ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే సీఎం చంద్రబాబు వాట్సాప్ ప్లాన్! ఆధార్ తప్పనిసరి? ఇకపై ఆ సమస్యలన్నీ వాట్సాప్ లోనే చెక్!

Header Banner

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే సీఎం చంద్రబాబు వాట్సాప్ ప్లాన్! ఆధార్ తప్పనిసరి? ఇకపై ఆ సమస్యలన్నీ వాట్సాప్ లోనే చెక్!

  Sat Nov 09, 2024 09:47        Politics

రాష్ట్ర ప్రభుత్వానికి రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ అనేది ఒక ప్రధాన డేటా వ‌న‌రుగా ఉండాల‌ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. స‌చివాల‌యంలో శుక్రవారం రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ (ఆర్టీజీ)పై సీఎం స‌మీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆర్టీజీఎస్‌లో జ‌రుగుతున్న డేటా ఇంటిగ్రేష‌న్ ప‌నులను గురించి అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీజీ శాఖ కార్యద‌ర్శి ఎస్‌. సురేష్ కుమార్‌, ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్‌లు ఆర్టీజీఎస్ ద్వారా చేప‌డుతున్న డేటా ఇంటిగ్రేష‌న్ ప‌నుల ప్రగ‌తి గురించి ముఖ్యమంత్రికి వివ‌రించారు.  ఈ సంద‌ర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆర్టీజీ అనేది ప్రభుత్వానికి రియ‌ల్ టైమ్ డేటా అందించే ఏకైక వ‌న‌రుగా ప‌నిచేయాల‌ని అన్నారు. అన్ని విభాగాల్లోని డేటాను ఒక వేదిక‌పైకి తీసుకొచ్చి అనుసంధానం చేసి, ప్రభుత్వ ప‌థ‌కాలు, కార్యక్రమాలను డేటా ద్వారా విశ్లేషించాల‌న్నారు. ఆర్టీజీఎస్ అనేది ప్రభుత్వానికి ఒక స‌దుపాయ సాధ‌నంగా, అన్ని వేళ‌లా స‌హాయ‌కారిగా ప‌నిచేయాల‌ని సూచించారు. పౌరులు ఇప్పటికి కూడా త‌మ‌కు కావాల్సిన ప్రాథ‌మిక‌మైన ‌ధ్రువీకర‌ణ ప‌త్రాలు, జ‌న‌న‌, మ‌ర‌ణ ‌ధ్రువీకర‌ణ ప‌త్రాలు, నివాసం, ఆదాయం, విద్యార్హత లాంటి ‌ధ్రువీకర‌ణ ప‌త్రాల కోసం అధికారులు, కార్యాల‌యాల చుట్టూ ప్రద‌క్షిణ‌లు చేయాల్సి వ‌స్తోంద‌ని ఈ విధానం మారాల‌న్నారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

ప్రభుత్వం ప్రజ‌ల‌కు వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ను అందుబాటులోకి తెచ్చి వారికి కావాల్సిన సేవ‌ల‌న్నీ సులభంగా అందేలా చేయ‌నుంద‌ని, ఆ దిశ‌గా ప‌ని చేయాల‌న్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40 ల‌క్షల మంది పౌరులకు సంబంధించి డేటా లేద‌ని అధికారులు వివరించగా, ఈ డేటాను స‌త్వరం సేక‌రించి అనుసంధానించే చ‌ర్యలు తీసుకోవాల‌ని సీఎం సూచించారు. రాష్ట్రంలోని అన్ని గృహాల‌ను జీపీఎస్ ద్వారా అనుసంధానం చేయాల‌ని సూచించారు. వాట్సాప్ ద్వారా ఈ నెలాఖ‌రుకు వంద సేవ‌లు పౌరుల‌కు అందుబాటులోకి తేవ‌డానికి కృషి చేస్తున్నట్లు సీఎంకు ఐటీ, ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేశ్ వివరించారు. అలాగే 90 రోజుల్లో విద్యార్థులు క్యూఆర్ కోడ్ ద్వారా త‌మ విద్యార్హత ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు పొందేలా కూడా చ‌ర్యలు చేప‌డుతున్నామ‌ని వెల్లడించారు. దీనికి సంబంధించిన ప‌నులు వేగ‌వంతంగా చేస్తున్నామ‌ని వివ‌రించారు. మార్చి నెలాఖ‌రు నుంచి పూర్తి స్థాయిలో ప్రజ‌ల‌కు వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ అందుబాటులోకి తేవాల‌నే ల‌క్ష్యంతో ప‌నిచేస్తున్నామ‌ని వివ‌రించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.  


ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...

 

మతిపోగొట్టే ఫీచర్లతో టాటా నానో ఎలక్ట్రిక్ కారు! కొత్తగా కారు కొనాలనుకునేవాళ్లకి ఇదే బంపర్ ఆఫర్! అతి తక్కువ ధరకే!

 

APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు!

 

ఏపీ రైతులకు శుభవార్త! ఆ పంట వేసిన వారికి అదృష్టమే.. మంత్రి కీలక ప్రకటన!

 

న్యూజిలాండ్ పర్యటనలో ప్రధానితో తెదేపా ఎమ్మెల్యేల భేటీ! ఏపీ అభివృద్ధి అంశాలపై చర్చలు!

 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత భేటీ! ఫేక్ పోస్టులపై కఠిన చర్యలు!

 

టీడీపీ కార్యాలయంలో ప్రజావేదిక! 08-11-2024 న పాల్గొననున్న మంత్రులు, నాయకుల షెడ్యూల్!

 

వైసీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌! వారిని వదలిపెట్టే ప్రసక్తే లేదు!

 

నేడు ఢిల్లీలో అమిత్ షాను కలవనున్న పవన్ కల్యాణ్! ఎందుకో తెలుసా! కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే!

 

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! విద్యావిధానంలో మరియు ఆ విషయంలో కీలక మార్పులు.. ఇక పండగే!

 

మీరు స్కూటీ కొనాలనుకుంటున్నారా..? అదిరిపోయే ఫీచర్లతో - అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటీ!

 

గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే! సంచలన వ్యాఖ్యలు చేసిన డీజీపీ! ఇక వారికి మోతే!

 

బీఎస్‌ఎన్‌ఎల్‌ స్పెషల్‌ రీఛార్జ్‌ ఆఫర్‌! అన్‌లిమిటెడ్‌ కాల్స్‌... 600 జీబీ డేటా!

 

ఆ న్యూస్ వెబ్సైట్ కి భారీ షాక్! కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ! ఎందుకంటే..

 

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews