ఆ ప్రాంతాలలో 24 గంటల్లో భారీ వర్షాల హెచ్చరిక! సముద్ర గాలులతో తుపాను దిశగా మారుతున్న వాయుగుండం!

Header Banner

ఆ ప్రాంతాలలో 24 గంటల్లో భారీ వర్షాల హెచ్చరిక! సముద్ర గాలులతో తుపాను దిశగా మారుతున్న వాయుగుండం!

  Tue Nov 26, 2024 19:25        Others

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. గంటలకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తోంది. ట్రింకోమలికి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకు 800 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇది.. ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ బలపడి రేపటికి తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. రెండ్రోజుల్లో శ్రీలంక తీరాన్ని తాకుతూ తమిళనాడు వైపు ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఈ ప్రభావంతో 5 రోజుల్లో రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. రానున్న 24 గంటల్లో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో, రానున్న 48 గంటల్లో అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో, ఈనెల 30 నుంచి ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 కి. మీ వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో అధికారులు ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

మాజీ సీఎం జగన్ కు కేంద్రం ఊహించని షాక్! అసలు ఏం జరిగిందంటే!

 

అమెరికా జైలుకి జగన్ - జీవితాంతం ఏపీకి తిరిగిరాడు! నీకు ఇప్పుడు దమ్ము ఉంటే..?

 

26/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

సుప్రీంకోర్టులో విజయపాల్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఈ కేసులో ఇప్పటికే!

 

ట్రంప్ రాక ముందే వచ్చేయండి! విదేశీ విద్యార్థులకు అమెరికా వర్సిటీలు అలర్ట్!

 

అకౌంట్లోకి రూ.2.5 లక్షలు - ఈ పథకం ద్వారా పేదలకు వరం! మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!

 

ఏపీకి వస్తున్న మోదీ - అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి! 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #rainallert #heavyrains #nellore #thirupathi #chittore #todaynews #flashnews #latestupdate