వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!
Mon Mar 18, 2024 18:15 Exclusives, Politicsఆంధ్రప్రదేశ్లో వైసీపీని ఓటమి భయం వెంటాడుతుంది.
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న మీడియాపై వైకాపా మూకలను దాడులకు ఉసిగొలుపుతున్నారు.
ప్రభుత్వo ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజల్లోకి తీసుకు వెళుతున్న ప్రతిపక్ష నేతలపై ఐదేళ్లుగా దాడులకు తెగబడటం అక్రమ కేసులు బనాయించడం వేధించడం జరుగుతూనే ఉంది.
ఈయన చెబుతున్న అబద్దాలను మీడియా ముఖంగా పలు పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా బహిర్గతం చేస్తున్నాయి.
విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేశానని చెబుతున్న ఈయన విదేశీ విద్యను ఆపి పేదల జీవితాలను దుర్భరం చేశారు.
మరిన్ని ఆసక్తికర ఎక్స్ క్లూజివ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వసతి దీవెన పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీల హాస్టల్లను నాశనం చేశారు.
విద్యా దీవెన పేరుతో ఫీజు రియంబర్స్మెంట్ ని ఎగ్గొట్టి విద్యార్థుల విద్యను మధ్యలో ఆగిపోయే స్థితికి తీసుకొచ్చారు.
ఒక ప్రభుత్వం నడిపే పాలకులు నిజాయితీగా ఉండాలి తప్ప నోరు విప్పితే అన్ని అబద్ధాలే ఆడితే అది ప్రజలను మోసం చేసినట్లు కాదా!
ప్రతిపక్షాలు గాని పత్రికలు కానీ ప్రభుత్వం చేస్తున్న పాలన వైఫల్యాలను ఎత్తిచూపితే వాటిని సరిదిద్దుకోవాలి.
లేదా వారు చేస్తున్న ఆరోపణలలో నిజం లేకపోతే మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిజాలను బహిర్గతం చేయాలి.
వైసిపి నాయకుడి పిట్టలదొర వాగ్దానాలు! లక్షల కోట్ల రాష్ట్ర సంపద దోపిడి!
ప్రభుత్వం ఆ పని మానేసి మీడియాపై దాడులకు తెగబడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం.
ఈయన కూడా సాక్షి పత్రిక సాక్షి టెలివిజన్ నడుపుతున్నారు.
సాక్షి పత్రికలో అన్ని పేజీలలో ప్రతిపక్షాల పైన ప్రతిరోజు అబద్దాలను అల్లి కథలుగా ప్రచురిస్తూ ఉంటుంది.
ఆ మీడియా పై కూడా ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు దాడులు చేస్తే పరిస్థితి ఏమిటో ఒకసారి అర్థం చేసుకోవాలి.
మీడియా స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వమే వారి కార్యకర్తలను దాడులకు ఉసిగొలిపితే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
శాంతి భద్రతలను కాపాడవలసిన ప్రభుత్వాలే రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తే సామాన్య ప్రజల జీవన పరిస్థితులు ఏమిటో అర్థం కావడం లేదు.
ప్రభుత్వ చర్యలతో నష్టపోయిన వారు ప్రభుత్వంపై సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే సిఐడి అధికారులు రాత్రికి రాత్రి అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారు.
మూడు రాజధానుల పేరుతో ఐదేళ్ల ఈయన పాలనపై అమరావతి ప్రాంత రైతులు ఆర్థిక స్థితిగతులు చిన్నభిన్నమయ్యాయి.
జీవనాధారమైన భూములను రాజధాని కొరకు ఇచ్చి ఈయన మూడు రాజధానుల నిర్ణయంతో ఆధారాన్ని కోల్పోయి ఆ ప్రాంత రైతులు రోడ్ల పాలయ్యారు.
ఎన్నికల ముందు ఆంధ్రజ్యోతి, ఈనాడు ప్రతినిధులు సంస్థలపై దాడులు ఈయన పరోక్ష హెచ్చరికగా తెలుస్తోంది.
ఒక చెల్లి రాజకీయ పోరాటం!! మరో చెల్లి న్యాయపోరాటం!! తల్లి మౌన పోరాటం!!
పోలీసులను కూడా పక్కకు నెట్టి మీడియా కార్యాలయం పై దాడులకు తెగబడితే నేటి వరకు పోలీసులు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు.
ఈయన సిద్ధం సభలోనే మీడియా ప్రతినిధిపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై కేసులు నమోదు కాలేదు.
ఈయన పాలనలో వైకాపా నేతలు హత్యలు చేసినా, హత్యాయత్నాలు చేసినా, అత్యాచారాలు చేసినా పోలీసులు, చట్టం కళ్ళు మూసుకోవాల్సిందే అన్నట్లుగా తయారైంది.
వైఖ్యాత నేతలు అక్రమ మద్యం వ్యాపారం చేసిన గంజాయి లాంటి మత్తు పదార్థాలు విక్రయాలు జరిపిన పోలీసులు కేసులు నమోదు చేయరు.
పేద ప్రజలకు అందించే రేషన్ బియ్యాన్ని లారీలకు లారీలు కాకినాడ ప్రాంతంకు తరలించి వాటిని సన్నబియంగా మార్చి అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా చేస్తున్న పాలకులకు పోలీసులు అండ.
ఆంధ్రప్రదేశ్లో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం... అపహాస్యం అవుతున్న రాజ్యాంగం...
చట్టాన్ని కాపాడవలసిన ప్రభుత్వం పోలీసులు అరాచకాలను సృష్టిస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారకుండా ఎలా ఉంటుంది.
త్వరలో జరిగే ఎన్నికలలో వైసిపి ప్రభుత్వం సహకారంతో అరాచక శక్తులు మరింత పెట్రేగిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.
ఎన్నికలు గవర్నర్ పాలనలో జరిగితే తప్ప రాష్ట్రంలో ప్రశాంతంగా జరిగే పరిస్థితులు కనిపించడం లేదు.
వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గుండా గిరి పాలనకు ప్రజలు చరమగీతం పాడడానికి సిద్ధపడకపోతే ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ రాష్ట్రంగా మారే ప్రమాదం ఉంది.
ఇవి కూడా చదవండి:
మేదరమెట్ల దగ్గర ఎమర్జెన్సీ రన్ వే!! సక్సెస్‍ఫుల్‍గా విమానాల ట్రయల్ రన్!! పెద్ద సంఖ్యలో ప్రజలు!!
ఖమ్మం ఎంపీ సీటు టీడీపీకి? వ్యతిరేకిస్తున్న బీజేపీ!!
వైసీపీ కొత్త ప్లాన్!! 30 రోజుల్లో రాష్ట్రాన్ని చుట్టేయనున్న జగన్!!
చిలకలూరిపేటలో సభపై ప్రధాని మోదీ ట్వీట్! కీలక వ్యాఖ్యలు!
సభ అనంతరం చంద్రబాబు పవన్ తో మోడీ భేటీ! బాబు అరెస్టు ఆరోగ్యం పై ఆరా!
ఏపీ ఫైబర్ నెట్ బరితెగింపుపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు!! కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు!!
ఓటర్ల కోసం ప్రత్యేక యాప్!! ఒక్క మెసేజ్ చాలు 100 నిమిషాల్లో మీ ముందు!
గవర్నర్ తొలగించక ముందే రాజీనామా చెయ్యి! గౌతమ్ సవాంగ్ కు తీవ్ర హెచ్చరిక! తప్పు చేసినా బొకాయింపు
ఎన్నికల సంవత్సరంగా 2024!! ప్రపంచ చూపంతా భారత్ వైపే!! మాకు సవాల్... సీఈసీ
ఎన్నికల కమీషన్ ముఖ్య నిఘా వీటిమీదే!! డిజిటల్ పేమెంట్స్ డేంజర్!! తప్పేదైనా చర్యలు తీవ్రం!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
#ElectronicMedia #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh #BabuSuper6
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.