ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారికి రూ.15000! ఉత్తర్వులు జారీ!

Header Banner

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారికి రూ.15000! ఉత్తర్వులు జారీ!

  Wed Jan 29, 2025 07:00        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీసుల్లో ఉంటూ చనిపోయిన అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు తగిన గౌరవం ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా విధుల్లో ఉంటూ మరణించిన అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల అంత్యక్రియలకు ఇచ్చే రూ.15000 కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలుగా పనిచేస్తూ సర్వీస్ కాలంలో చనిపోయిన వారి అంత్యక్రియల కోసం రూ.15000 మంజూరు చేస్తూ వస్తున్నారు. ఈ పథకాన్ని పొడిగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీలు, పిల్లలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్ల శాఖ కార్యదర్శి సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. చనిపోయిన అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు చెందిన వారసులకు ఈ మొత్తాన్ని అందించాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవుల భర్తీకి కూటమి ప్రభుత్వం కీలక చర్యలు! ఇవాళ రెపట్లో జాబితా విడుదల!

 

మరోవైపు పదో తరగతి అర్హతతో అంగన్‌వాడీ కేంద్రాలలో కార్యకర్తలను ప్రభుత్వం నియమిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంరక్షణ, పోషణ చర్యలు తీసుకుంటున్నారు. గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజనంతో పాటుగా రెండున్నరేళ్ల నుంచి ఐదేళ్లలోపు ఉన్న చిన్నారులకు మధ్యాహ్న భోజనం, ఆటపాటలు, ప్రీప్రైమరీ విద్యను బోధిస్తున్నారు. ఆ రకంగా మాతా శిశుసంరక్షణలో అంగన్వాడీలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సర్వీసులో చనిపోయిన అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు తగిన రీతిలో గౌరవించుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాంటి వారి కుటుంబాలకు అంత్యక్రియల కోసం 15000 రూపాయలు మంజూరు చేసే పథకాన్ని పొడిగించాలని నిర్ణయించింది. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా సుమారుగా 55 వేలకుపైగా అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఆరోగ్య, పోషకాహార సేవలు అందిస్తున్నారు. అయితే అంగన్వాడీ కార్యకర్తలను పలు సమస్యలు వేధిస్తున్నాయి. తమ సమస్యలపై అంగన్‌వాడీలు ఇప్పటికే పలు దఫాలుగా రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్‌లోనూ జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేశారు. అయితే అంగన్వాడీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్తున్న ఏపీ ప్రభుత్వం.. దశల వారీగా పరిష్కరిస్తామని చెప్తోంది. ఈ క్రమంలోనే అంగన్వాడీ సిబ్బందికి గ్రాట్యుటీ కూడా చెల్లించే విషయాన్ని ఆలోచిస్తున్నట్లు అప్పట్లో మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!

 

తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు!

 

డ్వాక్రా మహిళల కోసం సర్కార్ భారీ ప్రణాళిక! లక్షల కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ సౌకర్యం!

 

దిమ్మతిరిగే ఆఫర్.. రూ.15 వేల స్మార్ట్‌ఫోన్ ఎంత తక్కువకి వస్తుందో.. లక్కీ ఛాన్స్ గురు..

 

షాక్ షాక్ షాక్... జగన్ గూబగుయ్యుమనిపించిన నంబర్ టునంబర్ త్రీ! రాజకీయాల నుంచి అవుట్!

 

శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! ఫిబ్రవరి 1న కొత్త పథకం ప్రారంభం!

 

కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ పురస్కారాలు.. ఆ వివరాలు మీకోసం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP