ప్రభుత్వ ఆఫీస్‌ల చుట్టూ తిరగక్కర్లేదు, ఇకపై ఈజీగా.. వాటిపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఇక వారికి పండగే!

Header Banner

ప్రభుత్వ ఆఫీస్‌ల చుట్టూ తిరగక్కర్లేదు, ఇకపై ఈజీగా.. వాటిపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఇక వారికి పండగే!

  Fri Jan 10, 2025 16:20        Politics

భ‌వ‌న నిర్మాణాలు, లేఅవుట్ల అనుమ‌తుల‌కు సంబంధించి నిబంధనలను సుల‌భ‌త‌రం చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బిల్డింగ్ రూల్స్ -2017, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ - 2017లో సవరణలు చేస్తూ వేర్వేరుగా ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా భవన, లే అవుట్ల అనుమతుల్లో మార్పులు తీసుకువచ్చామని అన్నారు. ఏపీలో రియ‌ల్ ఎస్టేట్ రంగం పెరిగేలా కీల‌క సంస్కర‌ణ‌లతో ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి నారాయణ తెలిపారు. సంక్రాంతి కానుక‌గా బిల్డర్లు, డెవ‌ల‌ప‌ర్లు, ప్రజ‌ల‌కు అనుకూలంగా ఉండేలా నిబంధ‌న‌ల్లో మార్పులు చేస్తూ జీవోలు జారీ చేశామని అన్నారు. లే అవుట్లలో రోడ్లకు గ‌తంలో ఉన్న12 మీటర్లకు బ‌దులు 9 మీట‌ర్లకు కుదిస్తూ స‌వ‌ర‌ణ‌ చేశామని చెప్పారు.

 

ఇంకా చదవండి: రఘురామ కేసులో ప్రభావతికి షాకిచ్చిన హైకోర్టు! వాళ్లు ముగ్గురు కూడా..

 

500 చ‌.మీ. పైబ‌డిన స్థలాలు, నిర్మాణాల్లో సెల్లారుకు అనుమ‌తి ఇస్తూ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. టీడీఆర్ బాండ్ల జారీ క‌మిటీలో రెవెన్యూ, స‌బ్ రిజిస్ట్రార్‌లు తొల‌గిస్తూ జీవో జారీ చేశామని తెలిపారు. రాష్ట్ర, జాతీయ ర‌హ‌దారిని ఆనుకుని ఉన్న స్థలాలు డెవ‌ల‌ప్ చేసేందుకు 12 మీ.స‌ర్వీస్ రోడ్డు ఏర్పాటు నిబంధ‌న తొల‌గించినట్లు చెప్పారు. బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాల సెట్ బ్యాక్ నిబంధ‌న‌ల్లో మార్పులు చేశామన్నారు. వీటితో పాటు మరిన్ని నిబంధనలు సులభం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని అన్నారు. రియల్ ఎస్టేట్ అసోసియేషన్‌ల ప్రతినిధులతో చర్చించి తుది నిబంధనలు జారీ చేసినట్లు వివరించారు. తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకోనుందని మంత్రి నారాయణ ప్రకటించారు.

 

ఇంకా చదవండి: ఏపీ ప్రభుత్వం తీపికబురు.. అమరావతి పరిధిలోని 9 గ్రామాలు.. వారికి అకౌంట్‌లలో డబ్బులు జమ! మొత్తం 20 ఇంజనీరింగ్ పనులు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... హెల్త్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల! ఎగ్జామ్ లేకుండా ఎంపిక!

 

తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా.. మంత్రి కీలక వ్యాఖ్యలు! కారకులు ఏ స్థాయిలో..

 

రఘురామ కృష్ణంరాజు పై టార్చర్ కేసులో సంచలనం! కీలక నిందితుడు అరెస్ట్!

 

పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం మాయం కేసులో సంచలనం! కోర్టులో పోలీసుల కీలక పిటిషన్!

 

కొనసాగుతున్న పెన్షన్ల వేరిఫికేషన్... ఆ తర్వాతే తొలగింపు! వేలాది మందిపై కీలక దర్యాప్తు!

 

విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలు, సూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

 

అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!

 

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వం, చంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews