పెళ్లి పేరుతో మోసం.. నాగార్జున దగ్గర 18 లక్షలు తీసుకొని..

Header Banner

పెళ్లి పేరుతో మోసం.. నాగార్జున దగ్గర 18 లక్షలు తీసుకొని..

  Sat Feb 10, 2024 10:00        Entertainment

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ మహిళా నిర్మాత ఓ కెమెరామెన్ ను మోసం చేసింది. దీంతో సదరు కెమెరామెన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీసుల వివరాల ప్రకారం హైదరాబాద్ నగరంలోని వెంకటగిరిలో నివసించే పుల్లంశెట్టి నాగార్జునబాబు తెలుగు సినీ పరిశ్రమలో కెమెరా అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ఒక సినిమాకు పనిచేసే సమయంలో నిర్మాత మల్లికతో పరిచయం అయింది. తనకు వివాహమైందని, భర్తకు విడాకులిచ్చేస్తున్నట్లు నాగార్జునకు తెలిపింది. తర్వాత వారిద్దరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఆ కెమెరామెన్ చిలుకూలరు బాలాజీ దేవాలయంలో ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తనకు డబ్బు అవసరమైందంటూ నాగార్జున దగ్గర మల్లిక రూ.18.50 లక్షలు తీసుకుంది.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

తర్వాత ఆ డబ్బుల గురించి అడుగుతుండటంతో బెదిరింపులకు దిగింది. దీనిపై నాగార్జునబాబు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఆరా తీశారు. ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగిన నాగార్జున కూడా విచారణకు దిగాడు. అప్పటికే ఆమెకు రెండు పెళ్లిళ్లు అయ్యాయని, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నట్లు తేలింది. తనకు ఒక వివాహమే అయిందని, పిల్లలు కూడా లేరని అబద్దం చెప్పి పెళ్లిచేసుకుందంటూ నాగార్జునబాబు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 2016లో గాజువాక పోలీస్ స్టేషన్లో, 2019లో కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఇలాగే ఫిర్యాదులు అందినట్లు తేలింది. నకిలీ గుర్తింపు కార్డులను చూపిస్తూ తిరుగుతుందని పోలీసులు తేల్చారు. నాగార్జున దగ్గర నుంచి తీసుకున్న రూ.18.50 లక్షలను ఏం చేసింది? ఏ సందర్భంలో వాటిని ఉపయోగించింది? అందుకు వాడిన బ్యాంకు ఖాతాల కోసం పోలీసులు మరింత లోతుగా పరిశోధన చేస్తున్నారు.

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Nagarjuna #Marriage #FraudMarriage #FraudWomenToMarriagenagajuna #TollywoodWorker