అన్న క్యాంటీన్లపై సర్కార్ సంచలన నిర్ణయం! వారికి ఇకపై ఫుడ్ పెట్టరు!
Wed Jan 29, 2025 08:17 Politicsఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా వీటి విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 199 అన్న క్యాంటీన్లను ప్రారంభించి, పేదలకు తక్కువ ధరలో రుచికరమైన ఆహారాన్ని అందిస్తోంది. ప్రతిరోజూ వేలాది మంది ఈ క్యాంటీన్ల సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఒక అన్న క్యాంటీన్‌లో తాజాగా ఓ ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని కొత్తపట్నం రోడ్డు కూడలిలో ఉన్న అన్న క్యాంటీన్‌లో ఒక బోర్డును ఏర్పాటు చేశారు. బోర్డుపై స్పష్టంగా "మందు తాగి వచ్చేవారికి టోకెన్ ఇవ్వబడదు" అని రాసి ఉంది. అసలు విషయం ఏంటంటే, ఈ క్యాంటీన్‌కు ఎక్కువగా కూలి కార్మికులు భోజనం చేయడానికి వస్తుంటారు. అయితే, కొందరు మద్యం సేవించి క్యాంటీన్‌కు వచ్చి సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. ఇటీవలి కొన్ని సంఘటనల తర్వాత, క్యాంటీన్ సిబ్బంది ఈ కీలక నిర్ణయం తీసుకుని బోర్డును ఏర్పాటు చేశారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి కూటమి ప్రభుత్వం కీలక చర్యలు! ఇవాళ రెపట్లో జాబితా విడుదల!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేస్తూ కొత్తగా 63 అన్న క్యాంటీన్‌లను ప్రారంభించడానికి నిర్ణయం తీసుకుంది. ఈ క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజూ 50,000 మందికి పైగా పేదలకు మూడు పూటలా ఆహారం అందించనున్నారు. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించగా, ఈ నెలాఖరులో కొత్త క్యాంటీన్ల స్థాపనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే మూడు నెలల్లో టెండర్లు పిలిచి పనులను ప్రారంభించనున్నారు.
2014-2019 కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం పేదల ఆకలిని తీర్చేందుకు ఈ అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. అయితే, తర్వాతి ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు మూతబడిన ఈ క్యాంటీన్లు, 2024 ఆగస్టు 15న కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 199 అన్న క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. ఆహారం అందించడంలో ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు పేదలకు పెద్ద ఊరటగా మారుతున్నాయి. ఇకపై ఈ కొత్త క్యాంటీన్లు ప్రారంభం అయిన తర్వాత మరింత మందికి ఈ సేవలు అందే అవకాశముంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!
తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు!
డ్వాక్రా మహిళల కోసం సర్కార్ భారీ ప్రణాళిక! లక్షల కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ సౌకర్యం!
దిమ్మతిరిగే ఆఫర్.. రూ.15 వేల స్మార్ట్‌ఫోన్ ఎంత తక్కువకి వస్తుందో.. లక్కీ ఛాన్స్ గురు..
షాక్ షాక్ షాక్... జగన్ గూబగుయ్యుమనిపించిన నంబర్ టు, నంబర్ త్రీ! రాజకీయాల నుంచి అవుట్!
శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! ఫిబ్రవరి 1న కొత్త పథకం ప్రారంభం!
కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ పురస్కారాలు.. ఆ వివరాలు మీకోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.