యాత్రా తరంగిణి 5: ప్రతి దేవాలయం ఎందుకు అలా ఉంటుంది? సైన్స్ దాగుందా?

Header Banner

యాత్రా తరంగిణి 5: ప్రతి దేవాలయం ఎందుకు అలా ఉంటుంది? సైన్స్ దాగుందా?

  Wed Jan 03, 2024 11:00        Devotional, యాత్రా తరంగిణి

దేవాలయ వాస్తు | కాపెర్ల పవన్ కుమార్


దేవాలయాలను మనం రెండువర్గాలుగా విభజించుకోవచ్చు.

1. గ్రామదేవతాలయలు
2. శిష్టదేవతాలయాలు.

మొదటివర్గం గ్రామరక్షణ కోసం తరతరాలుగా గ్రామసంస్కృతిలో నిలద్రొక్కుకున్న ఎల్లమ్మ, మారమ్మ, పోచమ్మ, మైసమ్మ మొదలైన దేవతల చిన్న చిన్న గుడులు. గ్రామదేవతలలో అధికం స్త్రీ మూర్తులే. ఒక విధంగా వీరు శక్తిదేవతలు. ఈ దేవలయాల్లో చెప్పుకోదగ్గ వాస్తుశిల్పం కనపడదు. ఆలయాలు సాధారణంగా ఉంటాయి.

ఇక రెండవవర్గం బ్రహ్మ, విష్ణు, శివ, విఘ్నేశ్వర మొదలైన శిష్టదేవతలు లేక నాగరిక దేవతల ఆలయాలు, ఈ ఆలయాలలో సామన్యంగా బ్రాహ్మణులు పూజాదికాలు నిర్వహిస్తూ ఉంటారు. అగమాలలో చెప్పిన రీతిగా ఈ దేవతలకు షోడశోపచారాలు, చతుష్పష్టి ఉపచారాలు జరుగుతాయి.
శిష్ట దేవాలయాలు వాస్తు శాస్త్రానుగుణంగా నిర్మించబడ్డాయి. గృహ, గ్రామ, నగర, దేవాయతన, ప్రాసాద, దుర్గ, ఆరామ, తటాక, సేతుబంధ ఇత్యాది నిర్మాణ లక్షణాలను తెలిపే శిల్ప శాస్త్రమే వాస్తుశాస్త్రం. ఈ వాస్తు సంప్రదాయం ఆగమాల మీద ఆధార పడింది, ఆగమాలలో దేవాలయ నిర్మాణం, ఉత్సవాలు పేర్కొనబడ్డాయి. కామిక, కారణ ఆగమాలలో నియమ నిబంధనలు చెప్పబడ్డాయి.

వాస్తుశాస్త్రం త్రిమూర్తుల నుండి ఇంద్ర, బృహస్పతి, నారదులకు అనుగ్రహింపబడిందనీ, వాళ్ళ ద్వారా అనేక ఋషులకు సంక్రమించిదని అంటారు. పురాతన పట్టణాలు, కట్టడాలు వాస్తు శాస్త్రానుగుణంగా నిర్మింప బడుతుండేవి. వేదకాలంలో యజ్ఞాలకోసం శాలలను, వేదికలను, ఇటుక, కొయ్య, వెదురులతో నిర్మించేవారు. ఇవన్నీ శిల్పసూత్రాన్ని అనుసరించే నిర్మింపబడుతుండెవి. అవే భారతఖండ వాస్తువిద్యకు మూలరూపాలని కొంతమంది అభిప్రాయం. ఆర్యులు ఆర్యావర్తం ప్రవేశించడానికి ముందే మన దేశంలో నెలకొన్న ద్రావిడులు అనేక శతాబ్దాలుగా తమదే అయిన ఒక సంస్కృతిని పెంపొందించుకొంటూ వచ్చారనీ, ఆర్యులు వాళ్ళనుంచి వాస్తువిద్యను నేర్చుకొన్నారనీ కొంతమంది అభిప్రాయం. మొదట్లో వెదురుచే నిర్మింపబడి, అనంతరం కొయ్యలతో కట్టడాలు నిర్మింపబడి ఉండవచ్చు. ఆ తర్వాత మన్ను, ఇటుకలతో నిర్మింపబడి క్రీ.శ 4వ శతాబ్ది తర్వాత విడివిడి రాళ్ళతో గృహాలు, దేవాలయాల నిర్మాణం మొదలైంది. ఇటుకలు, రాళ్ల పురాతన కట్టడ అవశేషాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. వాస్తుకళ క్రమేపి ఏ విధంగా వృద్ధి చెందిందో ఇవి చూపెడతాయి.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న  క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

వాస్తు శైలి దృష్టిచే ద్రావిడ వాస్తురీతి వికాసాన్ని ఐదు కాలాలుగా విభజించడం జరిగింది.

1. పల్లవుల కాలం క్రీ.శ. 600-900
2. చోళుల కాలం క్రీ.శ. 900-1150
3. పాండ్యుల కాలం క్రీ.శ. 1150-1350
4. విజయనగర కాలం క్రీ.శ.1350-1565
5. ఆధునిక కాలం క్రీ.శ. 1600 – (నాయక)

 

ఈ ప్రధాన రాజవంశాలు దక్షిణ దేవాలయ వాస్తు పరిణామానికి తోడ్పడ్దాయి.
భారతదేశంలోని దేవాలయాలను, వాటి రచనా శైలికి అనుగుణంగా మూడు విధాలుగా వర్గీకరించారు.

1. నాగర శైలి : గర్భగుడి మీదున్న గోపురం ఎత్తుగా వక్రరేఖాకృతిలో ఉన్న “నాగర” శైలిలో ఉంటుంది. ఇటువంటి దేవాలయాలు క్రింద నుండి శిఖరం దాకా చతురస్రాకారంలో ఉంటాయి. ఇలాంటివి ఉత్తర భారదేశంలోని దేవాలయాల్లో గమనించవచ్చు.
2. ద్రావిడ శైలి : గర్భగుడి పైన గోపురం భిన్నాగ్ర పిరమిడ్ లో ఉంటుంది. ఈ లక్షణం పల్లవులు, చోళులకు చెందిన దక్షిణ భారత దేవాలయాల్లో కనిపిస్తుంది.
3. వేసర శైలి : ఈ శైలి లో ఉత్తర హిందూ దేవాలయాలు ఎక్కువగా కనిపిస్తాయి. వాస్తు సంప్రదాయంలోని ఆలయాలు లంబప్రవృద్ధి దేవాలయాలు, ఆలయ శిఖరాలు చాల ఎత్తులో నిర్మింపబడి ఉంటాయి.

 

దక్షిణ హిందూ దేవాలయ వాస్తు సంప్రదాయంలోని ఆలయాలు ప్రస్తవిస్తరణ దేవాలయాలు. వీటినే ద్రావిడ పద్ధతికి చైందిన దేవాలయాలుగా పరిగణిస్తున్నాము. ఈ పద్ధతికి చైందిన ఆలయాలలో విస్తీర్ణం ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి ఉదాహరణలుగా శ్రీకాళహస్తి, మధుర దేవాలయాలను తీసుకోవచ్చు. సహస్ర స్తంభ మండపాలు, అనేక ప్రాకారాలు, దాదాపు 200 అడుగుల ఎత్తుండే గోపురాలు, 15-20 ఎకరాల విస్తీర్ణం ఆక్రమించిన అంగణాలు, విశాల కల్యాణ మంటపాలు మొదలగునవి ఈ ఆలయ లక్షణాలుగా కనిపిస్తాయి.

ఆంధ్రదేశంలో చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజ వంశాలవారు దేవాలయ నిర్మాణానికి విశేష కృషి చేశారు. వాస్తుశిల్పం, దేవాలయ నిర్మాణం వీరి కృషికి నిదర్శనం. అవి నేటికీ చెక్కు చెదరక నిలిచి ఉన్నాయి.

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 

 

యాత్రా తరంగిణి - దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి? దర్శనం చేసుకునే సమయం లో చేయవలసినది ఏమిటి? ప్రముఖ దేవాలయాల ప్రాముఖ్యత, విశిష్టత, విశేషాలు... వారం వారం మీకోసం...

 

యాత్రా తరంగిణి 4: దేవాలయాల నిర్మాణం వెనుక ఉన్న అసలు కారణం

 

యాత్ర తరంగణి 3: దేవాలయం లోపల పాటించవలసిన కనీస నియమ నిబంధనలు

 

యాత్ర తరంగణి 2: దేవాలయాలు ఎన్ని రకాలు, వాటి నిర్మాణాలు ఎలా ఉంటాయి, ఉపయోగాలు ఏమిటి...

 

యాత్రా తరంగిణి 1 -గుడి లో సాష్టాంగ నమస్కారం, ప్రదక్షిణం తప్పనిసరా...

 


   #andhrapravasi #YatraTarangini #Devotional #TemplesOfIndia #IndianTemples #TruthBehindTemples #TypesOfTemples #TempleConstruction #TempleVisits #HolyTemples #Spirtuality