చంద్రబాబు సంబరపడేలా మళ్ళీ శుభవార్త చెప్పిన మోదీ! రెండు ప్రాజెక్టులకు నిధులను కేటాయించిన కేంద్రం! ఆ జిల్లాల వారికి పండగే!

Header Banner

చంద్రబాబు సంబరపడేలా మళ్ళీ శుభవార్త చెప్పిన మోదీ! రెండు ప్రాజెక్టులకు నిధులను కేటాయించిన కేంద్రం! ఆ జిల్లాల వారికి పండగే!

  Thu Nov 28, 2024 19:25        Politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పాలన సాగించిన నాటి నుంచి కేంద్రం ప్రత్యేకమైన దృష్టిని ఏపీపైన కేంద్రీకరించింది. రాష్ట్రంలో అనేక రంగాలలో అభివృద్ధి కోసం కేంద్రం భారీగా నిధులను కేటాయిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా పర్యాటక రంగాన్ని కొత్త మలుపు తిప్పే విధంగా పలు ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 172.34 కోట్ల రూపాయలను కేటాయించింది. ఏపీ సీఎం చంద్రబాబుకు వరుస శుభవార్తలను చెబుతున్న మోదీ సర్కార్ ఏపీ ప్రగతి పథంలో పయనించేందుకు తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తేల్చి చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకంగా అభివృద్ధి కోసం మూలధన పెట్టుబడి కి ప్రత్యేక తోడ్పాటునందించే పథకం అయిన సాస్కి పథకంలో భాగంగా 172.34 కోట్ల రూపాయలను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టుల అభివృద్ధికి ఈ నిధులను కేటాయించింది.

 

ఇంకా చదవండి: ఈసారి అమరావతిలోనే రిపబ్లిక్ డే - ఎక్కడో తెలుసా..? తొలిసారి రాష్ట్రస్దాయి వేడుక ఇదే!

 

ఒక్కో రాష్ట్రానికి రెండు ప్రాజెక్టులు చొప్పున, మొత్తం తొమ్మిది రాష్ట్రాలకు పర్యాటక రంగ అభివృద్ధికి ప్రాజెక్టులకు నిధులను కేటాయించిన కేంద్రం తొలివిడతగా 113.75 కోట్లను కేంద్రం విడుదల చేసింది. సాస్కి పథకంలో భాగంగా కేంద్రం ఇచ్చే నిధుల కోసం దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు పోటీ పడగా, ఎనిమిది రాష్ట్రాలు మధ్యలోనే పోటీ నుంచి వెనక్కు తప్పుకున్నాయి. మిగిలిన రాష్ట్రాలలో 11 రాష్ట్రాలకు ఒకటి చొప్పున 9 రాష్ట్రాలకు రెండు చొప్పున ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇచ్చింది. అందులో ఏపీ కూడా ఉండడం ముఖ్యమైన విషయం. సాస్కీ పథకంలో భాగంగా ఏపీకి అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులకు అంగీకరించింది. అయితే కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన సూర్యలంక బీచ్ అభివృద్ధి పనుల పై మాత్రం కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ రెండు ప్రాజెక్టులకు త్వరలో టెండర్లు పిలిచి జనవరిలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కృషి కారణంగానే సాస్కీ పథకంలో ఏపీకి ప్రాధాన్యత దక్కిందన్నారు. ఇక తామ ప్రతిపాదించిన సూర్యలంక బీచ్ ను మరో పథకంలో అభివృద్ధి చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

ఇంకా చదవండి: ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్! పెన్షన్ లపై కీలక ఆదేశాలు! పూర్తి వివరాలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి! వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు!

 

షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారు? అసలు నిజం ఇదే!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!

 

వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్ల‌డం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!

 

ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!

 

గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!

 

పెన్షన్ దారులకు పండగే పండగ.. ఒకరోజు ముందుగానే పెన్షన్ డబ్బులు! కొన్ని కీలక మార్పులు - కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

 

ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్‌ జారీ! ఎప్పటినుంచి అంటే!

 

కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!

 

నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ..తెలంగాణ, తమిళనాడులో పోలీసుల గాలింపు! ఈరోజు ఏపీ హైకోర్టులో..

 

భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews