మోదీ ప్రసంగం అంతరాయంపై మల్లగుల్లాలు పడుతున్న పోలీసులు!! విధి నిర్వహణలో ఉండాల్సిన ఎస్పీ కారులో!!

Header Banner

మోదీ ప్రసంగం అంతరాయంపై మల్లగుల్లాలు పడుతున్న పోలీసులు!! విధి నిర్వహణలో ఉండాల్సిన ఎస్పీ కారులో!!

  Tue Mar 19, 2024 06:02        Politics

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. సాక్షాత్తూ ప్రధాని హాజరైన సభలో కీలకమైన డి-గ్యాలరీ సమీపంలో తోపులాటలు చోటుచేసుకోవడం, వాటర్ బాటిళ్లు విసురుకోవటం వంటివి చేస్తున్నా పోలీసులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన వేదికకు సమీపంగా ఉండే గ్యాలరీల్లోకి వీవీఐపీ, వీఐపీ పాస్లు ఉన్నవారిని మాత్రమే అనుమతించాలి.

 

మరిన్ని ఆసక్తికర ఎక్స్ క్లూజివ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

పోలీసు ఉన్నతాధికారులు పాసుల్లేని వారిని కూడా అనుమతించేయడంతో గ్యాలరీల్లోకి లెక్కకు మించి జనాలు చేరడం కూడా తోపులాటకు కారణమైంది. ఈ గ్యాలరీల వద్ద గుంటూరు రేంజ్లో పని చేసే ఇద్దరు ఎస్పీలతో పాటు విశాఖ రేంజ్ పరిధిలోని మరో ఎస్పీని విధి నిర్వహణకు కేటాయించారు. అయితే వారెవరూ తోపులాటల సమయంలో అక్కడ అందుబాటులో లేరు. ఒకవైపు రభస చోటుచేసుకుని మైకుల స్టాండ్ల పైకి ప్రమాదకరంగా ఎక్కుతున్న వ్యక్తుల్ని గుర్తించి వారి ప్రాణాల్ని కాపాడాలని ప్రధానమంత్రే విజ్ఞప్తి చేసినా పోలీసులు పట్టించుకోలేదు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఆ సమయంలో అక్కడ విధి నిర్వహణలో ఉండాల్సిన ఎస్పీ కారులో కూర్చొన్నారని సహచర పోలీసులే అంటున్నారు. మరో ఎస్పీకి ఇక్కడ చోటుచేసుకుంటున్న తోపులాటల్ని తెలియజేద్దామని ఫోన్ చేస్తే ఆయన ఫోన్ అందుబాటులోకి రాలేదని, ఇలాంటి పరిస్థితుల్లో తమకు సరైన ఆదేశాలు లేకుండా ఏం చేయగలమని కొందరు పోలీసులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు, డీఎస్పీలు వంటివారు దూరంగా ఉండటంతో గ్యాలరీల్లో ఏం జరుగుతోందో తెలియకుండా పోయింది.

 

ఇవి కూడా చదవండి:

చిలకలూరిపేటలో సభపై ప్రధాని మోదీ ట్వీట్! కీలక వ్యాఖ్యలు!

 

ప్రపంచ పర్యాటకులు అత్యధికంగా ఇష్టపడుతూ వెళుతున్న 10 ప్రముఖ దేశాలు! మొదటి స్థానం ఆశ్చర్యకరంగా ఈ దేశం!

 

ఆంధ్ర పోలీసులపై చర్యలకు సిద్ధమవుతున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్? ఫిర్యాదుల విలువ!

 

గవర్నర్ తొలగించక ముందే రాజీనామా చెయ్యి! గౌతమ్ సవాంగ్ కు తీవ్ర హెచ్చరిక! తప్పు చేసినా బొకాయింపు

 

Evolve Venture Capital  

 

వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!

 

మేదరమెట్ల దగ్గర ఎమర్జెన్సీ రన్ వే!! సక్సెస్‍ఫుల్‍గా విమానాల ట్రయల్ రన్!! పెద్ద సంఖ్యలో ప్రజలు!!

 

వైసీపీ కొత్త ప్లాన్!! 30 రోజుల్లో రాష్ట్రాన్ని చుట్టేయనున్న జగన్!!

 

సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఈసీ!! హద్దు దాటారో డేంజర్ బెల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #NarendraModi #PrajaGalam #NarendraModi #APPolice #Rachhabanda #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh