొనాలనుకుంటున్నారా..? అదిరిపోయే ఫీచర్లతో - అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటీ!

 

గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే! సంచలన వ్యాఖ్యలు చేసిన డీజీపీ! ఇక వారికి మోతే!

 

బీఎస్‌ఎన్‌ఎల్‌ స్పెషల్‌ రీఛార్జ్‌ ఆఫర్‌! అన్‌లిమిటెడ్‌ కాల్స్‌... 600 జీబీ డేటా!

 

ఆ న్యూస్ వెబ్సైట్ కి భారీ షాక్! కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ! ఎందుకంటే..

 

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews