బ్యాంక్ లోన్ చెల్లించలేకపోతున్న వారికి భారీ శుభవార్త! ఇదొక్కటి చేస్తే చాలు!

Header Banner

బ్యాంక్ లోన్ చెల్లించలేకపోతున్న వారికి భారీ శుభవార్త! ఇదొక్కటి చేస్తే చాలు!

  Wed Dec 25, 2024 19:14        Business

బ్యాంకుల వ‌ద్ద లోన్ తీసుకుని, ఆర్థిక ప‌రిస్థితుల కార‌ణంగా తిరిగి చెల్లించ‌లేని వారు లోన్ సెటిల్‌మెంట్ చేసుకుందామ‌ని అనుకుంటారు. ఐతే, సెటిల్‌మెంట్ స‌మ‌యంలో కొన్ని కీల‌క‌మైన విష‌యాల‌ను ప‌ట్టించుకోరు. ఎలాంటి జాగ్ర‌త్తలు తీసుకోవాలో తెలుసుకోవడానికి మ‌రింత చ‌ద‌వండి. జీవితంలో ప్ర‌తిఒక్క‌రికి ఆర్థిక అవ‌స‌రాలు ఉండ‌డం స‌హ‌జం. 

 

ఇందుకోసం ప్రైవేట్ వ్య‌క్తుల వ‌ద్ద‌నో.. లేదా బ్యాంకులో లోన్ తీసుకుంటారు. వీరిలో కొంద‌రు బ్యాంకుల వద్ద లోన్ తీసుకుని, ఆ మొత్తాన్ని స‌కాలంలో చెల్లించ‌లేక‌పోతారు. ఇలాంటి ప‌రిస్థితిలో లోన్ సెటిల్‌మెంట్ ఆప్ష‌న్‌ ఎంచుకుంటారు. ఐతే, ఈ లోన్ సెటిల్‌మెంట్ ఆప్షన్ ద్వారా అటు లాభాలతో పాటు తీవ్ర న‌ష్టాలు కూడా ఉన్నాయి. 

 

ప‌ర్స‌న‌ల్‌ లోన్ సెటిల్‌మెంట్ అంటే.. ప‌ర్స‌న‌ల్ లోన్ అంటే మ‌నంద‌రికీ తెలుసు. బ్యాంకులు, ఇత‌ర ఆర్థిక సంస్థ‌లు వ్య‌క్తి ఆదాయం, సిబిల్ స్కోర్‌ను బ‌ట్టి అర్హ‌త మేర‌కు లోన్ కేటాయిస్తారు. ఐతే, బ్యాంకుల వ‌ద్ద నుంచి తీసుకున్న రుణాల‌ను తిరిగి చెల్లించక‌పోతే లోన్ సెటిల్‌మెంట్ ఆప్ష‌న్ ఎంచుకునే అవ‌కాశం ల‌భిస్తుంది. అంటే అప్పు పూర్తిగా చెల్లించక‌పోయినా.. క‌ట్టాల్సిన‌ మొత్తంలో కొంత శాతాన్ని త‌గ్గించి, మిగ‌తా డ‌బ్బును క‌ట్టుకునే అవ‌కాశం ఉంటుంది. 

 

ఇంకా చదవండిఅమెరికాలో మరో ఘోర ప్రమాదం! ఊహించని విధంగా తెలుగు విద్యార్ధి మృతి! ఇలా కూడా జరుగుతుందా అనే రీతిలో! మరో ఇద్దరు క్షేమం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

లోన్ సెటిల్‌మెంట్ ఎలా పని చేస్తుంది..
మొద‌ట మీ ఆర్థిక ప‌రిస్థితి గురించి ఒక అవ‌గాహ‌న తెచ్చుకుని, ఎంత‌ అప్పు చెల్లించ‌గ‌ల‌రో నిర్దారించుకోవాలి. ఆ త‌ర్వాత అప్పు తీసుకున్న‌ బ్యాంకును సంప్ర‌దించి, మీ ఆర్థిక ప‌రిస్థితి గురించి వివ‌రించాలి. 

 

మీ అప్పు ఎంత‌, ప్ర‌స్తుతం ఎంత‌మేర‌కు క‌ట్ట‌గ‌ల‌రు త‌దిత‌ర విష‌యాల‌పై చ‌ర్చించాలి. ముఖ్యంగా, ఈ లోన్ క్లోజ్ చేయ‌డం వల్ల భ‌విష్య‌త్తులో ఏమైనా స‌మ‌స్య‌లు వ‌స్తాయా అనే అంశంపై పూర్తిగా అవ‌గాహ‌న తెచ్చుకోవాలి. 

 

ఒప్పంద ప‌త్రాన్ని పూర్తిగా చ‌దివి, అర్థం చేసుకున్న త‌ర్వాత ఇద్ద‌రి త‌ర‌పున సంత‌కాలు చేసుకోవాలి. సెటిల్‌మెంట్ నిబంధనలకు అంగీకరించిన మొత్తాలను పూర్తిగా లేదా కాలక్రమేణా వాయిదాల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. 

 

లోన్ సెటిల్‌మెంట్‌తో లాభాలతో పాటు న‌ష్టాలు..
లోన్ తీసుకుని ఒక‌వేళ తిరిగి క‌ట్ట‌లేక‌పోతే ఈ ప‌ద్ధ‌తిలో పూర్తి రుణం కంటే కొంత తక్కువ డబ్బు క‌ట్టుకునే వెస‌లుబాటు ఉంటుంది. లోన్ సెటిల్‌మెంట్ ఆప్ష‌న్ ఎంచుకుంటే మీకు క‌ట్టాల్సిన లోన్ డ‌బ్బు త‌గ్గుదుందేమో గాని.. వ్య‌క్తిగ‌తంగా ప‌లు అంశాలపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. ఇలా చేసిన వారికి సిబిల్ స్కోర్ త‌గ్గిపోతుంద‌నట‌. అంతేకాదు, క్రెడిట్ కార్డుల‌తో పాటు, భ‌విష్య‌త్తులో మ‌న‌కు లోన్లు రావ‌డం కూడా క‌ష్ట‌మ‌వుతోంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

ఏపీఎస్డీఎంఏ: రెండ్రోజుల పాటు వర్షాలు! బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో..

 

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో మలుపు! ఏ18గా మైత్రీ మూవీస్... నిందితుల జాబితా ఇదే!

 

రెండు సిమ్ కార్డులు వాడుతున్నారాఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు! కీలక ఆదేశాలు - అది ఏమిటంటే!

 

విమానం టికెట్ ఇంత తక్కువకా.. ఇండిగో బంపర్ ఆఫర్! ఎయిర్‌లైన్ సూచనలు ఇవే!

 

రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. నెలకు రూ.లక్షల 20 వేల జీతంతో జాబ్అర్హతలు ఇవే! వారికి జర్మనీ దేశంలో.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Business #Loans #PersonalLoan #Interest