2024 జులై 31 తర్వాత ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలంటే ఆలస్య రుసుము కట్టాలి! ఫామ్‌-16 అంటే ఏంటి! మీకోసం

Header Banner

2024 జులై 31 తర్వాత ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలంటే ఆలస్య రుసుము కట్టాలి! ఫామ్‌-16 అంటే ఏంటి! మీకోసం

  Mon Feb 19, 2024 14:11        Employment

Income Tax Return Filing: 2023-24 ఆర్థిక సంవత్సరం లేదా 2024-25 మదింపు సంవత్సరానికి ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ఫైలింగ్‌ సీజన్‌ అతి సమీపంలో ఉంది. రిటర్న్‌ ఫైలింగ్‌ కోసం అన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఫామ్‌-16 జారీ చేస్తాయి. జీతం రూపంలో ఆదాయం పొందే పన్ను చెల్లింపుదార్లకు ఇది చాలా కీలక డాక్యుమెంట్‌. ఇన్‌కం టాక్స్‌ రిటర్న్‌ ఫైల్‌ (ITR Filing) చేసే సమయంలో ఫామ్‌-16 బాగా ఉపయోగపడుతుంది, అసెసీ పనిని సులభం చేస్తుంది.

 

ఇంకా చదవండి:  త్వరలో టీడీపీలో చేరనున్న వైసీపీ ఎంపీ!! అధిష్టానం గ్రీన్ సిగ్నల్!!

 

ఫామ్-16 అంటే ఏమిటి?

ఫారం-16 అనేది పర్సనల్‌ డాక్యుమెంట్‌. ప్రతి ఉద్యోగికి ఎవరి ఫామ్‌-16 వాళ్లకు అందుతుంది. ఇందులో, ఆ ఉద్యోగికి చెందిన కీలక సమాచారం, అంటే.. ఉద్యోగికి ఇచ్చిన జీతం (salary), ఉద్యోగి క్లెయిమ్ చేసిన తగ్గింపులు (Deductions), కంపెనీ యాజమాన్యం కట్‌ చేసిన TDS (Tax Deducted At Source) సమాచారం ఇందులో ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 203 ప్రకారం, కంపెనీలు తమ ఉద్యోగులకు ఫారం-16 ఇవ్వడం తప్పనిసరి.

 

ఇంకా చదవండి:  వైసీపీ నవ మోసాలపై చర్చించేందుకు మేము సిద్దం! విశాఖ శంఖారావం సభలో నారా లోకేశ్ ప్రసంగం!

 

ఫామ్‌-16 పొందిన తర్వాత, ఆదాయపు పన్ను రిటర్న్‌ ఫైల్‌ చేయడానికి తాత్సారం చేయకూడదు. 2024 ఏప్రిల్‌ 01 నుంచి ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేయవచ్చు. ITR దాఖలుకు జులై 31 వరకు గడువు (ITR Filing Deadline 2024) ఉంటుంది. చివరి రోజుల్లో పోర్టల్‌లో రద్దీ పెరిగి ఇబ్బందులు తలెత్తడం గతంలో చాలాసార్లు కనిపించింది. కాబట్టి, తుది గడువు వచ్చే వరకు వేచి ఉండటం సరికాదు. 2024 జులై 31 తర్వాత ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలంటే ఆలస్య రుసుము కట్టాలి.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేడు (19-2-2024) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!!

 

'ఢిల్లీ ఛలో' కార్యక్రమాన్ని నిలిపివేసిన రైతులు!!

 

సౌదీ: రికార్డ్ స్థాయిలో వెల్లివిరుస్తున్న టూరిస్టులు! ఎన్నో ఆకర్షణలు, ఆఫర్లు! UN నివేదిక ప్రకారం!

 

మీడియాపై జగన్ ఫ్యాక్షన్ దాడి!! ఖండించిన నారా లోకేష్

 

ఆరోసారి ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్! సమన్లు చట్ట వ్యతిరేకం!

 

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #IncomeTax #IncomeTaxReturn #IncomeTaxProcess #IncomeTax2024 #IncomeTaxReturnFiling #ITRFiling #TDS #Salary #TxCeductedAtSource #Deductions #ITRFilingDeadLine #IncomeTaxReturnFilingForm-16