ఏపీకి తీపికబురు చెప్పిన కేంద్రం.. పవన్ శాఖకు బిగ్ బూస్ట్! ఇక వారికి పండగే పండగ - రెండు విడతలుగా నిధులు విడుదల!
Wed Dec 25, 2024 07:00 Politicsఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాఖకు బూస్ట్ ఇస్తోంది కేంద్రం .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీపి కబురు చెప్పిన కేంద్రం ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుండి ఏపీపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అడిగినవి, ఇవ్వాల్సినవి ఇస్తూ ఎప్పటికప్పుడు ప్రకటన చేస్తోంది. పవన్ కళ్యాణ్ శాఖ అయిన పంచాయతీరాజ్ శాఖకు గ్రామీణ స్థానిక సంస్థల కోసం 15వ ఆర్థిక సంఘం గ్రాంట్స్ ను విడుదల చేసింది. 2024 - 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ గ్రాంట్స్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 446.49 కోట్ల నిధులను విడుదల చేసింది. కేంద్రం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం స్థానిక పరిపాలన కోసం ఈ నిధులను వినియోగించుకునేందుకు కేంద్రం ఈ నిధులను ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండవ విడత కింద ఆంధ్రప్రదేశ్ కు నిధులు విడుదల చేసినట్టు ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రెండు విడతలుగా 446.49 కోట్ల రూపాయలను విడుదల చేసినట్టు పేర్కొంది.
ఇంకా చదవండి: అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!
మొదటి విడత గ్రాంట్ లో 25.49 కోట్ల రూపాయలు, రెండవ విడుదల విడుదల చేసిన 420. 99కోట్ల రూపాయలు కలిపి మొత్తం 446.49 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ నిధులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 1397 గ్రామపంచాయతీలు, 650 మండల పరిషత్తులు, 13 జిల్లా పరిషత్ లు అభివృద్ధి చేసుకునే వీలు కలుగుతుందని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ పేర్కొంది. కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసే ఈ నిధులు గ్రామీణ ప్రాంతాలలోని మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయగా తాజాగా రెండవ విడత నిధులను కూడా విడుదల చేసినట్టు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ పేర్కొంది. మొత్తంగా ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సంబంధించిన శాఖకు నిధులు విడుదల చేసి కేంద్రం తీపి కబురు చెప్పింది.
ఇంకా చదవండి: అమెరికాలో మరో ఘోర ప్రమాదం! ఊహించని విధంగా తెలుగు విద్యార్ధి మృతి! ఇలా కూడా జరుగుతుందా అనే రీతిలో! మరో ఇద్దరు క్షేమం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
ఏపీఎస్డీఎంఏ: రెండ్రోజుల పాటు వర్షాలు! బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో..
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో మలుపు! ఏ18గా మైత్రీ మూవీస్... నిందితుల జాబితా ఇదే!
రెండు సిమ్ కార్డులు వాడుతున్నారా? ఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు! కీలక ఆదేశాలు - అది ఏమిటంటే!
విమానం టికెట్ ఇంత తక్కువకా.. ఇండిగో బంపర్ ఆఫర్! ఎయిర్‌లైన్ సూచనలు ఇవే!
ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు! పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన!
బీసీ సంక్షేమానికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు! ప్రత్యేక రక్షణ చట్టంపై...!
బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారా? జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #PawanKalyan #Repalle #VarahiVijayabheri #Janasena #TDP-JanaSena-BJPAlliance #Jagan #YSRCP
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.