మీరు తీసుకునే పర్సనల్ లోన్లపై వడ్డీ ఎక్కువ పడుతుందా.. అతి తక్కువ వడ్డీతో టాప్ 10 బ్యాంకుల లిస్ట్ మీ కోసం..

Header Banner

మీరు తీసుకునే పర్సనల్ లోన్లపై వడ్డీ ఎక్కువ పడుతుందా.. అతి తక్కువ వడ్డీతో టాప్ 10 బ్యాంకుల లిస్ట్ మీ కోసం..

  Sat Feb 10, 2024 11:00        Business, Others

బ్యాంకులు ఖాతాదారులకు వివిధ రకాల లోన్లు ఇచ్చి, వాటిపై వడ్డీని వసూలు చేస్తుంటాయి. తద్వారా లాభాలను ఆర్జిస్తుంటాయి. ఇలాంటి వాటిలో పర్సనల్ లోన్లు (Personal Loans) ప్రధానమైనవి. దాదాపు అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తక్కువ ప్రాసెసింగ్‌తో, వేగంగా ఈ రుణాలను ఇస్తుంటాయి. సాధారణంగా వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయితే కొన్ని బ్యాంకులు మాత్రం తక్కువ వడ్డీతోనే ఈ లోన్లు అందిస్తున్నాయి. ప్రస్తుతం పర్సనల్ లోన్ల(Personal Loan)పై తక్కువ వడ్డీ విధిస్తున్న టాప్-10 బ్యాంకులు ఏవో చూద్దాం... పర్సనల్ లోన్లు తీసుకునే ముందు ఖాతాదారులు మార్కెట్ రిసెర్చ్(Market Research) చేయాలి.

 

తక్కువ వడ్డీ విధిస్తున్న బ్యాంకునే ఎంచుకోవాలి. అలాగే మంచి క్రెడిట్ స్కోర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాంకుల్లో పాత బకాయిలు, పేమెంట్లు ఏవైనా ఉంటే గడువులోగా క్లియర్ చేయాలి. ఈ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ... పర్సనల్ లోన్ల(Personal Loan)పై HDFC బ్యాంక్ అత్యంత తక్కువ వడ్డీ విధిస్తోంది. ఈ సంస్థలో వ్యక్తిగత రుణాలపై 10.75% నుంచి 24% వరకు వడ్డీ రేట్లు ఉన్నాయి. ICICI బ్యాంక్ ఈ లోన్లపై 10.65% నుంచి 16% వడ్డీ వసూలు చేస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) పర్సనల్ లోన్ రేట్లు 11.15% నుంచి 11.90% వరకు ఉన్నాయి.కోటక్ మహీంద్రా బ్యాంకు పర్సనల్ లోన్లపై 10.99% వడ్డీ వసూలు చేస్తోంది. యాక్సిస్ బ్యాంక్ ఇవే లోన్లపై 10.65% నుంచి 22% వడ్డీ విధిస్తోంది.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇండస్ఇండ్ బ్యాంక్ వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు 10.25% నుంచి 26% వరకు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఈ లోన్లపై 11.40% నుంచి 18.75% ఇంట్రస్ట్ రేట్ ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 11.40% నుంచి 12.75%; యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 11.35% నుంచి 15.45%; IDBI బ్యాంక్ 10.50% నుంచి 13.25% వడ్డీ వసూలు చేస్తున్నాయి.తక్కువ వడ్డీ పొందే మార్గాలు బ్యాంకులు అన్ని రకాల లోన్లకు క్రెడిట్ స్కోరును ప్రామాణికంగా తీసుకుంటాయి. లోన్లు, పేమెంట్లు సక్రమంగా చెల్లించే వారి క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటుంది. వీరికి బ్యాంకులు తక్కువ వడ్డీతో లోన్లు ఇస్తాయి. పర్సనల్ లోన్లకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.ముఖ్యంగా 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి బ్యాంకులు పెద్ద మొత్తం లోన్లను అతి తక్కువ వడ్డీకే అందించే అవకాశం ఉంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పండుగలు, ప్రత్యేక సమయాల్లో స్పెషల్ ఆఫర్లను ప్రకటిస్తాయి. ఆ సమయంలో లోన్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తాయి.

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #BankLoan #PersonalLoan #marketResearch #HDFCBank #ICICIBank #SBIBank #LowinterestPersonalLoan