ఎస్బీఐ వినియోగదారులకు హెచ్చరిక! ఇలాంటి వాటి బారిన పడకుండా.. వెంటనే ఇలా చేయండి!

Header Banner

ఎస్బీఐ వినియోగదారులకు హెచ్చరిక! ఇలాంటి వాటి బారిన పడకుండా.. వెంటనే ఇలా చేయండి!

  Thu Dec 26, 2024 10:00        Business

టెక్నాలజీతో పాటు ఆన్ లైన్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ఆధునికతను అందిపుచ్చుకుంటూ దేశంలో ఆన్లైన్ మోసాలు చేసేవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇటీవలి కాలంలో ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తన కస్టమర్లకు దేశీయ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ కీలక అలర్ట్ జారీ చేసింది. కొత్త టెక్నాలజీని ఉపయోగించి జనాన్ని మోసగించడంలో ఆన్ లైన్ కేటుగాళ్లు మరింత ప్రావీణ్యం సాధిస్తున్నారని, బ్యాంకుల పేర్లు చెప్పుకుంటూ లేదా డిజిటల్ అరెస్టుల పేరిట అమాయకుల నుండి లక్షల రూపాయలు దోచుకుంటున్నారని చెబుతూ సోషల్ మీడియా వేదికగా కొన్ని సూచనలిచ్చింది SBI. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డీప్ ఫేక్ వీడియోలు, వాయిస్ క్లోనింగ్, సోషల్ మీడియా యాప్స్ ద్వారా ప్రజలను మోసం చేయడం క్రమంగా ఆందోళనకర స్థాయికి చేరుకోవడం చూస్తున్నాం. ఈ మోసాలకు ప్రముఖులు సైతం బలవుతున్నారు. సచిన్ తెందూల్కర్, విరాట్ కోహ్లీ, అమితాబ్ బచ్చన్, రష్మిక వంటి సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ డీప్ ఫేక్ వీడియోల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు.

 

ఇంకా చదవండి: బ్యాంక్ లోన్ చెల్లించలేకపోతున్న వారికి భారీ శుభవార్త! ఇదొక్కటి చేస్తే చాలు!

 

ఎస్బీఐ వినియోగదారులకు హెచ్చరిక: తాజాగా, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) బ్యాంకు అధికారుల పేర్లతో వస్తున్న నకిలీ ప్రకటనలపై స్పందించింది. బ్యాంకు ఇన్వెస్ట్మెంట్ పథకాలు, పెద్ద మొత్తంలో రాబడులు అని చెబుతూ రూపొందించిన డీప్ ఫేక్ వీడియోలపై వినియోగదారులను అప్రమత్తం చేసింది. ఎస్బీఐ తన అధికారిక 'ఎక్స్' హ్యాండిల్ ద్వారా ప్రకటిస్తూ.. "SBI భారీ లాభాలంటూ వచ్చే వీడియోలు పూర్తిగా నకిలీవి. ఎస్బీఐ ఎప్పుడూ ఇలాంటి వాగ్దానాలు చేయదు. బ్యాంకు మేనేజ్‌మెంట్ పేరుతో వస్తున్న స్కీములు, డీప్ ఫేక్ వీడియోలను విశ్వసించకండి. ఇలాంటి వాటి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండి" అని తెలిపింది. వినియోగదారులకు ఎస్బీఐ సూచనలు: డీప్ ఫేక్ వీడియోల ద్వారా అందించే వాగ్దానాలను నమ్మొద్దు, బ్యాంకు అధికారిక ప్రకటనలకే అనుసరిస్తూ చర్యలు తీసుకోండి. అనుమానాస్పద సమాచారం లేదా వీడియోలు కనిపిస్తే, వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించండి. తద్వారా, డిజిటల్ మోసాల ప్రభావం నుంచి తప్పించుకోగలరు.

 

ఇంకా చదవండి: తిరుమల భక్తులకు శుభవార్త! గంటలోనే శ్రీవారి దర్శనం - అమల్లోకి టీటీడీ కొత్త విధానం!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పీఆర్, పర్సనల్ మేనేజర్ ను తొలగించిన చిరంజీవి! దీనిపై ఆరా తీయగా..

 

ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు!

 

ఏపీకి తీపికబురు చెప్పిన కేంద్రం.. పవన్ శాఖకు బిగ్ బూస్ట్! ఇక వారికి పండగే పండగ - రెండు విడతలుగా నిధులు విడుదల!

 

అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!

 

నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

ఏపీఎస్డీఎంఏ: రెండ్రోజుల పాటు వర్షాలు! బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో..

 

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో మలుపు! ఏ18గా మైత్రీ మూవీస్... నిందితుల జాబితా ఇదే!

 

రెండు సిమ్ కార్డులు వాడుతున్నారా? ఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు! కీలక ఆదేశాలు - అది ఏమిటంటే!

 

విమానం టికెట్ ఇంత తక్కువకా.. ఇండిగో బంపర్ ఆఫర్! ఎయిర్‌లైన్ సూచనలు ఇవే!

 

రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. నెలకు రూ.3 లక్షల 20 వేల జీతంతో జాబ్, అర్హతలు ఇవే! వారికి జర్మనీ దేశంలో..

 

నేడు (24/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు! పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన!

 

బీసీ సంక్షేమానికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు! ప్రత్యేక రక్షణ చట్టంపై...!

 

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కారు! ఇకపై ఆ తరగతుల విద్యార్థులు మస్ట్​గా పాస్​ కావాల్సిందే - లేదంటే!

 

బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారా? జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #SBI #Bank #India