ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త.. వాటిపై 90 శాతం రాయితీ! వెంటనే పొందండి..

Header Banner

ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త.. వాటిపై 90 శాతం రాయితీ! వెంటనే పొందండి..

  Thu Dec 26, 2024 08:00        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రిప్ ఇర్రిగేషన్ ఉత్పత్తులపై మళ్లీ 90 శాతం సబ్సిడీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఆల్రెడీ కొందరు రైతులు ఈ ప్రయోజనం పొందారు కూడా. ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన (PMKSY)లో భాగంగా ఏపీలో అమలవుతోంది. గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ జల కళ పేరుతో దీన్ని అమలు చేసింది. కానీ అధికారులు సరిగా ప్రచారం చెయ్యకపోవడంతో రైతులు దీన్ని సరిగా పొందలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీన్ని పొందమని రైతులకు చెబుతోంది. ఎలా పొందాలో చూద్దాం. ఈ పథకం ద్వారా రైతులు డ్రిప్ ఇర్రిగేషన్‌కి సంబంధించిన ఉత్పత్తులను 90 శాతం తగ్గింపు ధరకు ప్రభుత్వం నుంచి పొందవచ్చు. ఇది పొందేందుకు చిన్న, సన్నకారు రైతులు అర్హులు. వారికి వ్యవసాయ పొలం ఉండాలి, సాగు కోసం నీరు అందుబాటులో ఉండాలి. పథకం అమలులో కూరగాయలు, పండ్లు, వాణిజ్య పంటలు వేసే రైతులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.

 

ఇంకా చదవండి: ప్రధాని మోదీతో దాదాపు గంటపాటు చంద్రబాబు భేటీ! పలు కీలక అంశాలపై కీలక నిర్ణయం!

 

అవసరమైన పత్రాలు: ఈ ప్రయోజనం పొందేందుకు రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, భూమి పత్రాలు, పట్టాదారు పాస్ బుక్, బ్యాంక్ పాస్ బుక్, భూమి మ్యాప్, భూసార పరీక్ష రిపోర్ట్, నీరు వస్తుందని చెప్పే బోరు, చెరువు, బావి లాంటి రుజువు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో కలిగివుండాలి. ఈ పథకం పొందాలి అనుకునే రైతులు ముందుగా.. తమకు దగ్గర్లోని వ్యవసాయ ఆఫీసుకి వెళ్లాలి. మండలం, జిల్లాలో ఉన్న ఆఫీసుకి కూడా వెళ్లొచ్చు. వెళ్లి, PMKSY సంబంధిత పథకంలో భాగంగా ఇస్తున్న డ్రిప్ ఇర్రిగేషన్ సబ్సిడీ కోసం అప్లై చేసుకునేందుకు దరఖాస్తు ఫారమ్ ఇవ్వమని అడగండి.

 

ఇంకా చదవండి: కేంద్ర మంత్రుల‌తో చంద్ర‌బాబు భేటీ! రాష్ట్రంలోని ప‌లు రైల్వే ప్రాజెక్టుల‌పై!

 

ఫారమ్‌లో వివరాలు నింపి, అక్కడి సంబంధిత అధికారికి ఇస్తే, వారు ప్రక్రియ ప్రారంభిస్తారు. మీరు ఫారమ్ ఇచ్చాక, ఒక అధికారి, భూమి ఉన్నచోటికి వచ్చి, భూమిని పరిశీలించి, నీటిని గమనించి, డ్రిప్ ఇర్రిగేషన్‌కి భూమి అనుకూలమా కాదా అనేది పరిశీలిస్తారు. అన్ని రకాలుగా అనుకూలంగా, అర్హతలు కూడా ఉంటే, అప్లికేషన్‌ని అమోదిస్తారు. ఈ విషయాన్ని మొబైల్‌కి SMS లేదా ఈమెయిల్ ద్వారా చెబుతారు. అలాగే.. వ్యవసాయ పరికరాలకు ఎంత డబ్బు చెల్లించాలో, ఎంత సబ్సిడీ ఉందో అన్నీ చెబుతారు. ఆ పరికరాలను ఎక్కడ కొనవచ్చో వివరాలు ఇస్తారు. అక్కడ కొనుక్కోవచ్చు. ఆ సప్లయర్ వచ్చి.. డ్రిప్ పరికరాల్ని పొలం దగ్గర సెట్ చేస్తారు. మీరు 10 శాతం డబ్బు చెల్లించగానే, ప్రభుత్వం మిగతా 90 శాతం డబ్బు చెల్లిస్తుంది.

 

ఇంకా చదవండి: తిరుమల భక్తులకు శుభవార్త! గంటలోనే శ్రీవారి దర్శనం - అమల్లోకి టీటీడీ కొత్త విధానం!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పీఆర్, పర్సనల్ మేనేజర్ ను తొలగించిన చిరంజీవి! దీనిపై ఆరా తీయగా..

 

ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు!

 

ఏపీకి తీపికబురు చెప్పిన కేంద్రం.. పవన్ శాఖకు బిగ్ బూస్ట్! ఇక వారికి పండగే పండగ - రెండు విడతలుగా నిధులు విడుదల!

 

అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!

 

నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

ఏపీఎస్డీఎంఏ: రెండ్రోజుల పాటు వర్షాలు! బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో..

 

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో మలుపు! ఏ18గా మైత్రీ మూవీస్... నిందితుల జాబితా ఇదే!

 

రెండు సిమ్ కార్డులు వాడుతున్నారా? ఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు! కీలక ఆదేశాలు - అది ఏమిటంటే!

 

విమానం టికెట్ ఇంత తక్కువకా.. ఇండిగో బంపర్ ఆఫర్! ఎయిర్‌లైన్ సూచనలు ఇవే!

 

రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. నెలకు రూ.3 లక్షల 20 వేల జీతంతో జాబ్, అర్హతలు ఇవే! వారికి జర్మనీ దేశంలో..

 

నేడు (24/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు! పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన!

 

బీసీ సంక్షేమానికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు! ప్రత్యేక రక్షణ చట్టంపై...!

 

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కారు! ఇకపై ఆ తరగతుల విద్యార్థులు మస్ట్​గా పాస్​ కావాల్సిందే - లేదంటే!

 

బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారా? జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews