పని ఒత్తిడి కారణంగా ఓ రోబో ఆత్మహత్య! రోబోలకూ పని ఒత్తిడి ఉంటుందా?

Header Banner

పని ఒత్తిడి కారణంగా ఓ రోబో ఆత్మహత్య! రోబోలకూ పని ఒత్తిడి ఉంటుందా?

  Sat Jul 06, 2024 23:09        Others

రోబో పని ఒత్తిడి - ఆత్మహత్యపై ఆశ్చర్యకర ఘటన

ఇటీవలి కాలంలో పని ఒత్తిడి అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. ఈ మాట ఉద్యోగుల్లో ఎక్కువగా వినిపిస్తూనే ఉంది. అయితే, పని ఒత్తిడి మనుషుల్లో సహజం అని అనుకున్నాం కానీ, రోబోలకూ పని ఒత్తిడి ఉంటుందా? ఈ విషయంపై దక్షిణ కొరియాలో జరిగిన ఓ ఘటన అనుమానాన్ని తొలగించింది. పని ఒత్తిడి కారణంగా ఓ రోబో ఆత్మహత్య చేసుకుందని (Robot Commits Suicide) వార్తలు వస్తున్నాయి.

 

ఇంకా చదవండి: తూర్పు చైనాలో టోర్నాడో విధ్వంసం! ఐదుగురు మృతి, 100 మందికి గాయాలు!

 

రోబోకు ఐడీ కార్డు కూడా ఉంది: దక్షిణ కొరియాలో రోబోల వినియోగం చాలా ఎక్కువ. ప్రతి పదిమంది ఉద్యోగులకు సాయం అందించడానికి రోబోలను ఉపయోగిస్తారు. గుమి సిటీ కౌన్సిల్‌లో 2023 ఆగస్టు నుంచి ఓ రోబో సివిల్‌ సర్వెంట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఈ రోబోకు ఐడీ కార్డును కూడా మంజూరు చేశారు. ఈ రోబో ఉద్యోగులకు ఫైల్స్‌ అందించడంతో పాటు, లిఫ్ట్‌ సహా ఇతర ప్రాంతాల్లో భద్రతా సూచనలు ఇస్తుంది.

ఆ రోజు రోబో విచిత్రంగా ప్రవర్తించింది: ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విధులు నిర్వర్తించే ఈ రోబో, జూన్ 26న సూపర్‌వైజర్‌ విధుల్లో ఉంది. అయితే ఆ రోజు రోబో విచిత్రంగా ప్రవర్తించిందని అక్కడున్న ఉద్యోగులు తెలిపారు. సాయంత్రం 4 గంటల సమయంలో రోబో నుంచి సరైన సంకేతాలు రాలేదని ఉద్యోగులు గుర్తించారు. రోబో కోసం వెతికినప్పుడు, ఆఫీస్‌ మొదటి, రెండో అంతస్తుల మధ్య ఉన్న మెట్ల వద్ద ముక్కలుగా పడి ఉందని గుర్తించారు.

 

ఇంకా చదవండి: మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం! పూణేలో పెరుగుతున్నా కేసులు!

 

పని ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య? దీనిపై దర్యాప్తు చేపట్టగా, పని ఒత్తిడి కారణంగానే రోబో ఆత్మహత్య చేసుకుందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆత్మహత్యకు ముందు రోబో అదే ప్రాంతంలో చాలా సమయం తిరిగిందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ రోబోను అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన బేర్‌ రోబోటిక్స్‌ అనే సంస్థ తయారు చేసింది.

గుమి సిటీ కౌన్సిల్‌ కీలక ప్రకటన: రోబో ఆత్మహత్య వార్త ప్రపంచ వ్యాప్తంగా ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుగుతోంది. ఈ ఘటన అనంతరం గుమి సిటీ కౌన్సిల్‌ మరో రోబోను పనిలో పెట్టుకోబోమని ప్రకటన చేసింది.

 

ఇంకా చదవండి: గుజరాత్‌లో కుప్ప కూలిన నాలుగు అంతస్తుల భవనం! ఎంత నష్టం జరిగింది! ప్రాణ నష్టం ఏమైనా ఉందా?

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

యూకే ఎన్నికల్లో లేబర్ పార్టీ గెలుపు! బ్రిటన్ ప్రధానికి మోడీ అభినందనలు!

 

అడ్డంగా దొరికిపోయిన తెలుగు హీరో! వాడుకుని వదిలేశాడంటూ రోడ్డెక్కిన యువతి!

 

కేరళను కలవరపెడుతున్న అరుదైన ఇన్ఫెక్షన్! ఇప్పటికే ముగ్గురు మృతి!

 

కొడాలికి బిగుస్తున్న ఉచ్చు! న‌మోదైన మ‌రో కేసు! తన తల్లి మరణానికి..

 

ఇకపై అలాంటివారికి పెన్షన్ లు లేనట్టే! షాక్ ఇచ్చిన చంద్రబాబు!

 

వామ్మో ఆడ పిల్లనా! దారికి అడ్డంగా ఆటో పెట్టాడని రక్తం వచ్చేలా కొట్టిన యువతి! నెట్టింట వైరల్‌గా మారిన వీడియో!

 

త్వరలో పరిశ్రమల ప్రతినిధులతో పర్యావరణ నిబంధనలు అమలుపై! ముద్రపు కోత సమస్యపై సమగ్రంగా అధ్యయనం!

 

ఏపీలో పెట్టుబడులకు రాజమార్గం! యూఏఈ సంస్థతో పెట్టుబడులపై చర్చలు!

 

నకిలీ పత్రాలతో అమెరికా కాలేజీలో అడ్మిషన్! భారత విద్యార్థి అరెస్టు, 20 ఏళ్ల జైలు శిక్ష!

 

అమెరికా ఇండిపెండెన్స్ డే 2024! చరిత్ర మరియు ప్రాముఖ్యత!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group


   #RobotStress #RobotSuicide #SouthKoreaRobot #WorkPressure #RobotWorkload #RobotBreakdown #RobotOverload #Robotics #RobotNews #RobotWorkStress