కర్నూలు కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలు బ్రేక్! సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

Header Banner

కర్నూలు కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలు బ్రేక్! సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

  Wed Nov 13, 2024 08:38        Politics

కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం లభ్యత, పరిశోధనల కోసం బోర్లు వేసే ప్రతిపాదనను నిలిపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఆదేశాలిచ్చారు. ఈ తవ్వకాలను వ్యతిరేకిస్తూ కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న సమీప గ్రామాల ప్రజలకు ఉపశమనం లభించినట్లైంది. 2023 జూన్లో వైకాపా ప్రభుత్వ హయాంలోనే బోర్ల తవ్వకాల కోసం స్టేజ్-1 అనుమతులు మంజూరయ్యాయి. కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం ఉందా, లేదా అన్నది నిర్ధారించడానికి గత ప్రభుత్వ హయాంలోనే కొన్నిచోట్ల తవ్వకాలు జరిపారు. నమూనాలు పరీక్షించగా, యురేనియం నిక్షేపాలున్నట్లు తేలింది. మరింత లోతైన పరిశోధన కోసం అటవీ ప్రాంతంలోని 468.25 హెక్టార్లలో 68 బోర్ హోల్స్ వేసి మట్టి నమూనాలను తీసి విశ్లేషించాలని కేంద్ర ప్రభుత్వ 'ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ రేషన్ అండ్ రీసెర్చ్' (ఏఎండీ) నిర్ణయించింది. వారి తదుపరి కార్యాచరణను ఏఎండీ ఇటీవల విడుదల చేసింది. దీనిపై స్థానికుల్లో నిరసన వ్యక్తమైంది.



ఇంకా చదవండిఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14


వైకాపా దుష్ప్రచారం
ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం ఇక్కడ తవ్వకాలకు అనుమతులు ఇవ్వకపోయినా, కొందరు వైకాపా నాయకులు తెదేపా ప్రభుత్వమే తవ్వకాలకు అనుమతులు ఇచ్చిందంటూ దుష్ప్రచారం చేశారు. ఈ విషయాన్ని మంత్రి టీజీ భరత్, పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి వివరించారు. మంగళవారం మీడియా పాయింట్లోనూ మాట్లాడారు. స్పందించిన సీఎం.. కప్పట్రాళ్లలో భవిష్యత్తులోనూ యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వకూడదని ప్రకటించారు. వాస్తవానికి ఎంఏడీ కోరిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్టేజ్-2 అనుమతులు ఇవ్వాల్సి ఉండగా, తాజా నిర్ణయంతో తదుపరి తవ్వకాలకు బ్రేక్ పడినట్లైంది. బోర్హోల్స్ వేయడం నిలిచిపోనుంది. ఈ మేరకు కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మంగళవారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని కోరారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు!

 

శుభవార్త.. APలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ప్రాజెక్టు.. ఏకంగా 65 వేల కోట్లతో! యువతకు లక్షల్లో ఉద్యోగాలు!

 

మూడవ విడత నామి నేటెడ్ పోస్టులు విడుదల! ఆ లిస్ట్ మీకోసం! ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది!

 

వైసీపీకి వరుస షాక్ లు! నేతలపై పోలీసులు లుకౌట్ నోటీసులు! ప్రత్యేక బృందాలు రంగంలోకి.. అంతా పరారే పరార్!

 

అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!

 

జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది! అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం! ఎమ్మెలందరికీ శిక్షణ తరగతులు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి కార్పొరేటర్ ప్రతినిధులుసీనియర్ నేతలు! పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానం!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?

 

APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!

 

లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!

 

రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

 

ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!

 

మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #urenium #mining #karnool #break #todaynews #flashnews #latestupdate