బాక్సింగ్ డే అంటే ఏమిటి? క్రిస్మస్ తర్వాతి రోజునే ఎందుకు జరుపుకుంటారు?

Header Banner

బాక్సింగ్ డే అంటే ఏమిటి? క్రిస్మస్ తర్వాతి రోజునే ఎందుకు జరుపుకుంటారు?

  Thu Dec 26, 2024 15:52        World

ఇవాళ (డిసెంబర్ 26) ప్రపంచవ్యాప్తంగా బాక్సింగ్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. క్రైస్తవ మతస్తులు పరిశుద్ధమైనదిగా భావించే ‘బాక్సింగ్ డే’ అంటే ఏమిటి?, క్రిస్మస్ మరుసటి రోజునే ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు? అనే సందేహాలు మీకెప్పుడైనా వచ్చాయా..! అయితే, ఆసక్తికరమైన ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే. 

 

క్రైస్తవులు పాటించే ఒక ఆచారమే బాక్సింగ్ డే. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటుండగా... మరుసటి రోజు అంటే డిసెంబర్ 26న నిరుపేదలు, సేవకులకు బహుమతులు, కానుకలు అందజేయడం ఒక సంప్రదాయం ముఖ్య ఉద్దేశం. బాక్సింగ్ డే అనే పదం ‘క్రిస్మస్ బాక్స్’ అనే పదం నుంచి వచ్చింది. ధనికులు, సంపన్నులు తమకు సేవలు అందించే పనివారికి, నిరుపేదలకు ‘క్రిస్మస్ బాక్స్’ల్లో పెట్టి బహుమతులు అందజేస్తుంటారు. 

 

ఇంకా చదవండితిరుమల భక్తులకు శుభవార్త! గంటలోనే శ్రీవారి దర్శనం - అమల్లోకి టీటీడీ కొత్త విధానం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

యజమానుల నుంచి అందిన బహుమతి బాక్సులను తీసుకెళ్లి కుటుంబ సభ్యులతో గడిపేందుకు సేవకులకు ఆ రోజు సెలవులు ఇస్తారు. ఆ రోజున బహుమతుల బాక్సులను తెరుస్తుంటారు. అందుకే క్రిస్మస్ మరుసటి దినాన్ని ‘బాక్సింగ్ డే’గా పాటిస్తారు. 19వ శతాబ్దంలో యూకేలో క్వీన్ విక్టోరియా ఉన్నప్పుడే ఈ ఆచారం ప్రారంభమైంది.

 

బాక్సింగ్ డేకి సంబంధించి మరో సిద్ధాంతం కూడా ప్రచారంలో ఉంది. పేదల కోసం డబ్బు, కానుకలు స్వీకరించేందుకు చర్చిలో ఉంచిన బాక్స్‌ను క్రిస్మస్ మరుసటి రోజున తెరుస్తారు. అందులోని బహుమతులను పేదలకు పంచి పెడతారని, అందుకే బాక్సింగ్ డేగా పాటిస్తారని చెబుతుంటారు. కాగా, బాక్సింగ్ డేను ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌తో పాటు అనేక ఇతర కామన్వెల్త్ దేశాలలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అయితే ప్రస్తుతం బాక్సింగ్ డే షాపింగ్‌లకు ప్రసిద్ధమైనదిగా మారిపోవడం, కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి సంతోషంగా విందులు చేయడం వంటి ట్రెండ్ కనిపిస్తోంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పీఆర్, పర్సనల్ మేనేజర్ ను తొలగించిన చిరంజీవి! దీనిపై ఆరా తీయగా..

 

ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు!

 

ఏపీకి తీపికబురు చెప్పిన కేంద్రం.. పవన్ శాఖకు బిగ్ బూస్ట్! ఇక వారికి పండగే పండగ - రెండు విడతలుగా నిధులు విడుదల!

 

అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!

 

నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

ఏపీఎస్డీఎంఏ: రెండ్రోజుల పాటు వర్షాలు! బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో..

 

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో మలుపు! ఏ18గా మైత్రీ మూవీస్... నిందితుల జాబితా ఇదే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #World #BoxingDay #Festival